For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  5000000 ఇచ్చి వెళ్లమంటే.. ముఖం మీద కొట్టేసి వెళ్తా.. యాంకర్ రవికి వార్నింగ్

  |

  బిగ్‌బాస్ ఇంటిలో కొనసాగుతున్న కెప్టెన్సీ టాస్క్ కారణంగా కంటెస్టెంట్ల మధ్య తీవ్రంగా అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఒకరికొకరు ఘాటుగా విమర్శించుకొన్నారు. అంతేకాకుండా తనను టార్కెట్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. అయితే సాగర సోదరా, పంతం నీదా నాదా? టాస్క్ అనంతరం ఇంటి సభ్యులందరిలోనే ఆవేశం కనిపించింది. టాస్క్ తర్వాత యాంకర్ రవి, శ్రీ రామచంద్ర మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శించుకొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రవి చాలా ఎమోషనల్ అయ్యారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే....

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  నీకు మెచ్యురిటీ లేదంటూ

  నీకు మెచ్యురిటీ లేదంటూ

  సాగర సోదర టాస్క్ తర్వాత కెప్టెన్లు మానస్, శ్రీ రామచంద్ర మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. ఒకరి టీమ్‌ను మరొకరు గట్టిగా సమర్ధించుకొంటూ కనిపించారు. ఓ దశలో నీకు మెచ్యురిటీ లేదు. నీ వయసుకు తగిన పరిణితి కనిపించడం లేదు అంటూ ఒకరికొకరు దూషించుకొన్నారు. ఆ సమయంలో వారిద్దరిని యాంకర్ రవి చల్లబరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు కొలిక్కి రాలేదు.

   నీ గేమ్ నీది.. నా గేమ్ నాది..

  నీ గేమ్ నీది.. నా గేమ్ నాది..

  ఆ తర్వాత రిలాక్స్ అవుతూ టాస్క్ సందర్భంగా జరిగిన విషయాలపై ఘాటుగా రవి, శ్రీరామచంద్ర చర్చించుకొన్నారు. నీ గేమ్ నీది.. నా గేమ్ నాది. నా టీమ్ సభ్యుల అభిప్రాయలను గౌరవించడం నాకు ముఖ్యం. అలాంటి సమయంలో నీవు నాపై వ్యక్తిగతమైన కామెంట్లు ఎలా చేస్తావు. నీవు ఇలా చేయి అలా చేయి అని ప్రశ్నించడానికి నీవు ఎవరు. నీకు ఆ హక్కు ఎవరిచ్చారు అంటూ యాంకర్ రవిని శ్రీరామచంద్ర ప్రశ్నించాడు.

  నా అభిప్రాయం మాత్రమే చెప్పానని రవి

  నా అభిప్రాయం మాత్రమే చెప్పానని రవి

  అయితే శ్రీరామచంద్ర తీవ్రంగా స్పందించడంతో నేను అలా చేయలేదు. గౌరవంగా నేను సర్ది చెప్పేందుకు ప్రయత్నించాను. నా అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నించాను అని రవి అంటే.. నీ ఒపీనియన్ నువ్వు నాకు చెప్పకు. నీ సేఫ్ గేమ్ నువు అడకు. నీవు నాతో మైండ్ గేమ్ ఆడకు అని శ్రీరామచంద్ర అన్నారు.

   నీ స్ట్రాటజీ ఏమిటో నాకు తెలియదు

  నీ స్ట్రాటజీ ఏమిటో నాకు తెలియదు

  బిగ్‌బాస్‌లో టైటిల్ గెలువడానికి నీ స్ట్రాటేజీ ఏమిటో నాకు తెలియదు. ఇలాంటి విషయాలను నేను నామినేషన్ సమయంలో చెప్పగలను. కానీ నాకు అది అవసరం లేదు కాబట్టి నేను ఇప్పుడే నీ ముఖం ముందే చెప్పేస్తున్నాను. కేవలం మీరంతా మంచి వాళ్లే అనే అభిప్రాయం ఉంది. దానిని కొనసాగించేలా చూసుకోవాలి. నీవు గెలుస్తే నాకు సంతోషం. ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్లు గెలుస్తారనే నమ్మకం ఉంది అని శ్రీరామచంద్ర అన్నాడు.

  నీ ఒపినియన్స్ నాపై రుద్దకు అంటూ

  నీ ఒపినియన్స్ నాపై రుద్దకు అంటూ

  అంతేకాకుండా యాంకర్ రవి తీరును శ్రీరామచంద్ర ఎండగట్టారు. నేను తెలుగు వారందరితో మంచి ఉండాలని ప్రయత్నిస్తున్నాను. అంతేకానీ నాపై నీ అభిప్రాయాలను రుద్దకు. నాకు 50 లక్షలు ఇచ్చి వెళ్లిపోమంటే.. వాళ్ల మొఖాన కొట్టి వెళ్తాను. కానీ నీవు నీతో లాంగ్ రిలేషన్‌షిప్ కావాలని అనడం హ్యాపీగా ఉంది. కానీ ఈ రోజు నీ బిహేవియర్ నాకు నచ్చలేదు అని శ్రీరామచంద్ర అన్నాడు.

  గేమ్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలి..

  గేమ్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలి..

  ఆ తర్వాత తన టీమ్ సభ్యులతో యాంకర్ రవి చర్చించాడు. శ్రీరామచంద్ర టీమ్ సభ్యులు తన ఓటమిని అంగీకరించలేకపోతున్నారనే అభిప్రాయాన్ని మానస్ టీమ్ సభ్యులు వ్యక్తం చేశారు. గేమ్‌ను గేమ్‌గా తీసుకోవాలి అని శ్వేతా వర్మ అన్నారు. అయితే గెలుపు, ఓటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలి అని ఆర్జే కాజల్, శ్వేత వర్మ సూచించారు. ఇలా టాస్క్ ఇంటి సభ్యులను అసంతృప్తికి గురిచేసింది.

  English summary
  Sreerama Chandra warning to Anchor Ravi, Sreerama Chandra questioned Anchor Ravi, Bigg Boss Telugu 5 day 9th day and 10th day episode: Captaincy task goes more Physical. Pantam Neend Nada Task is going on for Captaincy contender. Apart form this six members Nominated for Second week. As per Reports, Priya, Lobo, Uma, Nataraj Master, Anee Master, RJ Kajal nominted for second week nominations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X