Bigg Boss Telugu 5: నా టీషర్ట్‌లో చేయిపెట్టి? చిల్లరదానా.. కార్తీకదీపం ఉమపై అనీమాస్టర్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో 9, 10వ రోజుల్లో కెప్టెన్సీ టాస్క్ గేమ్ కొనసాగింది. అయితే టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు, గొడవలు, భౌతిక హింస కనిపించింది. అయితే పలుమార్లు బిగ్‌బాస్ హెచ్చరించి ఆటను నిలిపేశాడు. అయినా తమ టీమ్ గెలుపు కోసం చాలా గట్టిగానే పోరాడారు. అయితే ఈ టాస్క్‌లో ఎవరు పైచేయి సాధించారంటే...

శ్రీ రామచంద్ర, మానస్ టీమ్‌ల మధ్య
పంతం నీదే నాదా టాస్క్‌లో బేటేన్ సొంతం చేసుకోవడానికి రెండు టీమ్‌లో హోరాహోరీగా ప్రయత్నించాయి. శ్రీ రామచంద్ర టీమ్, అలాగే మానస్ టీమ్ గొడవల మధ్య ఆటను కొనసాగించాయి. ఓ దశలో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న శ్రీ రామచంద్ర, మానస్ నువ్వెంత అంటే.. నువ్వెంత అని అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి యాంకర్ రవి ప్రయత్నించారు.

లోబో కంటతడి...
ఇక ఆరోగ్యం బాగా లేకపోవడంతో లోబో టాస్క్‌కు దూరంగా ఉన్నారు. ఓ దశలో నాకేమైనా అయితే నా ఫ్యామిలీ ఏవుతుందని ఏడుస్తూ కనిపించారు. దాంతో శ్రీరామచంద్ర, మానస్ ఓదార్చుతు కనిపించారు. అయితే నాకేమైనా అయితే ఎవరూ హెల్స్ చేయరంటూ బాధలో మునిగిపోయారు. లోబోను ఊరడించేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నించారు.

నా టీషర్టులో చేయిపెట్టి అంటూ
ఇక బేటేన్స్ సొంతం చేసుకొనేందుకు ప్రయత్నించే సమయంలో అనీ మాస్టర్‌కు, ఉమకు భారీ గొడవ జరిగింది. టీషర్టులో బేటేన్స్ దాచుకొంటే.. వాటిని తీసుకోవడానికి ఉమ ప్రయత్నించింది. అయితే పెనుగులాటలో టీషర్ట్‌ను పట్టి లాగడంతో ఉమపై అని మాస్టర్ గొడవ పడింది. నా టీషర్టు చించడానికి ప్రయత్నించారని ఆరోపించడంతో ఉమ ఘాటుగా స్పందించింది.

చింపుతావా అంటూ అనీ మాస్టర్
అనీ మాస్టర్ చిల్లర దానివి అంటే.. ఆ నేను చిల్లర్ అయితే నువ్వు క్లాసువా? అని ఉమ గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఒకరికొకరు బూతులు తిట్టుకొన్నారు. నా టీషర్టు చించుతావా అని అనీ మాస్టర్ అంటే చింపుతా అంటూ ఉమ సమాధానం ఇచ్చింది. అనీ మాస్టర్, ఉమను వేరుగా తీసుకెళ్లి గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు.

భౌతిక దాడులు, హింసతో బిగ్‌బాస్ ఆగ్రహం
కెప్టెన్స్ టాస్క్ సందర్భంగా భౌతికంగా దాడులు చేసుకోవడంతో పలు మార్లు ఆటను వాయిదా వేశారు. ఇంటిలో హింసకు తావు లేదని చెప్పారు. అయినా కంటెస్టంట్లు మాత్రం ఒకరిపైకి మరొకరు దూసుకెళ్తూ కనిపించారు. అలా టాస్కులను పూర్తి చేశారు. టాస్క్ పూర్తి అయ్యే సరికి రెండు టీమ్‌ల వద్ద చెరో అయిదు బేటెన్స్ ఉన్నాయి. అయితే ఈ టాస్క్ విజేతలు ఎవరనే విషయం గురువారం రోజున తేలనుంది.


Click it and Unblock the Notifications











