Bigg Boss దీపావళి స్పెషల్.. శ్రియ, దేవరకొండ బ్రదర్స్, సుమ రచ్చ.. ఇంకెన్నో అదిరే సర్ప్రైజ్ లు!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే విజయవంతంగా ఏడువారాల పూర్తిగా ఇప్పుడు 8 వారం ఆఖరికి చేరింది. వారమంతా గొడవలు, టాస్కులతో సీరియస్, సీరియస్ గా సాగిపోతూ ఉండే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తికరంగా మారుతుంటాయి. ఈ వారంలో దీపావళి కూడా ఉండడంతో ఆదివారం నాడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక సాధారణంగా ఆదివారం నాడు 9 నుంచి స్టార్ట్ అయ్యే ఎపిసోడ్, ఇప్పుడు స్పెషల్ ఎపిసోడ్ కావడంతో సాయంత్రం ఆరు గంటల నుంచే ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఆ వివరాల్లోకి వెళితే

శ్రియ హౌస్ లోపలికి
మామూలుగానే పండుగ స్పెషల్ అంటే ఒక రేంజ్ లో నిర్వహించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి వచ్చిన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ని మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా అనేక మంది సెలబ్రిటీలను హౌస్ లోపలికి రప్పించారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరెవరు హౌస్ లోపలికి వచ్చారు అనే విషయాన్ని తాజాగా విడుదలైన ప్రోమో లో చూపించారు.
ప్రోమో లో చూపించిన దాని ప్రకారం ముందుగా హీరోయిన్ శ్రియ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున శ్రియ కలిసి చాలా సినిమాలు చేసి ఉండడంతో వారిద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆమె రావడం రావడమే నాగార్జునకు హగ్ ఇచ్చింది.

అవికా గోర్ కూడా
ఆ తరువాత లోపల కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ మిమ్మల్ని చూసే నేను సిగ్గు పడడం నేర్చుకున్నాను అని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నది తెలియదు కానీ హౌస్ లోపల అందరూ సిగ్గు పడి పోవడం గమనార్హం. ఇక శ్రియ తర్వాత హీరోయిన్ అవికా గోర్ కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఒక మాస్ నెంబర్ కి డాన్స్ చేసింది.
డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆమె సాంగ్ పర్ఫామెన్స్ పూర్తికాగానే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ బ్రదర్స్ ఇద్దరూ కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు.. ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా ఈ సినిమాను ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు ఆయన అన్నయ్య విజయ్ దేవరకొండ.

దేవరకొండ బ్రదర్స్
విజయ్ దేవరకొండ సమర్పిస్తూ వారిద్దరి తండ్రి ఈ సినిమాని నిర్మించడంతో ఎలా అయినా దాన్ని హిట్ కొట్టించే ప్రయత్నాల్లో ఉన్నారు దేవరకొండ బ్రదర్స్. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను అల్లు అర్జున్ లాంచ్ చేయగా దాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ బ్రదర్స్.
ఇక ఇందులో ఆనంద దేవరకొండకు సిరి ఐ లవ్ యు ఆనంద్ అని చెప్పడంతో నాగార్జున కోపం తెచ్చుకుని మొన్న నాకు చెప్పావు ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? ఇది కరెక్ట్ ఏనా అని అడిగితే, అది మొన్న ఇది ఇప్పుడు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది సిరి.
కల్పన కూడా
ఇక మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ కల్పన కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడమే కాదు షణ్ముఖ మీద ఒక స్పెషల్ సాంగ్ కూడా పాడింది. స్పెషల్ సాంగ్ పాడడమే కాక ఆసక్తికరంగా ఆమె కొన్ని కామెంట్స్ చేయడంతో షణ్ముఖ్ జస్వంత్ సిగ్గు పడుతున్నట్టుగా చూపించారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా యాంకర్ సుమ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
సుమ రావడం రావడంతోనే నాగార్జునతో మీరు యాంకరింగ్ ని సీరియస్ గా తీసుకుంటే మా లాంటి వాళ్ళు ఏమై పోవాలి అని అనడంతో మరి నువ్వేమో 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చావు అంటే నీది ఎంత బిజీ షెడ్యూల్ లో అర్థమవుతుంది అనడంతో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని అనడంతో అవును నాకు కూడా ఇస్తున్నారు కదా అని నాగార్జున అనడం ఆసక్తికరంగా మారింది.
Recommended Video

వారు కూడా
ఇక వారు మాత్రమే కాక ఈరోజు ఎపిసోడ్ లో మరిన్ని స్పెషల్ అప్పియరెన్స్ ఉండొచ్చు అని ముందునుంచే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న కొన్ని ఫోటోలు ప్రకారం, ఈరోజు ఈవెంట్ లో అరియానా, దివి, జబర్దస్త్ అవినాష్, బాబా భాస్కర్ మాస్టర్ అలాగే సోహెల్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ తెలుగు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నీ మరింత అందంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తయారు చేయించినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











