Bigg Boss: షణ్ముఖ్‌పై దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్.. ఆమెతో చేస్తే తప్పులేదా అంటూ అతడిపై ఓ రేంజ్‌లో!
నిజమైన సంఘటనలతో ప్రసారం అవుతూ.. ఊహించని మలుపులతో సాగుతూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే దానికి మాత్రమే ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తున్నారు. దీంతో మన షో నేషనల్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఐదోది కూడా వాటికి ఏమాత్రం తీసిపోకుండా నడుస్తోంది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా సిరి హన్మంత్ కోసం సన్నీతో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రియురాలు దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

ఫైటింగులతో రంజుగా సాగుతోంది
తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందన వస్తుంది. అందుకే ఈ సారి ప్రసారం అవుతోన్న సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కువ ఎమోషన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైటింగ్స్‌తో నడుపుతూ మరింత ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫైట్స్‌ను హైలైట్ చేస్తున్నారు. దీంతో రేటింగ్ భారీగానే దక్కుతోంది.

వాళ్లలో అతడే టాప్ కంటెస్టెంట్‌గా
గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇందులో సోషల్ మీడియా స్టార్ ఐదో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం అతడికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే.

మారిన ఆట.. మరింత పాపులారిటీ
ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. అనుకున్న రీతిలో హైలైట్ అవలేదనే చెప్పాలి. మొదట చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫలితంగా ఆరంభ వారాల్లో అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తూ టాస్కుల్లో తన సత్తాను చూపిస్తున్నాడు. దీంతో తరచూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

సిరి కోసం సన్నీతో ఫైట్‌కు దిగాడు
ఈ వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'టవర్‌లో ఉంది పవర్'. ఇందులో సిరి, సన్నీ, రవి, శ్రీరామ్‌లు పోటీ పడ్డారు. ఈ టాస్కు ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. మరీ ముఖ్యంగా సిరి హన్మంత్‌తో సన్నీ వాదన పెట్టుకున్నాడు. ఆ సమయంలో షణ్ముఖ్ జస్వంత్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య భారీ రేంజ్‌లో ఫైట్ జరిగింది.

షణ్ముఖ్‌కు సపోర్టుగా దీప్తి సునైనా
సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్‌తో గొడవ పడిన సమయంలో సన్నీ కంట్రోల్‌గా ఉన్నప్పటికీ కొన్ని పదాలను వాడాడు. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా షన్నూ అభిమానులు సన్నీని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునైనా దీనిపై స్పందించింది. ఈ మేరకు సుదీర్ఘమైన ఓ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

అలా అనుకో తప్పులేదు అంటూ
సన్నీ, షన్నూ గొడవపై దీప్తి స్పందిస్తూ 'అప్పడం అయిపోతావ్ అంటావా? నువ్వు బెస్ట్ అనుకో తప్పులేదు. మిగతా అందరినీ ఎందుకలా చూస్తున్నారు? చేతగాని ఆట ఏంటి? ఫిజికల్ అయి గట్టిగట్టిగా అరిస్తే ఆడినట్లా? ఫిజికల్ అవడం కన్నా మైండ్ గేమ్‌తో ఆడుతున్న షన్నూనే బెస్ట్. యూట్యూబ్ వరకే అంటారా? దాని వెనుక కష్టం తెలుసా' అంటూ సన్నీని ఏకిపారేసింది.
Recommended Video

ఆమెతో చేస్తే తప్పులేదా అంటూనే
సిరి సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. 'ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని షన్నూ గేమ్ ఆడుతున్నాడా? మరి మీకు కాజల్ సపోర్ట్ చేస్తే మేము అలాగే ఫీల్ అవుతున్నామా? షణ్ముఖ్ నాకు క్లోజ్ అన్నది పక్కన పెడితే వాడు బిగ్ బాస్‌లో ఎంతో మెచ్యూర్‌గా ఆడుతున్నాడు. హుందాగా కనిపిస్తున్నాడు. షన్నూ నీకు మరింత ధైర్యం కావాలని కోరుకుంటున్నా' అంటూ దీప్తి రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











