Bigg Boss Telugu 5: తెరపైకి మాజీ బ్యూటీ దీప్తి సునైనా.. ప్రియుడితోపాటు ఆ ఇద్దరి కోసం రంగంలోకి!

బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజురోజుకి వాతావరణం మారిపోతోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా మొదట్లో ఉన్నట్లుగా 6వ వారం తరువాత ఉండడం లేదు. చాలామందిలో చాలా మార్పులు వచ్చాయి అని అర్ధమవుతోంది. చాలా కూల్ గా ఉండే వారు కూడా ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. గ్రూపు రాజకీయాలు కూడా హైలెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ లో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇటీవల దీప్తి సునైనా కూడా అతని తనకి మాత్రమే కాకుండా మరో ఇద్దరికి కూడా మద్దతు ఇస్తోంది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

మొదట్లో కూల్ గా ఉన్న షన్ను

మొదట్లో కూల్ గా ఉన్న షన్ను

షణ్ముఖ్ జస్వంత్ నిజానికి మొదటి ఐదు వారాల పాటు కూడా చాలా సైలెంట్ గానే ఉన్నాడు. కేవలం ఇతరులు ఆటను మాత్రమే చూస్తూ చాలా సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు. ఎక్కువగా వివాదాలకు తావు ఇవ్వకుండా కూల్ గా అందరినీ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. శత్రుత్వం పెంచుకోకుండా నామినేషన్ లో ఒకరిద్దరిని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చాడు. దీంతో ఎవరు కూడా అతన్ని శత్రువు గా ఫీలయ్యే అవకాశం రాలేదు. కానీ ఇటీవల బిగ్ బాస్ సీక్రెట్ నామినేషన్ పేరుతో షన్ను లోని ఆ కోపాన్ని బయటకు తీశాడు.

 వారితో గ్యాండ్ మెయింటైన్ చేస్తూ

వారితో గ్యాండ్ మెయింటైన్ చేస్తూ

ఒకేసారి తొమ్మిది మంది షణ్ముఖ్ జస్వంత్ నామినేట్ చేయడంతో ఒక్కసారిగా తన ఆటలో కసిని పెంచాడు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇతరులతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాకుండా కొందరితో గొడవ కూడా పడ్డాడు. అయితే జెస్సీ సిరి కారణంగా అతను కొన్ని సార్లు నిందలు కూడా భరించాల్సి వచ్చింది. వీరు త్రిమూర్తులు అని హౌస్ లో ఒక పేరును అయితే సంపాదించుకున్నారు. కొన్నిసార్లు ఆ కామెంట్స్ వలన ఇబ్బంది పడాల్సి వచ్చింది.

 దీప్తి సునైనా కూడా ప్రత్యేకంగా ప్రచారాలు

దీప్తి సునైనా కూడా ప్రత్యేకంగా ప్రచారాలు

హౌస్ లో ఎలా ఉన్నా కూడా షణ్ముఖ్ జస్వంత్ అయితే బయట జనాల నుంచి రావాల్సిన ఆదరణను ఎప్పటిలానే అందుకుంటున్నాడు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా కూడా ప్రత్యేకంగా ప్రచారాలు మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ కు సంబంధించిన స్పెషల్ వీడియోలను కూడా ఆమె పోస్ట్ చేస్తోంది

సిరికి కూడా మద్దతు

సిరికి కూడా మద్దతు

కేవలం షణ్ముఖ్ జస్వంత్ కు మాత్రమే కాకుండా అతనికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి కూడా సపోర్ట్ చేసేందుకు కూడా దీప్తి సునైనా ముందుకు వస్తోంది. ఇక షన్ను సిరి ఇద్దరు కూడా హౌస్ లో ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అసలు వీళ్ళు లవ్ ట్రాక్ ని కొనసాగిస్తున్నారా లేక ఫ్రెండ్షిప్ఆ అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే దీప్తి సునయన మాత్రం సిరి కి మద్దతు తెలపడంతో షన్ను మీద ఆమె ఎంతో నమ్మకంతో ఉందో అర్థమవుతోంది.

Recommended Video

Manu Charitra Trailer Preface Video | Shiva Kandukuri, Megha Akash
వారికి కూడా దీప్తి మద్దతు

వారికి కూడా దీప్తి మద్దతు

ఇక సీనియర్ ఆర్టిస్టు ప్రియకు దీప్తి సునైనా మద్దతు పలకడం మరొక విశేషం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ న్యూస్ వైరల్ గా మారుతోంది. దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో సిరి తో పాటు ప్రియా గారికి మద్దతు ఇవ్వాలని ఓటు వేసి నామినేషన్స్ నుంచి రక్షించాలి అని ప్రత్యేకంగా కోరడం విశేషం. అభిమాను చూపిస్తున్న ప్రేమను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది. ఒక విధంగా షన్ను కి పాజిటివ్ టాక్ వచ్చేలా దీప్తి సునైనా చేపడుతున్న పనుల సోషల్ మీడియాలో బాగానే హైలెట్ అవుతున్నాయి. ఆమె చేస్తున్న ప్రమోషన్ ని ఎంత వరకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X