బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్? ఇద్దరిని నిలబెట్టి డోర్లు తెరిచిన బిగ్‌బాస్.. బ్రేకింగ్ న్యూస్ అంటూ నాగార్జున

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఆరోవారం ముగించుకోబోతున్నది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారనే విషయం ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా మారింది. అయితే ఇంటి నుంచి ఎవరిని బయటకు పంపించాలనే విషయాన్ని ఇంటి సభ్యులకే హోస్ట్ నాగార్జున వదిలేయడంతో బిగ్‌బాస్ హౌస్‌లో టెన్షన్‌గా మారింది. అయితే ఇంటి నుంచి ఇద్దరిని పంపించేందుకు తోటి సభ్యులు ఓటింగ్ వేశారు. అయితే ఇంటి నుంచి ఎవరు వెళ్తారనే విషయం ఇప్పుడు టెన్షన్‌గా మారింది. ఈ క్రమంలో మీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నానంటూ..

ఇంటి సభ్యులపై నాగార్జున మాటల కొరడా

ఇంటి సభ్యులపై నాగార్జున మాటల కొరడా

బిగ్‌బాస్ తెలుగు 5 వేదికపైన హోస్ట్ నాగార్జున మెరుపులు మెరిపించారు. ఎప్పుడూ నవ్వుతూ ఇంటి సభ్యులను పలకరిస్తూ కనిపించే మన్మథుడు అక్టోబర్ 16న ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో మాత్రం కోపంతోనే ఉన్నారు. ఇంటి సభ్యులకు క్లాస్ పీకుతూ, మాటల కొరడాను ఝుళిపించారు. ఈ ఇంటిలోని సీక్రెట్ రూమంలో ఓ కొత్త డ్రామాకు తెరలేపారు.

సీక్రెట్ రూమ్‌లో హై డ్రామా

సీక్రెట్ రూమ్‌లో హై డ్రామా

ఇంటి సభ్యులను ఒక్కొక్కరిని సీక్రెట్ రూమ్‌లో హోస్ట్ నాగార్జున పిలిచి.. ఇంటిలో ఉండడానికి అర్హత లేని ఒక్కరి పేరు చెప్పండి అంటూ టాస్క్ మొదలుపెట్టారు. దాంతో ఇంటి సభ్యులందరూ కంగారు పడ్డారు. అయితే ఇది మన మధ్య మాత్రమే ఉంటుంది. ఎవరికి లీక్ చేయబోము అంటూ నాగార్జున భరోసా ఇచ్చారు. అయితే తన దృష్టిలో ఇద్దరు ఉన్నారు అంటూ ఆర్జే కాజల్ అంటే.. ఒక్కరిపేరే చెప్పు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు.

బిగ్‌బాస్ ఈజ్ టఫ్

బిగ్‌బాస్ ఈజ్ టఫ్

ఇంటి నుంచి ఎవరిని పంపించాలనేది చాలా టఫ్ టాస్క్ అని ఆనీ మాస్టార్ అంటే.. ఎస్ బిగ్‌బాస్ ఈజ్ టఫ్ అంటూ కామెంట్ చేస్తూ వేదిక మీద కనిపించారు. అయితే ఇంటి సభ్యులు తమకు నచ్చని కంటెస్టెంట్ పేరు చెప్పారు. అయితే ఇంటి సభ్యులు ఓటింగ్ ముగిసిన తర్వాత 4 ఓట్లు ప్రియకు, 4 ఓట్లు లోబోకు వచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరిని బయటకు పంపించాలనేది ఇంటి సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని నాగార్జున ఆదేశించారు.

ప్రియ, లోబోను చెరోపక్క నిలబెట్టి

ప్రియ, లోబోను చెరోపక్క నిలబెట్టి


ఎలిమినేషన్ తర్వాత ఇంటి నుంచి కంటెస్టెంట్‌ను బయటకు పంపించే డోర్‌ను నాగార్జున ఓపెన్ చేయించాడు. నాలుగేసి ఓట్లను పొందిన ప్రియ, లోబోను చెరోపక్కన నిలబెట్టి.. ఇప్పుడు చెప్పండి.. ఎవరిని బయటకు పంపించాలో మీరే చెప్పండి అంటూ నాగార్జున ఆదేశించాడు. దాంతో తటపటాయించిన అనీ మాస్టర్‌ను గద్దిస్తూ.. క్విక్.. ఎవరో ఒకరి వైపు మీ మద్దతు తెలిపండి. వారికి పక్కన నిలిచి అండగా నిలువండి అంటూ నాగార్జున ఘాటుగా కామెంట్ చేశారు.

డబుల్ ఎలిమినేషన్ చేసి..

డబుల్ ఎలిమినేషన్ చేసి..

అయితే బిగ్‌బాస్‌లో ఆరోవారం ఇంటి నుంచి ఇద్దరిని బయటకు పంపించే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. ఇంటి సభ్యులతోనే బయటకు పంపించే కొత్త డ్రామాకు తెరలేపిన బిగ్‌బాస్.. డబుల్ ఎలిమినేషన్ పేరిట ఒకరిని సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వారం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రోమోను క్రియేట్ చేసింది.

6వ వారం నామినేట్ అయిన వారు వీరే..

ఆరోవారంలో బిగ్‌బాస్ ఇంటిలో మొత్తం పది మంది నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వారిలో యాంకర్ రవి, శ్రీరామచంద్ర, జెస్సీ, సిరి హన్మంతు, లోబో, వీజే సన్నీ, మానస్, ప్రియాంక, విశ్వ, శ్వేతా వర్మ ఉన్నారు. ఈ వారం అందరూ టాప్ సభ్యులు, టైటిల్ గెలవడానికి అర్హతవారే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X