Bigg Boss 5 Telugu Elimination: డేంజర్ జోన్‌లో హమీదా.. మరో గ్లామర్ హీరోయిన్‌పై వేలాడుతున్న ఎలిమినేషన్ కత్తి
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైన రోజే బిగ్‌బాస్ తొలి వారానికి జరిగే ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియను అంత్యంత గందరగోళం మధ్య నిర్వహించారు. ఇంట్లోకి అడుగుపెట్టిన ఓ రోజు తర్వాత ఈ ప్రక్రియను మొదలుపెట్టడంతో ఇంటి సభ్యులు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇంటి సభ్యులు వాదోపవాదాల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ తర్వాత ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే....

తొలివారమే నామినేషన్ల ప్రక్రియ
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఇంటి సభ్యులు అడుగుపెట్టిన మరుసటి రోజే నామినేషన్ల ప్రక్రియను నిర్వహించడం సరికాదనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వస్తున్నది. సాధారణంగా తొలి వారం తర్వాత ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టి ఉంటే... కంటెస్టెంట్ల ప్రతిభను, ప్రవర్తన, వారి నడవడికను అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తవుతున్నది. ఒక్క రోజులో ఇంటి సభ్యులను అంచనా వేయడం సరికాదనే అంటున్నారు.

నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ తెలుగు 5 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జస్వంత్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వారాంతంలో అంటే.. శనివారం, ఆదివారం రోజుల్లో హోస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చి ఆరుగురిలో ఐదుగురిని సేఫ్ చేసి.. ఒకరిని ఇంటి నుంచి పంపించేందుకు నిర్ణయం తీసుకొంటారు.

రికార్డు స్థాయిలో ఓటింగ్
అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన భారీగా రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అవుతున్నట్టు తెలుస్తున్ని. డిస్నీయాప్ ద్వారా, మిస్డ్ కాల్ ద్వారా ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు తాజా డేటా వెల్లడిస్తున్నటు సమాచారం.

ఎవరీ హమీదా అంటూ..
ఇక బిగ్‌బాస్ తెలుగు 5 షోలోకు అనూహ్యంగా తెరపైకి వచ్చిన కంటెస్టెంట్‌లో హమీదా ఖాతూన్ ఒకరు. అయితే షో ప్రారంభానికి ఆమె పేరు ఎక్కడ వినిపించకుండా నిర్వాహకులు జాగ్రత్త తీసుకొన్నారు. అయితే హమీదా కూడా అంతగా పేరు లేకపోవడంతో ఆమె ఈ షోలో వస్తారని ఎవరూ ఊహించలేదు. హమీదాను వేదిక మీద చూడగానే అందరూ ఆమె ఎవరు అని ఆరా తీసిన విషయం తెలిసిందే.

డేంజర్ జోన్‌లో హమీదా
ప్రస్తుతం తొలివారంలో ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న వారిలో హమీదా ముందు వరుసలో ఉందనే విషయం స్పష్టమవుతున్నది. అయితే హమీదాకు తెలుగులో అంతగా అభిమానులు లేకపోవడం ఒక కారణమైతే.. సోషల్ మీడియాలో బలంగా లేకపోవడం రెండో కారణమని చెప్పుకొంటున్నారు. ఆర్గానిక్‌గా, ప్రేక్షకులు నచ్చి ఓటు చేస్తే హమీదా ఎలిమినేషన్ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంది.

మోడల్ జస్వంత్‌కు ఎలిమినేషన్ ముప్పు
ఇక హమీదా తర్వాత ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న వారిలో మోడల్ జస్వంత్ ఉన్నారు. అయితే మంచి క్రేజ్‌తో ఇంట్లోకి అడుగుపెట్టిన జస్సీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇతరులతో పోల్చితే బాడీ లాంగ్వేజ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మోడలింగ్, ర్యాంప్ వాకింగ్‌లో మంచి ప్రతిభ ఉన్న ఆయన ఇంకా ఇంట్లో సెట్ కాలేదనే అనిపిస్తున్నది.
Recommended Video

సరయు కూడా ప్రమాదంలోనే...
ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియలో సరయ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియకు ఇంకా మూడు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులను హమీదా, జస్వంత్, సరయు ఆకట్టుకొన్నట్టయితే. ఎలిమినేషన్ నుంచి బయటపడే అవకాశం లేకపోలేదు. అయితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











