Bigg Boss Telugu 5 Elimination Today: షాకింగ్ గా టాప్ కంటెస్టెంట్ ఔట్.. ఎవరంటే?
ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ 11 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే అంశం మీద ముందు నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా ఆదివారం నాడు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం లీక్ అయింది. అయితే అందరూ ఊహించిన పేర్లు కాకుండా ఈసారి ఊహించని పేరు తెర మీదకు రావడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

19 మంది కంటెస్టెంట్ లతో
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైంది. మొదటి వారం నుంచి ఎక్కువగా లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. గత వారం నామినేషన్ ప్రక్రియలో హౌస్ కెప్టెన్ మానస్ మినహా హౌస్ లో ఉన్న ఏడు మిగతా ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళారు.

11 మంది ఎలిమినేట్
బిగ్ బాస్ సీజన్ 5 లో 11 వారాల్లో 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హౌస్ లో కేవలం 8 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మానస్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. షణ్ముఖ్, సిరి, రవి, సన్నీ, కాజల్, ప్రియాంక, శ్రీ రామచంద్ర నామినేషన్ లో ఉన్నారు.

భారీ అంచనాలు
ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దాని మీద ముందు నుంచి భారీ ఎత్తున అంచనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మేరకు షణ్ముఖ్, సన్నీలు ఫస్ట్ రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ సంగతి అలా ఉంచితే ప్రియాంక, కాజల్, సిరి ముగ్గురికీ తక్కువ వోటింగ్ వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక టాప్ 5 కంటెస్టెంట్ ఔట్ అవుతున్నాడు అని అంటున్నారు.

యాంకర్ రవి ఔట్
ఆయన ఎవరో కాదు యాంకర్ రవి. ఆవును మీరు విన్నది నిజమే. ఈ వారం రవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 5 లో ఇటీవల జరిగిన ఫైర్ ఇంజన్ టాస్క్ లో కంటెస్టెంట్ సన్నీ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలుచుకున్నాడు. హౌస్ లోకి వచ్చిన సన్నీ మదర్ కళావతితో ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను పంపించాడు బిగ్ బాస్. సన్నీ ఈ పాస్ ను తన కోసం వాడుకోవచ్చు, లేదా తనకు నచ్చిన ఇతర హౌస్ మేట్స్ కోసం వ్కాదచ్చు.
Recommended Video

ఎలిమినేషన్ మూమెంట్ లో
ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మేరకు కాజల్ కు ఎలిమినేషన్ మూమెంట్ లో సన్నీ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాడు అని దాంతో ఆమె సేవ్ అయి ఆమె తరువాత తక్కువ వోట్లు సాధించిన రవి ఎలిమినేట్ అయ్యాడని ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ ఎవిక్షన్ పాస్ సన్నీ గెలవడానికి కారణం కాజల్. మానస్ ఎంత చెప్పినా.. వినకుండా సన్నీని గెలిపించాలని భీష్మించుకుని ఫైర్ ఇంజన్ లో కూర్చోవడంతో ఫైనల్ గా సన్నీకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కింది. అందుకే తనకు అండగా ఉన్న స్నేహితురాలికి సన్నీ అండగా నిలబడడంతో ఇప్పుడు సన్నీ ఆమెకు హెల్ప్ చేశాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











