నీవు చేసిన తప్పుకు శిక్ష ఏం విధించాలి.. నాగార్జున ఫైర్.. కంటెస్టెంట్‌కు రెడ్ కార్డు.. ఎలిమినేట్ చేసిన బిగ్‌బా
బిగ్‌బాస్ ఇంటిలో రెండో వారంలో జరిగిన గొడవలు, పోట్లాటలు, దూషణలు ప్రేక్షకులకు ఇరిటేట్ కలిగించాయనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బిగ్‌బాస్‌లో వాడిన భాష, ఇంటి సభ్యుల వ్యవహర తీరు, ప్రవర్తన అసభ్యకరంగా మారాయి. జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో ఇంత దిగజారుడుతనమా అనే వాదన మొదలైంది. ఇలాంటి సమయంలో బిగ్‌బాస్ వేదిక మీద నుంచి ఇంటి సభ్యులకు నాగార్జున వీర లెవెల్ క్లాస్ పీకారు. తాజాగా జరిగిన విషయాల్లోకి వెళితే..

బాగానే ఆడారు కానీ.. ప్రవర్తనే బాగా లేదు..
ఇంటిలో రెండోవారం హౌస్ అంతా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆటలు బాగా ఆడారు. కానీ మీ ప్రవర్తనే బాగాలేదు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. బిగ్‌బాస్ షోలో ఇంటి సభ్యులు మాట్లాడితే.. బీప్స్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సరికాదు అంటూ నాగార్జున ఇంటి సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు.

నాగార్జున క్లాస్ పీకుతుంటే..
అయితే నాగార్జున క్లాస్ పీకుతుంటే.. శ్వేతా వర్మ మధ్యలో బ్యాడ్ వర్డ్స్ ఉపయోగించకూడదు అంటూ ఏదో చెప్పబోతే.. హోస్ట్ నాగ్ ఆమెను మందలించాడు. నేను నిన్ను అడుగ లేదు. నీతో నేను మాట్లాడటం లేదు కదా.. అంటూ నిలదీశాడు. ఆ తర్వాత బిహేవియర్ పరంగా నీవు చేసిన పనికి ఏం శిక్షించాలి అంటూ ప్రశ్నించాడు. దాంతో నేను చేసిన పనికి ప్రపంచం ముందు నాకు నేనుగా శిక్షించుకొంటాను అంటూ శ్వేతా వర్మ తన ముఖాన్ని రెండు చేతులతో గట్టిగా వాయించుకొన్నది.

వీజే సన్నీకి వార్నింగ్
ఆ తర్వాత వీజే సన్నీకి గట్టిగా క్లాస్ పీకారు.. నీవు మగాడివా..గిగాడివా అనడాన్ని నాగ్ తప్పుపట్టారు. ఆ మాట నేను అనలేదు అంటూ వీజే సన్నీ అన్నారు. ఆ తర్వాత నీ క్లాత్ ఎవరు తీశారు అని నాగార్జున ప్రశ్నిస్తే.. నేను టచ్ చేయలేదు అంటూ సన్నీ బదులిచ్చాడు. అయితే పక్కనే ఉన్న షన్నూను పిలిచి.. నీవు చెప్పు అంటే.. సన్నీ తీశాడు అని చెప్పడంతో నాగార్జున కోపగించుకొన్నాడు. ప్లీజ్ వీడియో చూపించండి అంటూ నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు.

ఉమాదేవికి రెడ్‌కార్డు ఇచ్చి ఎలిమినేషన్
ఇదిలా ఉండగా, ఇంటిలో నోటికి వచ్చినట్టు భాషను మాట్లాడిన ఉమాదేవిని గట్టిగా మందలించారనే విషయం బయటకు వచ్చింది. ఆమె మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని చెప్పి ఉమాదేవికి రెడ్ కార్డు ఇచ్చి ఇంటికి పంపించినట్టు సమాచారం. అయితే వాస్తవానికి నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కావాల్సింది. కానీ భాష, ప్రవర్తన తీరును బట్టి ఉమాను బయటకు పంపించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. అయితే అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఉమాదేవిని సీక్రెట్ రూమ్‌లోకి అంటూ..
ఇక ఉమాదేవిని పంపించడంపై ఇంటి సభ్యుల్లో మిశ్రమ స్పందన కనిపించినట్టు తెలిసింది. అయితే ఉమాదేవి వల్ల మంచి టీఆర్పీ వస్తున్నందున ఆమెను నిజంగా పంపించకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. అయితే రెడ్ కార్డు ద్వారా ఉమాదేవిని సీక్రెట్ రూమ్‌లోకి పంపించారనే విషయం కూడా బయటకు వచ్చింది. అయితే రెండు రోజులు ఆగితే.. అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











