For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss నిర్వాహకులపై ప్రియ కేసు నమోదు! ఇంటిలో అనైతికంగా అంటూ షాకింగ్ నిర్ణయం.. ఎలిమినేషన్ తర్వాత జరిగిందంటే

  |

  బిగ్‌బాస్ తెలుగు 5లో సినీ, టెలివిజన్ నటి ప్రియ అలియాస్ శైలజా ప్రియ ప్రయాణం ముగిసింది. టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉంటుందని భావించిన వారికి షాక్ తగిలేలా ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చారు. చిరు నవ్వులు చిందిస్తూ తనదైన గేమ్ ప్లాన్‌తో ఎదుటి కంటెస్టెంట్లలో అలజడి రేపిన ఆమె అంత తొందరగా బయటకు వస్తారని ఎవరూ ఊహించలేదు. అలాంటి కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై బిగ్‌బాస్ తెలుగు నిర్వాహకులపై ప్రియ కేసు నమోదు చేసినట్టు ఓ వార్త జాతీయ ఆంగ్ల వెబ్‌సైట్‌లో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  ఏడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి.. ఏడో కంటెస్టెంట్‌గానే..

  ఏడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి.. ఏడో కంటెస్టెంట్‌గానే..

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లోకి ఏడో నెంబర్ కంటెస్టెంట్‌గా ప్రియ ప్రయాణం మొదలుపెట్టింది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అంతేకాకుండా కొన్ని టాస్కుల్లో తనదైన గేమ్ ప్లాన్స్‌ను అమలు చేసి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. అయితే తన రియల్ గేమ్ ప్రారంభించగానే ఊహించని విధంగా ఎడోవారం ఎలిమినేషన్‌లో ఏడో సెలబ్రిటీగా ఇంటి బయటకు వచ్చేసింది.

  లహరి షారి, రవితో గొడవ

  లహరి షారి, రవితో గొడవ

  బిగ్‌బాస్ తెలుగు షోలో యాంకర్ రవి, లహరి షారి మధ్య రిలేషన్‌పై కామెంట్ చేసి ఇంటిలో రచ్చ రేపింది. నీవు నాతో ఉండటం లేదు. మగవాళ్లతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నావు. అర్ధరాత్రి బాత్రూమ్‌లో యాంకర్ రవి నీవు ముద్దులు పెట్టుకొన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దాంతో యాంకర్ రవి, లహరి షారీ ఘాటుగా స్పందించారు. అయితే నాగ్ చూపించిన వీడియోతో ఆ వివాదం అలా చల్లారిపోయింది.

   వీజే సన్నీ చెంప పగలకొడుతానని

  వీజే సన్నీ చెంప పగలకొడుతానని

  ఇక ఏడో వారం కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా వీజే సన్నీతో గట్టిగానే గొడవ పడింది. కోడి గుడ్లను రక్షించుకోవడానికి వీజే సన్నీ చేసిన ప్రయత్నంలో నెట్టి వేయడంతో ప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నన్ను మరోసారి టచ్ చేశావంటే చెంప పగలగొడుతాను.. అంటూ పలు మార్లు హెచ్చరించింది. అయితే అంతే మొత్తంతో వీజే సన్నీ స్పందించడంతో వారిద్దరి మధ్య భారీగా వాగ్వాదం చోటు చేసుకొన్నది.

   లోబో, ఆర్జే కాజల్‌తో వాగ్వాదం

  లోబో, ఆర్జే కాజల్‌తో వాగ్వాదం

  అంతేకాకుండా ఇంటి సభ్యులు ఆర్జే కాజల్, విశ్వ, లోబో, ఇతర కంటెస్టెంట్లతో గొడవ పడింది. లోబోతో ఓ నామినేషన్ సందర్భంగా గట్టిగానే వాదనకు దిగింది. లోబో గట్టిగా అరవడంతో .. నీవు అరిస్తే బెదిరేది లేదు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇటీవల టాస్క్‌లో కాజల్‌తో వాదనకు దిగి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఎంటర్‌టైన్‌ చేసింది.

  బిగ్‌బాస్ షోలో అసమంజసమైన కార్యక్రమాలు

  బిగ్‌బాస్ షోలో అసమంజసమైన కార్యక్రమాలు

  ఇలాంటి వివాదాలు దాటేసి ఇంటి బయటకు వచ్చిన ప్రియ బిగ్‌బాస్ ఇంటి బయట మరో వివాదానికి తెరలేపినట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ షోలో అసమంజసమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కొందరు కంటెస్టెంట్లు బయట వ్యక్తుల సపోర్ట్‌తో షోలో ఎంజాయ్ చేస్తున్నారు. బయట కొందరు అందిస్తున్న సహకారంతో ఇంటిలో వారు ఎలిమినేట్ కాకుండా ఉంటున్నారు. నిజాయితీగా గేమ్ ఆడేవారు ఎలిమినేట్ అవుతున్నారు అని ప్రియ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమచారం.

  ప్రియ కంప్లయింట్‌పై సందేహాలు

  ప్రియ కంప్లయింట్‌పై సందేహాలు

  అయితే ప్రియ ఫిర్యాదు చేసినట్టు వార్త వైరల్ అవుతున్నప్పటికీ.. అధికారికంగా ఎక్కడా వెల్లడి కాకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియ కంప్లయింట్ చేసిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రియ ఎవరి మీద కంప్లయింట్ చేసింది? ఏమని కంప్లయింట్ చేసింది అనేది ఆసక్తికరంగా మారింది.

  నాగ్, చిరు, అమితాబ్‌తో నటించి..

  నాగ్, చిరు, అమితాబ్‌తో నటించి..

  ఇక ప్రియ కెరీర్ విషయానికి వస్తే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేష్, నాగార్జునతోపాటు అమితాబ్ బచ్చన్‌తో హిందీ చిత్రాల్లో కూడా నించారు. ఆమె తన 19వ ఏటనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో రాణిస్తున్నారు.

  Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
   సీరియల్స్‌తో మరింత పాపులారిటీ

  సీరియల్స్‌తో మరింత పాపులారిటీ

  ప్రియ సినిమా రంగంతోపాటు పలు టెలి సీరియల్స్‌లో నటిస్తున్నారు. వాణి రాణి, నందిని వర్సెస్ నందిని, చిన్న కోడలు, నంబర్ 1 కోడలు లాంటి సీరియల్స్‌తో పాపులారిటిని సంపాదించుకొన్నారు. ప్రియ సాక్షి సీరియల్‌కు ఉత్తమ నటిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును కూడా సొంతం చేసుకొన్నారు.

  English summary
  Bigg Boss Telugu 5 fame Priya files case on Organsisers after elimination. Media reports suggest that, She complained about a few 'unfair' practices in the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X