బిగ్‌బాస్‌లో అప్పడం లొల్లి.. హద్దు మీరిన సిరి హన్మంతు, షణ్ముఖ్, వీజే సన్నీ.. వ్యక్తిగత దూషణలతో..

బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. గెస్ట్ టీమ్ నుంచి బీబీ హోటల్‌ టీమ్‌ ఎంత డబ్బు సంపాదించుకున్నారో డిస్కషన్‌ చేసుకున్నారు. డబ్బు కోసం సన్నీని అనీ మాస్టర్‌ ఏకంగా ఎత్తుకుని తిరగడంతో ఆమెకు వంద రూపాయలు ఇచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్ లో సిరి-షణ్ముఖ్ vs సన్నీ టాస్క్ సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

హోటల్‌ టీమ్‌ ఓటమి

హోటల్‌ టీమ్‌ ఓటమి

బిగ్‌బాస్‌ టాస్క్ లో అతిథుల నుంచి 15వేలు రాబట్టుకోవాల్సి ఉండగా, బిగ్‌బాస్‌ హోటల్‌ టీమ్‌ కేవలం 9500 మాత్రమే సాధించారు. దీంతో హోటల్‌ టీమ్‌ ఈ టాస్క్ లో ఓడిపోగా కెప్టెన్సీ టాస్క్ కి అర్హత కోల్పోయారు. మరోవైపు ఈ టాస్క్ లో బిగ్‌బాస్‌ రవికి సీక్రెట్‌ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో తన సొంత హౌస్ మేట్స్ కు వ్యతిరేకంగా అన్నింటి చెడగొడుతూ ఉండాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో రవి విజయం సాధించి కెప్టెన్సీ టాస్క్ లో అర్హత సాధించారు.

ఫైర్ అయ్యిన ప్రియాంక

ఫైర్ అయ్యిన ప్రియాంక

అయితే అర్హత కోల్పోయిన బీబీ హోటల్‌ వాళ్లకు బిగ్‌బాస్‌ ఓ ఛాన్స్ ఇచ్చి గెస్ట్ టీమ్ లో ఏ ఇద్దరికి కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అర్హత లేదో తెలియజేయాలని చెప్పారు. అందరు కలిసి ప్రియాంక, మానస్‌లకు అర్హత లేదని నిర్ణయించారు. ఈ సమయంలో ప్రియాంక ఫైర్‌ అయ్యింది. రెడీ అవ్వడానికే ఎక్కువ టైమ్‌ తీసుకుంటుందని వాదించడం మీద ఆమె ఫైర్ అవడంతో హౌస్ హీటెక్కింది.

కెప్టెన్ గా రవి

కెప్టెన్ గా రవి

ఈ క్రమంలో ప్రియాంక, మానస్‌లు మినహాయిస్తే సన్నీ, సిరి, కాజల్‌, రవి కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడతారు. టవర్‌లో పవర్‌ ఉంది అనే టాస్క్ లో కెప్టెన్సీ పోటీదారులు పాల్గొనాల్సి ఉంది. ఇందులో భాగంగా పోటీదారులు టవర్‌ నిర్మించాల్సి ఉంటుంది. దాన్ని శత్రువుల దాడి నుంచి కింద పడకుండా కాపాడుకోవాలి. మొదటి రౌండ్‌లో కాజల్‌ వి ఎక్కువగా పడిపోవడంతో ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. రెండో రౌండ్‌లో సన్నీ, మూడో రౌండ్‌లో సిరివి కూడా పడిపోవడంతో రవి కెప్టెన్‌గా గెలిచారు.

సీరియస్‌ గా వాగ్వివాదం

సీరియస్‌ గా వాగ్వివాదం

అయితే ఈ టాస్క్ లో సిరి, సన్నీ మధ్య చోటుకున్న వాగ్వివాదం సీరియస్‌ గా సాగింది. తన టవర్‌ని పడేసేందుకు సిరి ప్రయత్నించిండంతో ఆమెపై ఫైర్‌ అయ్యాడు సన్నీ. దీనికి ఆమె కూడా అదే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయ్యింది. తాను కూడా టవర్‌ని తంతాను అని అన్నాడు సన్నీ. ఎవరిని తంతావ్‌ అంటూ మీది మీదికి వచ్చింది సిరి. దీంతో నేను కనుక గేమ్‌ ఆడితే అప్పడంలా తొక్కేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు సన్నీ.

మధ్యంలో దూరి

మధ్యంలో దూరి

మధ్యంలో దూరి ఈ విషయంలో షణ్ముఖ్‌ రియాక్ట్ అయ్యాడు. ఎవరిని అప్పడం చేస్తావ్‌. చేయిరా అప్పడం అంటూ సన్నీ మీదకు వెళ్లడంతో షన్ను, సన్నీ మధ్య పెద్ద వివాదం తెలెత్తింది. ఏరా పోరా అనే స్థాయి దాటి, కొట్టుకుందాం? చూసుకుందాం అనే రేంజ్ కి వెళ్ళింది. ఎవరూ తగ్గకుండా ఇద్దరూ రెచ్చిపోయారు. ఆడవాళ్లని అడ్డు పెట్టుకుని గేమ్‌ ఆడుతున్నావని సన్నీ అంటే దానికి సిరి రియాక్ట్ అయి సన్నీపై ఎగబడి పోట్లాడింది.

Recommended Video

Pushpaka Vimanam Public Talk
రెచ్చిపోయిన సన్నీ

రెచ్చిపోయిన సన్నీ

ఓ పక్క షణ్ముఖ్‌, మరో పక్క సిరి కలిసి సన్నీని టార్గెట్ చేయగా సన్నీ సైతం రెచ్చిపోయాడు. అయితే మానస్, కాజల్‌, అనీ మాస్టర్లు కలుగ చేసుకుని ఇద్దరిని ఆపే ప్రయత్నం చేచేసి కూల్ చేశారు. మరో పక్క చక్కిలిగింతలు పెట్టిందని అనీ మాస్టర్‌ కూడా కాజల్‌పై ఫైర్ అయింది. నాగిని అంటూ డాన్స్ చేసి రచ్చ చేసింది. ఎక్కిరించినట్టుగా రకరకాలుగా హేళన చేసి, ఫాల్తూ గేమ్‌ ఆడుతున్నావంటూ మాట్లాడింది. దీంతో కాజల్‌ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X