Bigg Boss 5 finale: అందరికంటే హాట్ గా ఎంట్రీ ఇచ్చిన లహరి.. క్లివేజ్ షోతో నాగార్జునకు ఐ లవ్యూ అంటూ..
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొత్తానికి చివరి దశకు చేరుకుంది. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ కావడంతో ప్రేక్షకుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ ఈ సందర్భంగా పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చారు. వారి అనుభవాలను పంచుకుంటు నాగార్జున తో సరదాగా మాట్లాడారు. ఇక డాన్స్ స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చిన కొంతమంది ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చారు ఇందులో అందరికంటే ఎక్కువగా లహరి మరింత ఎక్కువ గ్లామర్ తో కనిపించడం విశేషం.

గ్లామర్ తో హైలెట్
యాంకర్ గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న లహరి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటుందని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే గ్లామర్ తో ఈ బ్యూటీ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఆమె కానీ కొన్ని రోజులకే ఎలిమినేట్ అయింది.

ఫైనల్ లో గ్లామర్ షో
బిగ్ బాస్ ఫైనల్ 5 సందర్భంగా ప్రత్యేకంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లహరి చాలా గ్లామరస్ లుక్ తో కనిపించింది. ముఖ్యంగా ఆమె క్లీవేజ్ షో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండటంతో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లహరి హౌస్ లో నుంచి వెళ్లిపోయినప్పటికీ గ్లామర్ తో మాత్రం చాలా మంది అభిమానులను ఎట్రాక్ట్ చేసింది.

నాగార్జునకు ఐ లవ్ యూ
ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ లో స్పెషల్ డాన్స్ తో ఎంట్రీ ఇచ్చి నాగార్జునకు ఐ లవ్ యు కూడా చెప్పింది. హౌస్ లో ఉన్నప్పుడు చాలాసార్లు లహరి నాగార్జునకు ఐ లవ్ యూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా దానికి సరైన సమాధానం లేదు అంటూ ఆమె మరోసారి ప్రశ్నించగా అందుకు నాగార్జున తను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని సరదాగా వివరణ ఇచ్చాడు.

రవితో లహరి
అయితే షో అనంతరం లహరీ ప్రత్యేకంగా ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. లహరి రవి ఇద్దరు కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. మేము ఇద్దరం కలిసి పోయాము అంటూ రవి కూడా అందులో చాలా విభిన్నంగా చెప్పాడు. ఇక బిగ్ బాస్ హెచ్చరికలను మరొక కారణం వల్లనో తెలియదు కానీ మళ్ళీ వెంటనే లహరి ఆ వీడియోను డిలీట్ చేయడం విశేషం.

విన్నర్ అతడే అంటూ..
బిగ్ బాస్ హౌస్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఫైనల్ విన్నర్ సన్నీ అని ఇప్పటికే బయట జనాలు మాట్లాడుకుంటున్నారు. సన్నీ గెలుస్తాడు అని కూడా చెబుతున్నారు. అందరికంటే ఎక్కువగా సన్నీ అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ టైటిల్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











