Big boss 5 Finals: ఆ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్న నిర్వాహకులు.. రాబోయే హీరో ఎవరంటే?
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు ఎన్ని కాంట్రవర్సీలు ఎదురైనా కూడా ప్రతి సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఒక విధంగా ప్రతి కాంట్రవర్సీ కూడా ఈ రియాల్టీ షోకు బాగానే కలిసొస్తోంది. పైసా ఖర్చులేకుండా సోషల్ మీడియాలో మంచి బజ్ అయితే క్రియేట్ అవుతోంది. దీంతో చూడని వారు కూడా చాలా తొందరగానే ఆకర్షితులవుతున్నారు. ఇక తెలుగులో అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే అనుమానాలకు చాలా తొందరగానే క్లారిటీ ఇచ్చేశారు. సీజన్ ఫైవ్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈసారి ఫైనల్ ఎపిసోడ్ కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అలాగే గెస్ట్ గా రాబోతున్నది ఎవరు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

మొదటి ఫైనలిస్ట్ గా..
మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తుది దశకు చేరుకుంటోంది ఇటీవల టికెట్ టూ ఫినాలే టాస్క్ కూడా మొదలుపెట్టారు. ఇక శ్రీరామ్ అందులో మొదటి ఫైనలిస్ట్ గా అవకాశం దక్కించుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. మొదటి నుంచి కూడా అతను చాలా బలంగా పోరాడుతున్నాడు. అవసరమైన సమయంలో తన తెలివిని ఉపయోగించి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్ చేసినా చాలా ఓర్పుతో ముందుకు సాగుతున్నాడు.

అతను టాప్ 5లో ఉంటాడని..
సింగర్ శ్రీరామచంద్రకు ముందు నుంచే ప్రేక్షకులలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయింది. ఇక ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా సన్నీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక షణ్ముఖ్ ముందు నుంచే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంది కాబట్టి అతను టాప్ 5 వరకు వస్తాడు అని ప్రేక్షకులు కూడా ముందుగానే ఊహించారు. మనస్ కూడా దాదాపు అదే తరహాలో క్రేజ్ అందుకుంటూ వచ్చాడు.

అమ్మాయిలు గెలుస్తారా?
ఇక ప్రియాంక సిరి కాజల్ ఈసారి టైటిల్ విన్నర్ గా నిలిచే బిగ్ బాస్ లో సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. ముఖ్యంగా ఈ సారి అమ్మాయిలు గెలిస్తే బిగ్ బాస్ లో సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కూడా ఆ అవకాశం ఉండకపోవచ్చు అని కథనాలు వెలువడుతున్నాయి.

గెలిచేది ఎవరంటే?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సన్నీ చాలా బలంగా పోరాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతను టైటిల్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి సన్నీ ఈ సీజన్ లో సగం వరకు ఉంటాడో లేదో అనే అనుమానాలు చాలా వచ్చాయి. కానీ మెల్లగా అతను తన బలాన్ని చూపిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ప్రియాంక వెళ్లిపోతుందా?
ఇక ఈ వారం పింకీ ఇంట్లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక ట్రాన్స్ జెండర్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. కానీ ఆటలో అందరూ సమానమే కాబట్టే ఎవరు పైచేయి సాధిస్తే వారైనా విజేతగా నిలుస్తారు. ప్రియాంక చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా ఆమె ఈ వారం ఇంట్లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫైనల్స్ కోసం ఎంత ఖర్చు చేయనున్నారంటే?
ఈసారి బిగ్ బాస్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 స్టార్టింగ్ ఎపిసోడ్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే ఈసారి ఫైనల్స్ కోసం అంతకు మించి అనేలా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రాబోయే స్టార్ హీరో ఎవరు?
బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ఎవరు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చే విజేత అభిజిత్ కు టైటిల్ ను అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా ఒక అగ్ర హీరో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. మహేష్ బాబు బాలకృష్ణ ప్రభాస్ రామ్ చరణ్ ఉంటే వారి పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి కానీ ఎవరు వస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











