Bigg Boss 5: ఫైనల్ ఎపిసోడ్ కోసం మరోసారి అంతకుమించి ఖర్చు.. హైలెట్ ప్లాన్స్ ఏమిటంటే?

టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ తెలుగు షో అంతగా సక్సెస్ అవుతుందని మొదట్లో ఎవరూ ఊహించలేదు. అయితే మొత్తానికి ఐదో సీజన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా హోస్ట్ విషయంలో అయితే ప్రతి సారి కూడా అభిమానులు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. మధ్యలో కొంత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా నాగార్జున వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో చాలా బాగానే రేటింగ్స్ అందుకుంటోంది. ఇక ఐదవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు అంతకుమించి అనేలా ఖర్చు చేయబోతున్నట్లు టాక్ అయితే వస్తుంది.

ప్రతీసారి అదే ఫీలింగ్

ప్రతీసారి అదే ఫీలింగ్

మొదటి సీజన్ నుంచి చూసుకుంటే బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ విషయంలో కూడా ప్రతి సారి కొంత నిరాశ పరుస్తూనే వస్తుంది. ప్రేక్షకులకు మొదటి రెండు సీజన్లలో వచ్చిన కంటెస్టెంట్స్ తప్పితే మిగతా సీజన్ కంటెస్టెంట్స్ విషయంలో పెద్దగా సంతృప్తి చెందలేదు. కానీ బిగ్ బాస్ మాత్రం టాలెంట్ ఉన్న వారిని రంగంలోకి దింపి టాస్క్ లతో ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

ఎలాంటి విమర్శలు వచ్చినా

ఎలాంటి విమర్శలు వచ్చినా

కంటెస్టెంట్స్ ఎవరు వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్ లో అన్ని రకాల టాస్క్ లను సమానంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో నిర్వాహకులు కొంత పాజిటివ్ గానే ముందుకుసాగారు. ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా బిగ్ బాస్ షో ఇంతవరకు పెద్దగా ఇబ్బందులను ఎదుర్కోలేదు. మొదటి సీజన్ నుంచి కూడా విజయవంతంగా రేటింగ్స్ అందుకుంటూ ప్రేక్షకుల మద్దతు కూడా బాగానే ఆకట్టుకుంటోంది.

గత సీజన్ లో ఎంత ఖర్చు చేశారంటే?

గత సీజన్ లో ఎంత ఖర్చు చేశారంటే?

ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది మొదటి ఎపిసోడ్ కోసమే ఈ సారి రెండు కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్ వచ్చింది. గత సీజన్ లో ఫైనల్ ఎపిసోడ్ కోసం కూడా దాదాపు అదే తరహాలో నిర్వాహకులు ఖర్చు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆ సీజన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎవరు వస్తారు అనేది కూడా ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయిని పెంచేసింది.

కనీసం ఈసారైనా..

కనీసం ఈసారైనా..

ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లలో ఈ వారమే ఆఖరి ఎలిమినేషన్ కావడంతో ఎవరు బయటికి వెళ్లి పోతారు అనేది కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. కాజల్ వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు గత వారం నుంచి కూడా టాక్ అయితే గట్టిగానే వస్తుంది. ఈ సారి అయినా అమ్మాయిలు బిగ్ బాస్ టైటిల్ ను గెలుస్తారా లేదా అని ఎన్నో రకాల సందేహాలు వెలువడుతున్న సమయంలో కాజల్ బయటకు వెళ్లిపోవడంతో కొత్త నెగిటివ్ టాక్ లో కూడా అందిస్తోంది. ఇక సిరి అయితే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం లేదని అర్ధమవుతోంది.

పుష్ప రాజ్ ఎంట్రీ?

పుష్ప రాజ్ ఎంట్రీ?

ఇక ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ ప్రకటించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాను ప్రమోట్ చేసే భాగంగా అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రత్యేకంగా బిగ్ బాస్ షో లో ఒక స్టెప్ కూడా వేసే అవకాశం ఉన్నట్లు ఠాగూర్ వస్తోంది.

జబర్దస్త్ కమెడియన్ కూడా

జబర్దస్త్ కమెడియన్ కూడా

అలాగే ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై ప్రత్యేకమైన సాంగ్స్ తో అలరించబోతున్నాడు సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని కామెడీ స్కిట్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరొకసారి హైపర్ ఆది కూడా ఫైనల్ ఎపిసోడ్ లో సందడి చేసే అవకాశం ఉందట. ఆ మధ్య హైపర్ ఆది ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ కు మంచి రేటింగ్స్ వచ్చాయి.

Recommended Video

Bigg Boss Telugu 5 : Reasons Behind RJ Kajal Elimination | Filmibeat Telugu
ఈసారి ఖర్చు ఎంతంటే?

ఈసారి ఖర్చు ఎంతంటే?

ఇక ఫైనల్ ఎపిసోడ్ కోసమైతే బిగ్ బాస్ నిర్వాహకులు మొత్తంగా ఈసారి రెండున్నర కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ సీజన్ లో అత్యధికంగా పారితోషకం అందుకనే కంటెస్టెంట్స్ లో యాంకర్ రవి శ్రీ రామచంద్ర టాప్ ప్లేస్ లో నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు ఈసారి అందరికీ కూడా చాలా మంచి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X