Bigg Boss 5 Finale: ఫినాలే షూటింగ్ వివరాలు లీక్.. షో నుంచి ఇద్దరు ఔట్.. ఎలా ఎలిమినేట్ అయ్యారంటే!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో టీఆర్పీని అందుకుంటూ ఐదేళ్లుగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చేది మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా ఇప్పుడు ఐదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు విజయం సాధించాలని పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలకు సంబంధించిన షూటింగ్‌లో కొంత భాగాన్ని శనివారమే చిత్రీకరించారు. ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? ఇంతకీ ఎలిమినేట్ అయింది ఎవరు? ఆ వివరాలు మీకోసం!

ఫినాలేకు చేరుకున్న ఐదుగురు వీళ్లే

ఫినాలేకు చేరుకున్న ఐదుగురు వీళ్లే

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు టైటిల్ కోసం పోటీ పడ్డారు.

ఆదివారం వైభవంగా గ్రాండ్ ఫినాలే

ఆదివారం వైభవంగా గ్రాండ్ ఫినాలే

పదిహేను వారాల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఐదో సీజన్ డిసెంబర్ 19 అంటే ఈరోజు పూర్తి కాబోతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారని అంటున్నారు.

వాళ్లంతా ఎంట్రీ.. రచ్చ చేసేస్తారట

వాళ్లంతా ఎంట్రీ.. రచ్చ చేసేస్తారట

ఈ ఆదివారం సాయంత్రం నుంచి జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారని కూడా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైపోయిందని తెలుస్తోంది.

దాదాపు పది మంది గెస్టులు ఎంట్రీ

దాదాపు పది మంది గెస్టులు ఎంట్రీ

గతంలో కంటే అంగరంగ వైభవంగా జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, రాజమౌళి, సుకుమార్, నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, ఆలియా, రణ్‌బీర్, జగపతి బాబులు వస్తున్నారట.

బిగ్ బాస్ షో నుంచి వాళ్లిద్దరూ ఔట్

బిగ్ బాస్ షో నుంచి వాళ్లిద్దరూ ఔట్

శనివారం షూట్ చేసిన దానిలో రెండు ఎలిమినేషన్లు కూడా ఉన్నాయని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో టాప్ 5 కంటెస్టెంట్లలో ఉన్న ఏకైక లేడీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ ఐదో స్థానంలో నిలిచి అందరి కంటే ముందే హౌస్ నుంచి బయటకు వచ్చేసిందట. ఆమె తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన మానస్ కూడా షో నుంచి ఎలిమినేట్ అయిపోయాని తెలిసింది.

సిరి హన్మంత్ ఆ డైరెక్టర్ చేతులతో

సిరి హన్మంత్ ఆ డైరెక్టర్ చేతులతో

ఆరంభం నుంచి తనదైన శైలిలో ఆడుతూ.. టాస్కుల్లో దుమ్ము లేపుతూ సిరి హన్మంత్ ఫినాలేకు చేరుకుంది. అయితే, మిగిలిన వాళ్లతో పోలిస్తే ఆమెకు అంతగా ఓట్లు పడలేదు. దీంతో ఈ వారం ఆరంభం నుంచే ఐదో స్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఇక, ఫినాలే ఎపిసోడ్‌లో సిరిని దర్శకుడు సుకుమార్ డ్రోన్ల ద్వారా ఎలిమినేట్ చేయబోతున్నాడని బిగ్ బాస్ వర్గాల సమాచారం.

మానస్‌ను టాలెంట్ బ్యూటీ ద్వారా

మానస్‌ను టాలెంట్ బ్యూటీ ద్వారా

ఐదో సీజన్ మొదలైనప్పటి నుంచి కూల్‌గా ఉంటూ వివాదరహితుడిగా పేరొందిన కంటెస్టెంట్ మానస్. ఆటకు ఆట ఆడుతూ మెప్పించిన అతడు ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, ఓటింగ్‌లో మాత్రం అతడు నాలుగో స్థానానికే పరిమితం అయ్యాడట. దీంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో మానస్‌ను టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించబోతుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X