Bigg Boss Finale: ఆమెకు ఎన్ని ముద్దులు పెట్టావు.. అందరి ముందే అతడికి నాగార్జున సూటి ప్రశ్న

దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఈరోజు జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఐదో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కాబోతుంది. ఇదే ఎపిసోడ్‌లో సీజన్ విన్నర్‌ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో గెస్టుగా వచ్చిన నేచురల్ స్టార్ నానిని.. హోస్ట్ అక్కినేని నాగార్జున లిప్‌లాక్‌ల గురించి ఊహించని ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు మీకోసం!

ఈ ఐదుగురు మధ్యే టైటిల్ పోరు

ఈ ఐదుగురు మధ్యే టైటిల్ పోరు

భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు టైటిల్ పోరులో నిలిచారు.

వైభవంగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్

వైభవంగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్

15 వారాల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఐదో సీజన్ డిసెంబర్ 19 అంటే ఈరోజు పూర్తి కాబోతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారని బుల్లితెర వర్గాల సమాచారం.

ఎక్స్ కంటెస్టెంట్లతో అలాంటి ప్లాన్

ఎక్స్ కంటెస్టెంట్లతో అలాంటి ప్లాన్

ఆదివారం సాయంత్రం నుంచి జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారని కూడా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.

వాళ్లందరి రాకతో మరింత స్పెషల్

అంగరంగ వైభవంగా జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టార్ మా వదలిన ప్రోమోలో చాలా మంది సెలెబ్రిటీలు కనిపించారు. అందులో రాజమౌళి, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్, రష్మిక నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, ఆలియా, రణ్‌బీర్, జగపతి బాబులు సందడి చేశారు.

నానిని ముద్దల ప్రశ్న అడిగిన నాగ్

నానిని ముద్దల ప్రశ్న అడిగిన నాగ్

ఎంతో గ్రాండ్‌గా జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్ ఫినాలే ఎపిసోడ్ కోసం నేచురల్ స్టార్ నాని కూడా ఎంట్రీ ఇచ్చాడు. అతడు నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్ కోసం హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టితో కలిసి అతడు బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశాడు. ఇందులో భాగంగానే హోస్ట్ అక్కినేని నాగార్జున.. నానిని ముద్దుల గురించి సూటి ప్రశ్న అడిగాడు.

ఎన్ని ముద్దులు ఇచ్చావు అంటూ

ఎన్ని ముద్దులు ఇచ్చావు అంటూ

'శ్యామ్ సింగ రాయ్' మూవీలో హీరో నాని.. కృతి శెట్టికి లిప్ లాక్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సీన్స్‌ను పాట, ట్రైలర్‌లో చూపించారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్‌పై మాట్లాడుతోన్న సమయంలో అక్కినేని నాగార్జున 'ఒకటా రెండా మూడా.. ఎన్ని పెట్టావ్' అంటూ నానిని ప్రశ్నించాడు. దీనికి నానితో పాటు కృతి శెట్టి తెగ సిగ్గు పడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X