Bigg Boss Telugu 5 finale Voting.. దుమ్ము రేపుతున్న టాప్ కంటెస్టెంట్.. అతడికే రికార్డు ఓటింగ్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో చివరి అంకానికి చేరుకోబోతున్నది. టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్ల భవితవ్యాన్ని నిర్ధారించేందుకు ఓటర్లు భారీగా ఓటింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌ను విజేతగా నిలువడానికి ఊహించని విధంగా ఓటింగ్‌కు పాల్పడుతున్నారు. దాంతో రికార్డు ఓటింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది. బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ చివరి వారంలో 2వ రోజు ఏ మేరకు ఓటింగ్ నమోదైందంటే..

కాజల్ ఎలిమినేషన్ తర్వాత

కాజల్ ఎలిమినేషన్ తర్వాత

బిగ్‌బాస్ తెలుగు 14వ వారంలో ఆర్జే కాజల్ ఇంటి నుంచి ఎలిమినేట్ కావడంతో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోయింది. ఎలాగైనా టాప్ 5లో స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ఆట ఆడిన కాజల్ ఊహించని రీతిలో బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించింది. దాంతో ఎప్పటిలానే ఐదుగురు టైటిల్ రేసులో నిలిచారు.

వీజే సన్నీకి సానుకూలంగా

వీజే సన్నీకి సానుకూలంగా


బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో టాప్ 5 స్థానాల్లో వీజే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్, సిరి హన్మంతు నిలిచారు. సోషల్ మీడియా అంచనా ప్రకారం వీజే సన్నీ టైటిల్‌ను గెలుచుకొనే అవకాశం ఉందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. అందుకు తగినట్టుగా ఓటింగ్ శాతంలో మెజారిటీ వాటాను వీజే సన్నీ సొంతం చేసుకొంటున్నట్టు వివరాలు వెల్లడి అవుతున్నాయి.

టాప్ పొజిషన్‌లో వీజే సన్నీ

టాప్ పొజిషన్‌లో వీజే సన్నీ

తాజా వివరాల ప్రకారం.. హాట్ స్టార్ యాప్ ద్వారా నమోదైన రెండో రోజు ఓటింగ్ సమాచారం ఇలా ఉంది. అత్యధికంగా వీజే సన్నీ 55 శాతం ఓటింగ్‌తో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 30 శాతం ఓటింగ్‌తో షణ్ముఖ్ జస్వంత్ ఉన్నారు. మూడో స్థానంలో సింగర్ శ్రీరామచంద్ర 12 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి మధ్య పోటీ ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది.

అతి తక్కువ ఓట్లతో సిరి హన్మంతు

అతి తక్కువ ఓట్లతో సిరి హన్మంతు

ఇక టైటిల్‌ రేసులో తాను ఉంటానని భావించిన మానస్ మాత్రం కేవలం 5 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. షన్ను గెలిస్తే చాలూ.. నాకు టైటిల్ అవసరం లేదని పలు మార్లు చెప్పిన సిరి హన్మంతు మాత్రం అతి తక్కువగా 3 శాతం ఓట్లతో చివరిస్థానంలో నిలిచారు. దీంతో మానస్, సిరి హన్మంతు పోటీలో నామమాత్రంగా ఉన్నారనే విషయం స్పష్టం అవుతున్నది.

మరోసారి కీలకంగా మిస్డ్ కాల్ డేటా

మరోసారి కీలకంగా మిస్డ్ కాల్ డేటా

అయితే హాట్ స్టార్ యాప్‌ ద్వారా నమోదైన ఓటింగ్‌ను పక్కన పెడితే.. మిస్ట్ కాల్ డేటా విజేతను నిర్ణయించే అంశంగా మారుతుంది. ఎలిమినేషన్ గానీ, సీజన్ విన్నర్‌ నిర్ణయించడంలో మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎందుకంటే.. మిస్డ్ కాల్ డేటా అత్యంత సీక్రెట్‌గా నిర్వాహకులు ఉంచడం వల్ల బయటకు వివరాలు లీక్ అయ్యే ప్రసక్తి లేదు.

Recommended Video

Harnaaz Sandhu Miss Universe 2021 Journey || Filmibeat Telugu
మీ ఫేవరేట్‌కు ఎలా ఓటు వేయాలంటే..

మీ ఫేవరేట్‌కు ఎలా ఓటు వేయాలంటే..

1. వీజే సన్నీకి ఓటు వేయాలంటే.. 8886658202 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
2. షణ్ముఖ్ జస్వంత్‌కు ఓటు వేయాలంటే.. 8886658210 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
3. శ్రీరామచంద్రకు ఓటు వేయాలంటే.. 8886658215 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
4. మానస్‌కు ఓటు వేయాలంటే.. 8886658206 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. సిరి హన్మంతుకు ఓటు వేయాలంటే.. 8886658201 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X