Bigg Boss Telugu 5.. వీజే సన్నీ, షన్ను, సిరి, శ్రీరామ్, మానస్ ఎవరో తెలుసా? టాప్ 5 ఫైనలిస్టుల రెమ్యునరేషన్
నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. ఈ షోలో టైటిల్ కోసం టాప్ 5 కంటెస్టెంట్లు వీజే సన్నీ, షణ్ముఖ్, సిరి హన్మంతు, మానస్, శ్రీరామచంద్ర పోటి పడుతున్నారు. అయితే ఈ ఐదుగురు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, పారితోషికం వివరాల్లోకి వెళితే..

సిరి హన్మంతు కెరీర్, రెమ్యునరేషన్
సిరి హన్మంతు విశాఖపట్నం పట్టణానికి చెందిన యువతి. విశాఖలో యూ న్యూస్ అనే స్థానిక లోకల్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 99 టీవీలో న్యూస్ రీడర్‌గా చేరారు. ఆ తర్వాత 99 టీవీని వదిలేసి టీ న్యూస్‌లో రేండేళ్లపాటు పనిచేశారు. న్యూస్ రీడర్ ఉద్యోగం వదిలేసి స్టార్ మాలో ప్రసారమైన ఉయ్యాల జంపాల సీరియల్‌లో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఎవరు నువ్వు మోహని, అగ్ని సాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి లాంటి సీరియల్స్‌లో నటించారు. ఇద్దరు లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాల్లో నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అలాగే మరుపురాని ప్రేమకథ, దట్, 4 డేస్ విత్ శ్రీ, లవ్ అండ్ డౌట్ అనే షార్ట్ ఫిలింస్‌లో నటించారు. బిగ్‌బాస్‌లో ద్వారా గుర్తింపు పొందిన సిరి ప్రస్తుతం వారానికి లక్ష రూపాయలు అందుకొంటున్నారు.

వీజే సన్నీ కెరీర్, పారితోషికం
వీజే సన్నీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వీడియో జాకీగా, యూట్యూబర్‌గా, టీవీ నటుడుగా గుర్తింపు పొందారు. కల్యాణ వైభోగం అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు 5లో సాధారణ సెలబ్రిటీగా ప్రవేశించి ప్రస్తుతం అసాధారణ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. బిగ్‌బాస్‌లో తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, హావభావాలు, డైలాగ్స్‌తో విశేషంగా పాపులారిటీని సొంతం చేసుకొన్నాడు. బిగ్‌బాస్ 5లో ఉండటం ద్వారా వీజే సన్నీ ప్రతీ వారానికి రూ. లక్ష పారితోషికాన్ని అందుకొంటున్నారు.

శ్రీరామచంద్రకు రెమ్యునరేషన్ ఎంతంటే
శ్రీరామచంద్ర మైనంపాటి గాయకుడిగా అందరికి సుపరిచితుడు. ఇండియన్ ఐడల్ 5 ద్వారా దేశంలోనే అరుదైన గాయకుడిగా పాపులారిటిని సాధించారు. ఎలాంటి మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ టాప్ సింగర్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి ప్రస్తుతం మరింత పాపులారిటిని సొంతం చేసుకొన్నాడు. బిగ్‌బాస్ 5 తొలి ఫైనలిస్టుగా రికార్డు సృష్టించిన శ్రీరామచంద్ర భారీగానే పారితోషికం అందుకొంటున్నారు. బిగ్‌బాస్‌లో భాగమవ్వడం ద్వారా వారానికి రూ.1.5 లక్షల పారితోషికాన్ని అందుకొంటున్నారు.

దీప్తి సునైన లవర్‌గా షన్ను
బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ దీప్తి సునైన లవర్‌గా అందరికి సుపరిచితుడు. య్యూటబర్‌గా మంచి గుర్తింపు ఉంది. అలాగే డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా తెలుసు. షన్నుగా పేరు తెచ్చుకొన్న ఈ సెలబ్రిటీ యూట్యూబ్ సిరీస్‌ల ద్వారా మరింత పాపులారిటీ సాధించారు. ఆయన నటించిన ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే సిరీస్ ద్వారా క్రేజీగా మారాడు. బిగ్‌బాస్ తెలుగు 5లో కీలక సభ్యుడిగా మారిన షణ్ముఖ్ వారానికి సుమారు 2 లక్షల పారితోషికాన్ని అందుకొంటున్నట్టు సమాచారం.
Recommended Video

బాలనటుడిగా మానస్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్‌బాస్ తెలుగు 5లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకొన్న మానస్ నాగులపల్లి టాలీవుడ్‌లో బాలనటుడిగా అందరికి పరిచయం. కాయ్ రాజా కాయ్, గ్యాంగ్స్ ఆఫ్ గబ్బర్ సింగ్, ప్రేమికుడు, సోడా గోలీ సోడా, క్షీరసాగర మథనం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 5లో టాప్ ఫైనలిస్టుల్లో ఒకరిగా పాపులారిటిన సంపాదించిన మానస్. వారానికి రూ. 1 లక్ష పారితోషికాన్ని అందుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











