twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5 Finals: అదిరిపోయే రేటింగ్.. కానీ ఆ రెండు సీజన్స్ కంటే తక్కువే!

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బిగ్ బాస్ షో గత కొన్నాళ్లుగా తెలుగులో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుకుంటోంది. కింగ్ నాగార్జున హోస్టింగ్ తో ఇప్పటికే వరుసగా మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక అంతకంటే ముందు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ గా ఉన్నారు. ఇక వారి కంటే ఎక్కువగా నాగార్జున మరొకసారి రేటింగ్స్ అందించడంలో బాగానే రాణించారు. కానీ గత రెండు సీజన్ల కంటే కూడా తక్కువ స్థాయిలో రేటింగ్స్ రావడం ఆశ్చర్యం.

    రేటింగ్స్ తో రికార్డులు

    రేటింగ్స్ తో రికార్డులు

    తెలుగు టెలివిజన్ రంగంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా బిగ్ బాస్ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ప్రతి సీజన్లో సరికొత్త కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపుతున్నారు నిర్వాహకులు. డిఫరెంట్ టాస్క్ లతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక షోకు సంబంధించిన TRP రేటింగ్స్ నెంబర్స్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.

    మొదటి సీజన్ లో..

    మొదటి సీజన్ లో..

    మొదట జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ ప్రయాణం మొదలైన విషయం తెలిసిందే.. ఆ సీజన్ లో ఫైనల్ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా ఎవరు కూడా రాలేదు. ఇక ఫైనల్ లో 14.13 టిఆర్పి రేటింగ్ దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో శివ బాలాజీ విన్ అయిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఫైనల్ విన్నర్ కు టైటిల్ ను అందించారు.

    రెండవ సీజన్ లో..

    రెండవ సీజన్ లో..

    బిగ్ బాస్ మొదటి సీజన్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఆ బాధ్యతను కొనసాగించలేకపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నాచురల్ స్టార్ నాని తనదైన శైలిలో డిఫరెంట్ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే నాని హోస్టింగ్ పై కొన్ని ట్రోలింగ్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఇక రెండవ సీజన్ కు 15.05 టిఆర్పి రేటింగ్ దక్కింది. రెండో సీజన్లో విజేతగా కౌశల్ మండా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

    మూడవ సీజన్ లో

    మూడవ సీజన్ లో

    ఇక మూడవ సీజన్ నుంచి అక్కినేని నాగార్జున తన దైన శైలిలో హోస్టింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. నాగార్జున ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా చాలా కూల్ గా అన్ని వైపులా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. మొదటి అడుగు లోనే ఆయన హోస్ట్ గా పర్ఫెక్ట్ అని తేలిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు అత్యధికంగా బిగ్ బాస్ మూడవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ 18.29 టిఆర్పి రేటింగ్ అందుకుంది. ఆ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

    నాలుగవ సీజన్ లో..

    నాలుగవ సీజన్ లో..

    ఇక నాలుగవ సీజన్లో విజేతగా యువహీరో అభిజిత్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇక నాలుగో సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు అత్యధికంగా 19.51 టిఆర్పి రేటింగ్ అందుకొని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఫైనల్ ఎపిసోడ్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిలవడం విశేషం.

    5వ సీజన్ లో తక్కువగానే..

    5వ సీజన్ లో తక్కువగానే..

    ఇక బిగ్ బాస్ 5వ సీజన్ కూడా మంచి రేటింగ్స్ తో బాగానే ఆదాయాన్ని అందుకుంది. అయితే గత రెండు సీజన్స్ కంటే తక్కువగా 16.04 టిఆర్పీ రేటింగ్స్ రావడం విశేషం. ఈసారి స్టార్ విన్నర్ ను ప్రకటించేందుకు స్టార్ సెలబ్రెటీ ఎవరు కూడా స్పెషల్ గెస్ట్ గా రాలేదు. ఫైనల్ విన్నర్ గా VJ సన్నీ నిలిచిన విషయం తెలిసిందే.

    English summary
    Bigg Boss Telugu 5 Finals rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X