twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg boss Telugu 5: ఓపెనింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా.. గతంలో కంటే ఎక్కువ బడ్జెట్..

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగులో కూడా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. అసలు మొదట ఈ షో సౌత్ ఇండస్ట్రీలో వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేహాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ షోను ఎవరూ అంతగా చూడకపోవచ్చు అనే కామెంట్స్ వచ్చాయి. కానీ షో నిర్వాహకులు మాత్రం చాలా తెలివిగా ప్లాన్ చేసి తెలుగు జనాలకు బాగానే ఆకట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి హోస్ట్ గా వ్యవహరించి భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ పెంచాడు.

    ఇక ఆ తర్వాత వచ్చిన నాని నాగార్జున స్టైల్ లోనే తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నాగార్జున అయితే బిగ్ బాస్ షో బెస్ట్ హోస్ట్ గా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం అందరి ఫోకస్ బిగ్ బాస్ తెలుగు 5పైనే ఉంది. గత కొన్ని రోజులుగా విడుదలవుతున్న ప్రొమోలకు కూడా భారీగా క్రేజ్ అందుతోంది. తప్పకుండా ఈసారి కూడా భారీ స్థాయిలో వర్కౌట్ అవుతుందని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ 5 మొదటిరోజు ఎపిసోడ్ ను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. బిగ్ బాస్ 5 ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సారి షో నిర్వాహకులు గతంలో కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    కంటెస్టెంట్స్ ఎంతమంది అంటే..

    కంటెస్టెంట్స్ ఎంతమంది అంటే..

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ మీడియా ఛానల్స్ లో కూడా కొన్ని పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి. దాదాపు 19 మంది వరకు ఈ సారి హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కొంతమంది ప్రముఖ టీవీ నటులు, మరికొంతమంది డాన్సర్స్, సింగర్స్ కూడా ఈసారి కంటెస్టెంట్స్ గా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది .

    కంటెస్టెంట్స్ కోసం ఖర్చు ఎంత?

    కంటెస్టెంట్స్ కోసం ఖర్చు ఎంత?

    అయితే గత ఏడాది కంటెస్టెంట్స్ విషయంలో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ సెలబ్రిటీలు వస్తారని అనుకుంటే ఎవరికీ తెలియని వారిని తీసుకువచ్చారు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఆ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు భారీ స్థాయిలో డబ్బును సేవ చేసుకున్నారని కూడా టాక్ గట్టిగానే వచ్చింది. అయితే టాస్క్ విషయంలో మాత్రం నిర్వాహకులు చాలా తెలివిగా అడుగులు వేశారు. కంటెస్టెంట్స్ మధ్య పోటీతత్వాన్ని పెంచి మంచి క్రేజ్ ను అందించే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఆ రూట్లో కాస్త ఎక్కువగనే ఖర్చు చేస్తున్నారట.

    అడిగిన దానికంటే ఎక్కువగానే

    అడిగిన దానికంటే ఎక్కువగానే

    ఇక బిగ్ బాస్ కోసం నిర్వాహకులు ఇప్పుడు ఏ స్థాయిలో ఖర్చు చేశారు అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎక్కువగా బిగ్ బస్ సెట్ కోసమే ఖర్చు చేశారని చెప్పవచ్చు. ఇక కంటెస్టెంట్స్ కూడా భారీ స్థాయిలో లాభాలు అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బయట ఆదాయాన్ని వదులుకొని బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి అంటే ఎంతో కొంత ఎక్కువగా డిమాండ్ చేస్తారు. కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోని వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంత?

    కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంత?

    కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలకు వారానికి 10 నుంచి 12 లక్షలకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సారి యూట్యూబ్ సెలబ్రిటీలను ఎక్కువగా లాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ జర్నలిస్టుగా మరొకరు వచ్చే అవకాశం ఉందట. సింగర్ డాన్సర్స్ కూడా ఈ సారి బిగ్ బాస్ షో లో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందరికీ మాత్రం ఎక్కువగా యాంకర్ రవి యూట్యూబ్ షణ్ముక్ జశ్వంత్ పైనే ఉంది. తప్పకుండా ఇద్దరూ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    గత సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఖర్చు ఎంత?

    గత సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఖర్చు ఎంత?

    వైరల్ అవుతున్న మరొక ముఖ్యమైన విషయం లోకి వెళితే ఈసారి ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేశారని టాక్ వచ్చింది. కంటెస్టెంట్స్ స్పెషల్ ఎంట్రీలు అప్పట్లో ఏ రేంజ్ ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి కూడా ప్రతి ఒక్కరూ వారి టాలెంట్ తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు సమాచారం.

    ఈసారి ఖర్చు ఎంత?

    ఈసారి ఖర్చు ఎంత?


    ఇంకా గత ఏడాది ఫైనల్ ఎపిసోడ్ కోసం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్ కోసం దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు మరొక టాక్ అయితే వస్తోంది. దాదాపు బాలీవుడ్ స్థాయిలోనే తెలుగులో కూడా ఖర్చు పెడుతున్నారు అంటే నిర్వాహకులు ఏ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.

    English summary
    Bigg boss telugu 5 first episode budget cost full details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X