Bigg Boss Telugu 5 Elimination: సరయు ఎలిమినేషన్ వెనుక కారణం ఇదే.. సిరి హన్మంతు, వీజే సన్నీపై ఫైర్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తొలివారం ఎలిమినేషన్ ముగిసింది. హోస్ట్ నాగార్జున సండేను ఫండేగానే కాకుండా ఎమోషనల్‌గా కూడా మార్చాడు. ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడిస్తూనే ఫన్ జనరేట్ చేసి ఎలిమినేషన్ ప్రాసెస్‌ను ఆసక్తికరంగా మార్చారు. ఇంటి సభ్యుల మధ్య ఉన్న రిలేషన్స్‌ను, అలాగే వారి నిక్‌నేమ్స్‌ను బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. ఎలిమినేషన్ ప్రాసెస్‌ను ఎలా నాగార్జున ఎలా కొనసాగించారంటే..

జంటలుగా విడదీసి
ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో వేదికపైకి వచ్చిన నాగార్జున ఇంటి సభ్యులతో మాట ముచ్చట చేసిన తర్వాత లాన్‌లో ర్యాంప్ వాక్ చేయించారు. అందుకోసం ఇంటి సభ్యులను జంటలుగా విడదీశారు. మోడల్ జస్వంత్ ర్యాంప్ వాక్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. చాలా ఫన్‌గా ఈ ర్యాంప్ వ్యాక్ సాగింది.

శ్రీరాం చంద్ర అంటే క్రష్ అంటూ
ర్యాంప్ వ్యాక్ తర్వాత ఇంటి సభ్యులును జంటగా చేసి ఓ ఫన్ గేమ్‌ను నడిపించాడు. ఇద్దరిని జంటలుగా చేసి ఒకరి గురించి మరొకరి విషయాలను చెప్పమని అడిగాడు. దాంతో తన పార్ట్‌నర్ బలం, బలహీనతలు, ఇష్టాఇష్టాలను మరో పార్ట్‌నర్ చెప్పాలి. అయితే ఇంటిలో ప్రియాంక సింగ్ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగితే.. సింగర్ శ్రీ రామచంద్ర అని చెబితే.. కాదు మానస్ అంటూ మరికొందరు చెప్పారు. అయితే నిజమేనా అని అడిగితే.. మానస్ గురించి నిన్న అనుకొన్నాను.. ఇప్పుడు శ్రీ రాంచంద్ర అంటే.. రేపు ఎవరు అని నాగార్జున అని చెప్పారు.

మానస్, హమీదా అలా సేఫ్
ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించారు. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ముందు యాపిల్ పెట్టి.. దానిని కట్ చేస్తే అందులో రెడ్ కలర్ వస్తే.. ఆ యాపిల్ కట్ చేసిన వాళ్లు ఎలిమినేషన్ (అన్‌సేఫ్)లో ఉన్నట్టు, గ్రీన్ కలర్ వస్తే సేఫ్ అయినట్టు అని చెప్పారు. ఈ ప్రాసెస్‌లో మానస్ సేఫ్ అయ్యారు. ఇక రెండో తర్వాత తలో ఒక బాక్స్ ఇచ్చి అందులో రిబ్బన్‌తో కట్టి ఉన్న ఓ పేపర్ ఉంటుంది. ఆ పేపర్‌లో సేఫ్ అని ఉన్న వ్యక్తి ఎలిమినేషన్ నుంచి బయటపడుతారు అని నాగార్జున చెప్పారు. ఈ ప్రాసెస్‌లో సేఫ్ అనే పేపర్ ఉండటంతో హమీదా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు.

సరయు ఎలిమినేట్ అయింది అలా ..
ఆ తర్వాత జస్వంత్, సరయు ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మిగిలారు. దాంతో వారి ముందు రెండు సైకిల్స్ పెట్టారు. ఎవరి సైకిల్ ముందు లైట్ వెలుగుతుందో ఆ కంటెస్టెంట్ సేఫ్ అవుతారు అని నాగార్జున చెప్పారు. ఈ ప్రాసెస్‌లో మోడల్ జస్వంత్ సైకిల్ ముందు లైట్ వెలిగిపోవడంతో ఆయన సేఫ్ అయ్యారు. సరయూ ఎలిమినేషన్ అయ్యారు. సరయు రాయ్ ఎలిమినేషన్‌తో ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఫిట్‌నెస్ ట్రైనర్ విశ్వ కంటతడి పెట్టి ఎమోషనల్ అయ్యారు. అలాంటి భావోద్వేగాల మధ్య సరయును ఇంటికి నుంచి బయటకు పంపించారు. అలా వేదికపైకి వచ్చిన నాగార్జునతో మాట్లాడారు. సరయు తన జర్నీని నాగార్జున చూపించారు.

ఇంటిలో బెస్ట్ ఎవరు.. చెత్త ఎవరంటే
అయితే ఇంటి నుంచి వెళ్లే ముందు కంటెస్టెంట్లలో ఐదుగురు బెస్ట్.. ఐదుగరు వరస్ట్ కంటెస్టెంాట్లను బోర్డుపై పెట్టాలని సూచించారు. దాంతో బెస్ట్ ఫైవ్‌గా శ్వేత, మానస్, ప్రియాంక, శ్రీ రాంచంద్ర, హమీదా ఫోటోలను పెట్టారు. అలాగే వరస్ట్‌గా సిరి హన్మంతు, వీజే సన్నీ, లహరీ షారీ, షణ్ముఖ్ జస్వంత్, ఆర్జే కాజల్‌ను నిర్ణయించారు. ఈ సందర్భంగా వీజే సన్నీతో తీవ్ర వాగ్వాదం జరిగింది. తన మనసులో ఏదో పెట్టుకొని నన్ను టార్గెట్ చేశాడు అని చెపింది. తాను, వీజే సన్ని కలిసి ఓ సినిమాలో నటించాం. ఆ సమయంలో చిన్న గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకొన్నాడు. ఇంటిలోకి వచ్చిన తర్వాత నేను తనను రా అని సంబోధించినందుకు తనను నామినేట్ చేశాడు. అందుకే నన్ను నామినేట్ చేశాడు.
Recommended Video

నాగార్జున మీ మనసు గెలుచుకొన్నాను..
అలాగే షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతుపై భారీ ఆరోపణలు సరయు చేసింది. ముందే ఒకరికొకరు ప్లాన్ చేసుకొని ఇంట్లోకి వచ్చారు. సిరిని లేపిన తర్వాత తాను లేవాలని అనుకొంటున్నాడు అని సరయు అంటే. ఇక్కడ ఎవరిని ఎవరు లేపలేరు.. సొంతంగా గేమ్ ఆడాల్సిందే అంటూ సిరి ఘాటుగా స్పందించారు. అలా వాదోపవాదాల తర్వాత సరయు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. వెళ్లే ముందు నాగార్జున మీ మనసు గెలుచుకొన్నాను. అది చాలూ అంటూ సరయు ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











