Bigg Boss: షణ్ముఖ్ పరువు తీసిన స్పెషల్ గెస్టులు.. దీప్తి సునైనాను గుర్తు చేస్తూ దారుణంగా!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎన్నో కొత్త కొత్త కాన్సెప్టులతో రకరకాలు షోలు ప్రారంభం అయ్యాయి. అయితే, అన్నింటికీ ప్రేక్షకుల నుంచి స్పందన దక్కడం లేదు. అందులో కొన్ని మాత్రమే సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అందులో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఐదో దాన్ని కూడా ఈరోజుతో ముగించబోతుంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ జరిగిన ఫినాలే వీక్‌ను ఎన్నో సర్‌ప్రైజ్‌లతో స్పెషల్‌గా నడిపించారు.
ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో గత సీజన్లకు సంబంధించిన కంటెస్టెంట్లు గెస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరుగా వచ్చిన సింగర్ గీతా మాధురి.. సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ జోడీగా మారిపోయారు
తాజాగా వస్తున్న సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. వీళ్లిద్దరికీ బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. అయితే, ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చారు. జంటగా మారి ఎప్పుడూ కలిసే ఉండడంతో షణ్ముఖ్, సిరి తరచూ విమర్శల పాలయ్యారు.

హగ్గులు.. ముద్దులతో రచ్చ చేసి
షోలోకి రావడానికి ముందే స్నేహితులు కావడంతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. దీంతో వీళ్ల రిలేషన్‌పై ట్రోల్స్ వచ్చాయి.

టైటిల్ ఫేవరెట్లు.. టాప్ 5లో రాక
ఆరంభం నుంచీ షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఇద్దరూ తమ తమ ఆటతీరుతో సత్తా చాటారు. ఎవరికి వారే చక్కగా ఆడుకుంటూ ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. దీంతో ఇద్దరూ ఇంటికి కెప్టెన్లుగా కూడా ఎంపికయ్యారు. అలా ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను సైతం తప్పించుకున్నారు. ఇలా ఆరంభం నుంచీ ఆకట్టుకుంటూ సిరి, షన్నూ ఇద్దరూ ఫినాలేకు చేరుకున్నారు.

చివర్లో కూడా రొమాన్స్ పండిస్తూ
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో శనివారం వరకూ ఫినాలే వీక్ జరిగింది. దీంతో కంటెస్టెంట్లకు పెద్దగా టాస్కులు లేకుండా పోయాయి. ఫలితంగా వాళ్లంతా తమకు నచ్చినట్లు ఉంటూ సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో సిరి, షణ్ముఖ్ కూడా జంటగానే కనిపించారు. ఎప్పుడూ పక్కపక్కనే ఉంటూ, గొడవలు పడుతూ, హగ్గులు చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేసేశారు.
ఆ కంటెస్టెంట్ల రాకతో సందడిగా
ఫినాలే వీక్‌లో భాగంగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ షోలో గత సీజన్ల కంటెస్టెంట్లు సందడి చేశారు. మొదటి సీజన్ నుంచి శివ బాలాజీ, హరితేజ.. రెండో సీజన్ నుంచి రోల్ రైడా, గీతా మాధురి, మూడో సీజన్ నుంచి రాహుల్ సిప్లీగంజ్, శివ జ్యోతి, నాలుగో సీజన్ నుంచి ఆరియానా, అఖిల్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా ఆట పాటలతో కంటెస్టెంట్లతో సందడిగా గడిపారు.
షణ్ముఖ్ పరువు తీసేలా చెప్తూనే
ఈ ఎపిసోడ్‌లో భాగంగా వచ్చిన అందరూ షణ్ముఖ్, సిరి రిలేషన్ గురించి ఎన్నో రకాల కామెంట్లు చేశారు. శివ జ్యోతి 'ప్రేమలు కాదు.. ప్రేమ.. ఒక్కరే' అంటూ షన్నూపై పంచ్ వేసింది. అలాగే, అతడు రెండు టీమ్‌లలో కలిసి ఆడతా అని అనగా.. 'ఏదైనా ఒకవైపే ఉండాలి. రెండు వైపులు ఉండకూడదు' అంటూ గీతా మాధురు సెటైర్ వేసింది. దీంతో ఇద్దరూ తెగ ఫీలైపోయారు.

షో వరకే అన్న షన్నూ.. ఏడ్చేసి
వచ్చిన కంటెస్టెంట్లు అందరూ తమనే టార్గెట్ చేస్తుండడంతో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ తల దించుకున్నారు. అయినప్పటికీ వచ్చిన వాళ్లంతా వాళ్ల గురించే ఎక్కువ మాట్లాడారు. ఆ సమయంలో షన్నూ 'ఏదైనా షో వరకే' అన్నాడు. దీంతో సిరికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఆమెను బుజ్జగించిన అతడు.. పలుమార్లు హగ్ చేసుకున్నాడు. దీంతో ఆమె మామూలుగా అయింది.


Click it and Unblock the Notifications











