BBTeluguGrandFinale : మాజీ కంటెస్టెంట్ల వోటింగ్.. దారుణంగా పడిపోయిన షన్ను ఓటింగ్.. మొదటి ప్లేస్ ఎవరికంటే?

బిగ్ బాస్ సీజన్ 5 నేటితో (డిసెంబర్ 19) ముగియనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు తరలి వచ్చారు. రణబీర్, అలియాభట్‌‌, సాయి పల్లవి, కృతిశెట్టి, నాని, రాజమౌళి, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఇలా చాలా మంది వచ్చారు. అయితే మాజీ హౌస్ మేట్స్ అందరినీ నాగార్జున పలకరించారు. పలకరించడమే కాక ఎవరు ఎవరిని విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు అని అడిగారు. డానికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

శ్రీ రామచంద్ర కే

శ్రీ రామచంద్ర కే

ముందుగా మాజీ కంటెస్టెంట్ రవిని పలకరించారు నాగార్జున. రవి తో మాట్లాడుతూ ఏమిటి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వెకేషన్ కి వెళ్లావు అంట అని ప్రశ్నించాడు. అవును వెళ్లాల్సి వచ్చింది అని రవి చెప్పుకొచ్చారు అయితే బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది అని నాగార్జున ప్రశ్నించారు. దానికి రవి చాలా అద్భుతంగా ఉందని బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత జీవితానికి అర్థం తెలుసుకున్నా అని చెప్పుకొచ్చారు. అయితే నీ సపోర్ట్ ఎవరికీ అని ప్రశ్నిస్తే శ్రీరామచంద్ర కి తన సపోర్ట్ అని చెప్పాడు యాంకర్ రవి. ఆ తర్వాత సరయు కూడా శ్రీ రామచంద్ర కే తన సపోర్ట్ అని చెప్పింది. అతను ఎలా వచ్చాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అని ఆమె చెప్పుకొచ్చింది.

శ్రీ రామచంద్ర

శ్రీ రామచంద్ర

ఇక ఆ తరువాత విశ్వను చూస్తూ చాలా బాగున్నావని అనడంతో విశ్వ బాగున్నానని అన్నాడు. ఇక తను కూడా శ్రీ రామచంద్రను సపోర్ట్ చేస్తున్నానని అన్నారు. ఇక ఆ తరువాత అనీ మాస్టర్ మాట్లాడుతూ హౌస్ గురించి తన అనుభవాన్ని పంచుకుంది. ఆ తరువాత ఎవరికీ సపోర్ట్ చేస్తున్నావు అంటే తడుముకోకుండా శ్రీ రాం పేరు చెప్పింది.

పిలిచి అవకాశం

పిలిచి అవకాశం

ఆ తర్వాత లహరి మాట్లాడుతూ నేను ఐలవ్యూ చెప్పాను, నువ్వు రిప్లై ఇవ్వలేదు ఏంటి? అని ప్రశ్నించగా లవ్ యు టూ అని చెప్పారు. ఇక తన సపోర్ట్ శ్రీ రామచంద్ర, సన్నీకి అని ఆమె పేర్కొంది. ఇక లోబో బాగా బిజీ అయ్యావుగా అంటే మాట్లాడుతూ 'దేవుడి దయవల్ల నన్ను చిరంజీవిగారు పిలిచి అవకాశం ఇచ్చారు.. బోళాశంకర్‌లో ఆయన పక్కనే ఉంటాను.. ఇదంతా దేవుడి దయ, బిగ్ బాస్ దయ' అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక తన సపోర్ట్ షన్నుకి అని ఆయన వెల్లడించాడు.

సపోర్ట్ షన్నుకే

సపోర్ట్ షన్నుకే

శ్వేత లేవడంతోనే జేస్సీని పబ్ కి తీసుకు వెళ్ళావ్ గా అంటే లేదు ఇద్దరమే వెళ్ళలేదు కొంత మందిమి కలిసి వెళ్లాం అని వెల్లడించింది. ఫైనల్‌లో సన్నీ లేదా శ్రీరామ్ విన్ కావాలని కోరుకుంటున్నాను అని ఆమె పేర్కొంది. ఇక బిగ్ బాస్ వలన మైత్రీ మూవీ మేకర్స్ లో లీడ్ రోల్ సినిమా అవకాశం వచ్చిందని చెప్పిన జెస్సీ తన సపోర్ట్ షన్నుకే అని తేల్చి చెప్పాడు.

సన్నీకే తన సపోర్ట్

సన్నీకే తన సపోర్ట్

ఇక నటరాజ్ మాస్టర్ తన కుమార్తెకు లక్ష్య అనే పేరు పెట్టుకున్ననాని, బయటకు రాగానే బాలకృష్ణ గారి సినిమా అవకాశం వచ్చిందని వెల్లడించారు. ఇక తన సపోర్ట్ సన్నీకే అని తేల్చి చెప్పాడు. ఇక కాజల్ మాట్లాడుతూ సన్నీకే తన సపోర్ట్ అని తేల్చేసింది. ఇక ప్రియాంక మాట్లాడుతూ టాప్ 5 లో ముగ్గురు గెలవాలని, మానస్, సన్నీ, శ్రీ రామ చంద్రలలో ఒకరు గెలవాలని చెప్పుకొచ్చింది.

శ్రీ రాం విన్నర్

శ్రీ రాం విన్నర్

ఇక ప్రియ మాట్లాడుతూ తనకు గేం ప్రకారం సన్నీ నచ్చుతున్నారు కానీ శ్రీ రాం విన్నర్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక ఆ తరువాత హమీదా మాట్లాడుతూ శ్రీ రాం గెలవాలని, వేరే పేరేమీ చెప్పలేనని ఆమె వెల్లడించింది. ఇక ఉమా దేవి మాట్లాడుతూ తన అల్లుడు సన్నీ గెలవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నది. అలా మొత్తం మీద ఎక్కువ మంది శ్రీ రాం గెలవాలని కోరుకోగా, తరువాత సన్నీకి ఎక్కువ వోట్లు పడ్డాయి. టైటిల్ ఫేవరేట్ అని భావిస్తున్న షన్ను పేరు ఒకరే సపోర్ట్ చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X