Bigg Boss Telugu 5 Finale చీఫ్ గెస్టులుగా రాంచరణ్.. ముగ్గురు బాలీవుడ్ టాప్ స్టార్స్.. ఎవరెవరూ రాబోతున్నారంటే?
బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్దం అవుతున్నది. గత నాలుగు సీజన్లను పోల్చుకొంటే ఈ ఫినాలేను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు టీమ్ కసరత్తు చేస్తున్నది. అయితే తాజా సీజన్ ఫైనల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు రావడం విశేషంగా మారింది. ఇంతకు ఈ ఫినాలేకు ఎవరెవరూ ముఖ్య అతిథులుగా రాబోతున్నారంటే..

డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్ ఫినాలే
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ఎలాంటి వివాదాలు లేకుండా హ్యాపీగా 100 రోజులు పూర్తి చేసుకొన్నది. కొద్ది రోజుల్లోనే అంటే డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్ ఫినాలేకు ముస్తాబవుతున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హై లెవెల్‌లో చేస్తుండటంతో ఈ ఫినాలేకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాంతో ఈ ఫైనల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజేత ఎవరంటూ సోషల్ మీడియాలో
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ఫినాలే బరిలో ఐదుగురు కంటెస్టెంట్లు మిగిలారు. వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, మానస్, సిరి హన్మంతులో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. అయితే ఎవరు విజేతగా నిలుస్తారు. ఎవరు ఈ ట్రోఫిని అందుకొంటారనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నది. దాంతో ఫినాలేపై భారీ ఆసక్తి నెలకొన్నది.

భారీగా ప్రైజ్ మనీ, స్పాన్సర్ల గిఫ్టులు
ఇక బిగ్‌బాస్ తెలుగు 5 ఫైనల్‌లో విజేతగా నిలిచే కంటెస్టెంట్‌కు ఊహించిన రితీలో ప్రైజ్‌మనీ అందుకోబోతున్నారు. రూ.50 లక్షల రూపాయలతోపాటు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అందించే రూ.20 లక్షలకుపైగా విలువ ఉన్న ప్లాట్‌ను సొంతం చేసుకోబోతున్నారు. అంతేకాకుండా స్పాన్సర్ల నుంచి భారీగా గిఫ్టులను, ప్రైజ్‌మనీ అందుకోవడానికి సిద్దంగా ఉన్నారు.

ముఖ్య అతిథులుగా రణ్‌వీర్, దీపిక, ఆలియాభట్
ఇలాంటి విశేషాలు, ఆసక్తిని కలిగిస్తున్న బిగ్‌బాస్ తెలుగు 5 ఫినాలేకు బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్, ఆలియాభట్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5కి ఇలా బాలీవుడ్ తారలు హాజరు కావడం ఇదే తొలిసారి. దాంతో ఈ ఫినాలేకు ఎన్నడూ కనివినీ లేని విధంగా క్రేజ్ ఏర్పడనున్నది.

మరో చీఫ్ గెస్ట్‌గా రాంచరణ్
ఇక బాలీవుడ్ తారలతోపాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గతంలో చిరంజీవి పలుమార్లు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సారి చిరు తనయుడు రాంచరణ్ చీఫ్ గెస్ట్‌గా కనిపించబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ సంస్థకు చెర్రీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఫినాలేలో 83 మూవీ ప్రమోషన్
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 5 ఫినాలేకు రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్, ఆలియాభట్ రావడం వెనుక ఆసక్తికరమైన అంశం దాగి ఉన్నది. త్వరలో విడుదల కాబోతున్న కపిల్ దేవ్ బయోపిక్ 83 చిత్రంలో రణ్‌వీర్, దీపిక జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఫినాలే వేదికపై చేయాలని హోస్ట్ నాగార్జున నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఆలియాభట్ నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీన రిలీజ్ కానున్నది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను బిగ్‌బాస్ ఫినాలేపై చేయాలని నిర్ణయించారు.
Recommended Video

బిగ్‌బాస్ ఫైనల్‌లో RRR ప్రచారం
అయితే బిగ్‌బాస్ విజేతగా నిలిచే కంటెస్టెంట్‌కు మాత్రం అరుదైన గౌరవం దక్కుతుంది. బాలీవుడ్ తారలు రణ్‌వీర్, దీపిక, ఆలియాభట్, రాంచరణ్ చేతులు మీదుగా ట్రోఫిని, ప్రైజ్ మనీని అందుబోతున్నారు. ఇలాంటి రేర్ ఫీట్ ఏ బిగ్‌బాస్ సీజన్‌లో కూడా ఇంత వరకు కనిపించలేదనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











