Bigg boss 5: కాజల్ నకిలీ మనిషి.. శ్రీరామ్ తో రాత్రి మొత్తం అలానే మాట్లాడా: వెళ్లే ముందు హామీదా ఎమోషనల్

ఈవారం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఊహించినట్టుగానే జరిగింది. గత ఐదు వారాలు కూడా ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో అనేక రకాల అనుమానాలు నిజమయ్యాయి. ఇక ఈ సారి మొదట్లో కాస్త కన్ఫ్యూజన్ గానే ఉన్నప్పటికీ చివరికి హామీదా వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె ప్రయాణమైతే కాస్త విభిన్నంగా జరిగింది. ఆమె ఎక్కువగా శ్రీరామ్ తో రొమాంటిక్ పాట్నర్ గా కొనసాగుతూ వచ్చింది. ఇక చివరికి వెళ్లిపోయే సమయంలో హామీదా అయితే కాస్త ఎమోషనల్ అయ్యింది. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరి గురించి తనదైన శైలిలో వివరణ ఇస్తూ కొంతమంది పై చాలా అప్సెట్ అయ్యింది. హామీదా వెళ్ళిపోయే ముందు శ్రీరామ్ ను చూస్తూ కంటతడి పెట్టుకుంది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 కలసికట్టుగా పోరాడేందుకు..

కలసికట్టుగా పోరాడేందుకు..

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంది ముందు స్నేహితులుగా ఉన్న వారు ఆ తర్వాత శత్రువులుగా మారే పరిణామాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అయితే గత రెండు వారాలుగా గ్యాంగ్ లుగా ఉన్నవారు మళ్లీ విడిపోవడం లేదు. వీలైనంతవరకు కలసికట్టుగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ వారం కూడా అలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

స్పెషల్ వీడియోలు

స్పెషల్ వీడియోలు

ఇక ఆదివారం రోజు నాగార్జున ఆడియన్స్ కి ఫైవ్ మచ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత వారం కంటే ఈసారి ఫుల్ జోష్లో హౌస్ ను నడిపించారు. ఫెస్టివల్ సందర్భంగా నవరాత్రులను పురస్కరించుకుని కంటెస్టెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను కూడా చూపించారు. సరదాగా మధ్యలో టాస్క్ లో పెడుతూ వారి కుటుంబ సభ్యులకు ఈ వీడియోలో చూపించారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎమోషనల్ నవ్వుతూ కనిపించారు.

ముద్దులు పెట్టుకోవడం వరకు

ముద్దులు పెట్టుకోవడం వరకు

అయితే ఫైనల్ గా ఎలిమినేషన్ లో అందరూ ఊహించినట్టుగానే హామీదా వెళ్లిపోవడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత హామీదా ఇతర విషయాల కంటే కూడా శ్రీరామ్ మ్యాటర్ తోనే ఎక్కువగా హైలెట్ అవుతూ వచ్చింది. ఆమె మొదటి నుంచి కూడా అతనితో ప్రత్యేకమైన కెమిస్ట్రీ ని క్రియేట్ చేసి మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. అదే విధంగా శ్రీరామ్ కూడా ఆమెకు చాలా కనెక్ట్ అయ్యాడు. చాలా సమయంలో ప్రత్యేకంగా ముద్దులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది.

 రాత్రి మొత్తం శ్రీరామ్ తోనే..

రాత్రి మొత్తం శ్రీరామ్ తోనే..

ఇక వెళ్ళిపోయే సమయం లో ఒక హామీదా శ్రీరామ్ ను చూసి చాలా బాధపడింది. చాలా మంచి వాడు ఇతరుల కోసం ఎంతగానో పోటీ పడతాడు అంటూ పాజిటివ్ కామెంట్ చేసింది. వెళ్ళిపోయే ముందు రోజు శ్రీరామ్ తో రాత్రి మొత్తం మాట్లాడినట్లు హామీదా తెలియజేసింది. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు అని కూడా అడిగాను అని చెప్పింది. ఇక హామీదా వెళ్ళిపోయే ముందు శ్రీరామ్ నా హృదయంలో నిదురించే చెలి అనే పాటను పాడి ప్రేమగా వినిపించాడు.

Recommended Video

Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
 RJ కాజల్ నకిలీ మనిషి

RJ కాజల్ నకిలీ మనిషి

ఇక హౌస్ లో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడిన హామీదా ముఖ్యంగా కాజల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యే కాజల్ లో చాలా నెగటివ్ షేడ్స్ ఉన్నాయని నకిలీ మనిషి అంటూ బంధాలకు ఆప్యాయతలకు కూడా విలువ ఇవ్వదు అని మొహం మీద చెప్పేసింది. ఇక ప్రియాంక ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు? అని ప్రియా గారు మాత్రం తనకు తల్లి లాంటి వారు అని తెలిపింది. ఇక విశ్వ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అని చెబుతూ రవి తనకు అన్నలాంటి వాడని తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X