Bigg Boss Telugu ఒంటరిగా చూసి ముద్దు పెట్టి షాకిచ్చిన సిరి హన్మంతు.. ఇంటి కెప్టెన్‌గా ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 8వ వారం కెప్టెన్సీ టాస్క్‌ ఇంటి సభ్యుల మధ్య ఆవేశాలు, కోపాలు ఓ రేంజ్‌లో కనిపించాయి. ఈ వారం కెప్టెన్సీ కోసం వెంటాడు.. వేటాడు అనే టాస్క్‌ను బిగ్‌బాస్ తెరపైకి తెచ్చారు. ఈ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకొన్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అయిపోలేదు. చూసుకొందామనే రేంజ్‌లో ఒకరికి మరొకరు వార్నింగ్ ఇచ్చుకొన్నారు. ఇలా టెన్షన్ మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు విజేతలుగా నిలిచారంటే..

కెప్టెన్సీ టాస్క్‌లో ఆరుగురు

కెప్టెన్సీ టాస్క్‌లో ఆరుగురు

బిగ్‌బాస్ ఇంటిలో 8వ వారానికి కెప్టెన్సీ కోసం షణ్ముఖ్, సిరి హన్మంతు, శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, వీజే సన్నీ, మానస్ పోటీ పడ్డారు. వారికి బస్తా సంచీలు ఇచ్చి వాటిలో థర్మోకాల్ బాల్స్‌ను కాపాడుకోవాలని సూచించాడు. ఎవరి బస్తా ఖాళీ అయితే వారు టాస్క్‌ నుంచి బయటకు వెళ్తారని గేమ్ రూల్స్ చెప్పారు.

వీజే సన్నీ వర్సెస్ శ్రీరామచంద్ర

వీజే సన్నీ వర్సెస్ శ్రీరామచంద్ర

కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైన తర్వాత వీజే సన్నీకి, సింగర్ శ్రీరామచంద్రకు గట్టిగానే గొడవ జరిగింది. సన్నీ సింగిల్‌గా ఆడుతారని అనుకొన్నాను అని శ్రీరామ్ అంటే.. బిగ్‌బాస్ ఇంకా అయిపోలేదు.. మున్ముందు చూసుకొందామని గట్టిగా సన్నీ బదులిచ్చాడు. ఇక జెస్సీ, మానస్ మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. ఇలా చివరకు బరిలో అనీ మాస్టర్, సిరి హన్మంతు, షణ్ముఖ్ మిగిలారు.

గ్యాంగ్‌గా ఆడటాన్ని జనం చూస్తున్నారు అంటూ

గ్యాంగ్‌గా ఆడటాన్ని జనం చూస్తున్నారు అంటూ

కెప్టెన్సీ టాస్క్‌లో అని మాస్టర్ మిగలడంతో సిరి, షణ్ముఖ్ ఆమెను టార్గెట్ చేశారు. అక్కడ గుంపులాట.. ఇక్కడ కూడా గుంపులాటేనా? అంటూ గట్టిగా క్లాస్ పీకింది. అయితే అనీ మాస్టర్ మాటలను లైట్‌గా తీసుకొంటూ షణ్ముఖ్ కనిపించాడు. ఓ దశలో అనీ మాస్టర్‌ బ్యాగ్‌ను లాగడానికి ప్రయత్నించడంతో సిరిని తోసేయడంతో కిందపడింది. మీ గ్యాంగ్ ఆటను జనం చూస్తున్నారు అంటూ అనీ మాస్టర్ ఘాటుగా స్పందించింది.

స్వయంగా వైదొలిగిన అని మాస్టర్

స్వయంగా వైదొలిగిన అని మాస్టర్

ఇక తన బ్యాగ్‌ను షణ్ముఖ్, సిరి లాగేయడానికి ప్రయత్నించడంతో అని మాస్టర్‌ ఫైర్ అయింది. స్వయంగా తన బ్యాగ్‌లోని థర్మోకాల్ బాల్స్‌ను కిందపడేసి గేమ్ నుంచి స్వయంగా తప్పుకొన్నది. దాంతో ఇంటి సభ్యుల్లో మానస్ కంగారుపడిపోయి.. గేమ్ నుంచి బయటకు రాకు అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు.

సోలోగా ఆడితే ఎలా గెలుస్తారు?

షణ్ముఖ్, సిరి హన్మంతుపై కోపం వ్యక్తం చేస్తూ.. నేను ఇంట్లో ఉన్నంత వరకు నేను కెప్టెన్ అవ్వను. వాడు వీడికి.. వీడు వాడికి హెల్ప్ చేస్తే.. సోలోగా ఆడేవాడు ఎలా ఆడుతాడు. నీవు నిజాయితీగా ఆడలేదంటే.. కెప్టెన్‌ అయి కూడా వేస్ట్ అంటూ అని మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

షణ్ముఖ్‌కు సిరి హన్మంతు ముద్దు

షణ్ముఖ్‌కు సిరి హన్మంతు ముద్దు

ఇదిలా ఉండగా, మెంటల్‌గా డిస్ట్రబ్ అయినప్పుడు మానసికంగా, ఎమోషనల్‌గా దగ్గరైపోతాం అని షణ్ముఖ్ అంటే.. నీ వల్లే నేను డిస్ట్రబ్ అవుతున్నా అని సిరి హన్మంతు అంది. అయితే నేను మాట్లాడను అంటూ షణ్ముఖ్ అంటే.. సిరి వచ్చి ఆయన నుదుటిపై ముద్దు పెట్టి వెళ్లిపోయింది. దాంతో ఓ క్షణం షాక్ గురైన షణ్ముఖ్.. కెమెరాలను చూస్తూ.. మీరు బాగా షూట్ చేశారా? ఇక నాకు ఉంది అంటూ కామెంట్ చేస్తూ కనిపించాడు.

Recommended Video

Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
కెప్టెన్‌గా షణ్ముఖ్ జస్వంత్

కెప్టెన్‌గా షణ్ముఖ్ జస్వంత్

ఇక కెప్టెన్సీ టాస్క్‌ నుంచి అనీ మాస్టర్ తప్పుకోవడంతో సిరి హన్మంతు, షణ్ముఖ్ మిగలడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం 8వ వారం ఇంటి కెప్టెన్‌గా షణ్ముఖ్ అయినట్టు సమాచారం. అక్టోబర్ 28వ తేదీన ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్‌లో షణ్ముఖ్ ఎలా కెప్టెన్ అయ్యాడనే విషయం స్పష్టమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X