Bigg Boss : ఏడిపించేసిన కంటెస్టెంట్స్.. వీడియోలు, స్కిట్స్ తో కన్నీళ్లు తెప్పించేశారుగా!
బిగ్ బాస్ 5 ఐదో వారం చివరికి చేరింది. నిన్న శనివారం నాడు నాగార్జున హౌస్ లోకి వచ్చి అలరించారు. ఇక ఈరోజు కూడా నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా నాగ్ సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోయాడు. పండుగ స్పెషల్ కావడంతో కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా రెడీ అయి అలరించారు. ఇక ఈ ఎపిసోడ్ ప్రతిరోజూ లాగా కాకుండా ఆరు గంటలకు ఎపిసోడ్ మొదలైంది. ఈ ఎపిసోడ్ మొదట్లోనే కంటెస్టెంట్స్ అందరూ ఏడిపించారు. ఆ వివరాల్లోకి వెళితే

9 గేమ్స్ ఆడించి 9 అవార్డులు
బిగ్ బాస్ నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్‌లో స్టేజీ మీదకు విచ్చేసిన నాగ్ అదిరిపోయే విధంగా కనిపించగా మగాళ్ళందరూ బంగార్రాజులాగా, ఆడవాళ్లందరూ సత్యభామలులా ఉన్నారని కంటెస్టెంట్ల మీద పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక నవరాత్రి సందర్భంగా 9 గేమ్స్ ఆడించి 9 అవార్డులు ఇవ్వబోతున్నట్లు కూడా నాగార్జున వెల్లడించాడు.

రెండు టీమ్లుగా
ఇక మొదటి గేమ్ లో భాగంగా టీమ్ Aలో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు ప్రియా, విశ్వ, సిరి, కాజల్, మానస్, జెస్సీ, శ్రీ రామ్ B టీమ్‌లో ఉన్నారు. ముందుగా ఈ రెండు జట్ల ముందు రింగ్ ఫైట్ పెట్టారు. మొదట పోటీ పడిన సన్నీ, శ్వేత వర్మ తో పోటీకి దిగిన సిరి గెలవడంతో వారికి ఫ్యామిలీ వీడియో చూపించే అవకాశం ఇచ్చారు.

లోబోకి అవకాశం
ముందు సన్నీ ఫ్యామిలీతో మాట్లాడే అవకాశం ఇవ్వగా తాను ఇప్పటికే చాలా ఎమోషనల్ గా ఉన్నానని మాట్లాడలేనని చెప్పడంతో ఆ అవకాశం లోబోకి దక్కింది. లోబో తన కూతురు మాట్లాడిన వీడియో చూడగానే వెక్కి వెక్కి ఏడ్చాడు. లోబో కూతురు కూడా తండ్రికి ధైర్యం నూరి పోసింది. పాపా చిన్నదే అయినా చాలా మెట్యూర్డ్ గా మాట్లాడింది. తర్వాత జెస్సీ తల్లి అతనికి ధైర్యం నూరిపోసిన మాటలు చూపించగా అతను తెగ సంతోషపడ్డాడు.
స్కిట్ తో ఏడిపించేశారు
ఇక ఆ తర్వాత రెండు టీమ్‌లు చెరో స్కిట్‌తో పాలపిట్ట అవార్డు కోసం పోటీ పడుతూ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. అయితే రవి టీమ్ ఆడపిల్ల కష్టాలు పేరుతొ స్కిట్ చేయగా, బీ టీమ్ వాళ్ళు ఈ గేమ్‌లో రైతు కష్టాలు చూపించారు. ఈ రెండు స్కిట్స్ కూడా ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఇక ఈవిల్ మీద గుడ్ గెలిచిన విషయాన్ని చూపాలని చెప్పడంతో ఆ విషయంలో రవి టీమ్ గెలిచిందని వెల్లడించారు.
Recommended Video

సర్ప్రైజ్ ఎలిమెంట్స్
రవి టీమ్ గెలవగా టీమ్ అంతా కలిసి పాలపిట్ట అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అతడి టీమ్‌లోని యానీ మాస్టర్‌కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. దీంతో ఆనీ మాస్టర్ ఉద్వేగానికి లోనైంది. అనంతరం హెబ్బా పటేల్ ఎంట్రీ ఇచ్చి వరుసగా అనేక సాంగ్స్ కి తనదైన స్టైల్ లో డాన్స్ వేసి అలరించింది. ఇక ఆ తరువాత రవి భార్య, కుమార్తెలు కనిపించడంతో ఎమోషనల్ అయ్యాడు. చాలా ఎమోషనల్ గా ఫీలవుతూనే ధైర్యంగా ఫీల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











