సీక్రెట్ రూంలో లోబో.. లెక్కే చేయని కంటెస్టెంట్ లు.. సిరి మాటలతో తేలిపోయిందిగా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే ఆరు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆరు వారాలకు గాను ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కూడా అయ్యారు. ఏడో వారం నామినేషన్లు ఆసక్తి కరంగా సాగాయి.. ప్రతి నామినేషన్ వెనుక సన్నీ హస్తం ఉండడంతో ఈ వారం మొత్తం సన్నీ నామస్మరణతో హౌస్ మార్మోగిపోయింది. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు హౌస్ సభ్యుడు లోబో సీక్రెట్ రూమ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సీక్రెట్ రూమ్ లోనే ఉంటున్న అనే సంగతి హౌస్ సభ్యులకు తెలుసా? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. సిరి మాట్లాడిన కొన్ని మాటలు ఈ మేరకు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.

ఆరుగురు ఎలిమినేట్

ఆరుగురు ఎలిమినేట్

ఇప్పటికే దాదాపు ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యింది. అలా ఆమెతో కలిసి ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయినట్లు అయింది. 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడవ వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, 5వ వారం హమీదా, ఆరో వారం శ్వేతా వరుసగా ఎలిమినేట్ అయ్యారు.

దాదాపు అదే ప్రొసీజ

దాదాపు అదే ప్రొసీజ

అయితే ఆరో వారంలో శనివారం నాడు లోబో హౌస్ సభ్యుల ఓటింగ్ మేరకు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున హౌస్ సభ్యులకు చూపించారు. నిజంగా హౌస్ సభ్యుడు ఎలిమినేట్ అయితే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారో దాదాపు అదే ప్రొసీజర్ ఫాలో అయ్యారు. చివరి నిమిషంలో ఇంకా బయటకు అడుగు పెట్టడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వెనక్కి పిలిచి మిమ్మల్ని ఎలిమినేట్ చేసే అధికారం మాకు గానీ హౌస్ సభ్యులకు గానీ లేదు కేవలం ఆడియన్స్కు మాత్రమే అవకాశం ఉంటుంది అని చెబుతూ సీక్రెట్ రూమ్ లో ఉండాల్సిందిగా చెప్పి పంపిస్తారు.

లోబో సీక్రెట్ రూమ్

లోబో సీక్రెట్ రూమ్

లోబో సీక్రెట్ రూమ్ కి వెళుతున్నాడు అనే విషయం ముందు నుంచి ప్రచారం జరగడంతో ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే హౌస్ లోపల ఉన్న సభ్యులు కూడా లోబో సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు అనే విషయం మీద క్లారిటీ తోనే ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ లో సిరి మాట్లాడుతూ ఇప్పటికే ఆరుగురు వెళ్లిపోయారు.. అందులో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు.. ఈవారం శ్వేత సేవ్ అయ్యి ఉంటే నేనే ఎలిమినేట్ అయ్యేదాన్ని అని జస్వంత్ తో చెబుతోంది.

ఇది దారుణం

ఇది దారుణం

ఏంట్రా ఇది దారుణం.. అబ్బాయిలని ఎలిమినేట్ చేయొచ్చు కదా అని జెస్సీ దగ్గర ఎమోషనల్ అయ్యింది సిరి. అయితే దాదాపు హౌస్ సభ్యులు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ల గురించి మిగతా హౌస్ సభ్యులు మాట్లాడటం అనేది చాలా అరుదు. కానీ నిన్ను చూపించిన ఎపిసోడ్ లో మాత్రం దాదాపు రవి, సన్నీ, ఆనీ మాస్టర్, ప్రియా లాంటివాళ్లు లోబో గురించే మాట్లాడుతున్నట్లుగా చూపించారు. వీరు మాత్రమే కాక మరి కొందరు కూడా లోబో గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. రవి, ఆనీ మాస్టర్ కూడా అనాల్సిన వన్నీ అనేసి చివర్లో మంచోడు అని అనడం చూస్తే హౌస్ లోపల లోబో ఉన్నాడు అనే విషయం మీద వీరంతా క్లారిటీ తోనే ఉన్నారని భావించవచ్చు.

Recommended Video

Nandamuri Babulu Lyrical Song | D/o BuchiReddy Movie
ఆ మాత్రం తెలియదా?

ఆ మాత్రం తెలియదా?

అదీకాక కాజల్ లాంటి వాళ్లు దాదాపు అన్ని సీజన్లను కాచి వడపోసి ఇక్కడికి వచ్చారు అని చెబుతున్నారు వాళ్ళకి లోబో ఇలా సీక్రెట్ రూమ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది అనే విషయం తెలుసు. సోలో లోపలే ఉన్నాడు అనే విషయం మీద వాళ్ళు అంత క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ కూడా లోబో కి ఎలాంటి సీన్లు చూపిస్తే ఇంటి సభ్యుల మనస్తత్వం తెలుస్తుంది అనే విషయం అర్థం అయి అలాంటి సీన్లు చూపిస్తూ లోబోని మరింత దృఢంగా తయారుచేసేలా చేస్తున్నాడు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎండాకా వెళ్తుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X