twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5.. నాగార్జున, యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతంటే.. కరోనాతో స్టార్ హీరోయిన్‌ మిస్పింగ్!

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5 కొద్ది గంటల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నది. అయితే ఇప్పటికే ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఈ షో ఓపెనింగ్‌కు సంబంధించిన ప్రీ షూట్ ప్రస్తుతం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నది సంగతి తెలిసిందే. అయితే హోస్ట్ నాగార్జున, ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్లలో కొందరికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రసార సమయాలు ఎప్పుడెప్పుడంటే..

    ప్రసార సమయాలు ఎప్పుడెప్పుడంటే..

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 షో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 15 వారాల పాటు బిగ్‌బాస్ షో కొనసాగున్నది.

    జాబితాలో గల్లంతైన పేర్లు

    జాబితాలో గల్లంతైన పేర్లు

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 జాబితాలో వర్షిణి సౌందరరాజన్, ఇషా చావ్లా, నవ్య స్వామి, సురేఖవాణి పేర్లు వినిపించాయి. అయితే వారి పేర్లు తుది జాబితాలో లేవని కన్ఫార్మ్ చేస్తున్నారు. వీరి పేర్లే కాకుండా మరికొందరు పేర్లు గల్లంతు కావడం, మరికొందరి పేర్లు జాబితాలోకి రావడం జరిగిందని చెబుతున్నారు.

    హీరోయిన్ ఇషా చావ్లాకు కరోనా పాజిటివ్?

    హీరోయిన్ ఇషా చావ్లాకు కరోనా పాజిటివ్?

    అయితే హీరోయిన్ ఇషా చావ్లా, పాయల్ రాజ్‌పుత్ పేర్లు చాలా బలంగా వినిపించాయి. అయితే ఇషా చావ్లాకు కరోనావైరస్ పాజిటివ్ అనే వార్తలు బయటకు వచ్చాయి. అందువల్లనే ఆమెను ఎంపిక చేయలేదనే మాట మీడియాలో వినిపించింది. ఇక పాయల్ రాజ్‌పుత్ తొలుత సానుకూలంగానే ఉన్నా.. ఆ తర్వాత తాను చేయలేనని చెప్పినట్టు తెలిసింది. ఇంకా సుడిగాలి సుధీర్ పేరు కూడా వినిపించింది. అయితే సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశిస్తున్నారనే మాట కూడా వినిపిస్తున్నది.

    నాగార్జున అక్కినేని రెమ్యునరేషన్

    నాగార్జున అక్కినేని రెమ్యునరేషన్

    గత రెండు సీజన్లుగా అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మూడు, నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా నడింపించారు. ఇప్పుడు 5వ సీజన్‌కు క్రేజీగా సిద్ధమయ్యారు. అయితే హోస్ట్‌గా నాగ్ రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గత సీజన్‌కు నాగార్జున రూ.8 కోట్ల మేర పారితోషికాన్ని పుచ్చుకొంటే.. బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌‌కు సుమారు రూ.9 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. తన రెమ్యునరేషన్‌ను సుమారు 15 శాతం పెంచినట్టు తెలిసింది.

    యాంకర్ రవి రెమ్యునరేషన్

    యాంకర్ రవి రెమ్యునరేషన్

    ఇక కంటెస్టెంట్లలో యాంకర్ రవికి చెల్లించనున్న రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. 19 మంది కంటెస్టెంట్లలో యాంకర్ రవికి అత్యధికంగా పారితోషికాన్ని చెల్లిస్తున్నట్టు సమాచారం. వారానికి చొప్పున యాంకర్ రవికి పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. దాదాపు 8 వారాలు పక్కగా ఉండేలా ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. వారానికి 7 నుంచి 10 లక్షల మధ్య రెమ్యురేషన్‌ను నిర్వాహకులు ఫిక్స్ చేసినట్టు సమాచారం.

    English summary
    Bigg Boss Telugu 5 season is strating on September 5th. This time 19 members are entering into house. As per Reports, Nagarjuna Charging 9 crores for this season.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X