twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున సినిమాపై హైపర్ ఆది పంచ్ లు.. తోలు ఊడి వచ్చేస్తుంది అంటూ నాగ్ స్వీట్ వార్నింగ్

    |

    బిగ్ బాస్ హౌస్ ఈ వారం ఎంటర్ టైన్ మెంట్ తో ముందుకు సాగుతోంది. గత ఐదు వారాల తో పోలిస్తే ఈ వారం మాత్రం నాగార్జున మంచి ఎంటర్టైన్మెంట్ అందించారని చెప్పాలి. ముఖ్యంగా ఆదివారం రోజు నాగార్జున ఫెస్టివల్ సందర్భంగా ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చారు. ఎపిసోడ్ లో కొంతమంది సెలబ్రిటీలు డ్యాన్సులు పాటలతో అలరించారు. కంటెస్టెంట్స్ కూడా సరదాగా గేమ్స్ ఆడుతూ కనిపించారు. ఇక టాస్క్ లు డ్యాన్స్ లు ఒక రేంజ్ లో ఉంటే హైపర్ ఆది డైలాగ్స్ మాత్రం మరొక రేంజ్ లో పేలాయి. ముఖ్యంగా నాగార్జున పై వేసిన పంచ్ లు మంచి ఎంటర్టైన్మెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అయితే హైపర్ ఆది వేసిన పంచ్ కు నాగార్జున కూడా మధ్య మధ్యలో స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. మొత్తంగా హైపర్ ఆది మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    హైపర్ ఆది నాన్ స్టాప్ పంచ్ లు

    హైపర్ ఆది నాన్ స్టాప్ పంచ్ లు

    ఇతరుల పై పంచులు వేయడం లో జబర్దస్త్ హైపర్ ఆది ఎంతగా ఆలోచిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షించారు. నాన్ స్టాప్ పంచులు వేయడం స్టార్ట్ చేశాడు. అందరికంటే ముందుగా బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నటువంటి నాగార్జున పై కూడా హైపర్ ఆది తన ఆటో పంచ్ లతో ఆశ్చర్యపరిచాడు. ఒక విధంగా నాగార్జున కూడా దానికి తగ్గట్లుగానే కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఒక విధంగా హైపర్ ఆది కి మాత్రం స్టేజీపై ఫుల్ ఫ్రీడమ్ దొరికినట్లు అనిపించింది.

     నాగార్జునపై కూడా

    నాగార్జునపై కూడా

    ఆదివారం రోజు అన్నిటికంటే హైలెట్ గా హైపర్ ఆది ఇన్వెస్టిగేషన్ ఎంతగానో నవ్వించింది. ఇన్ని రోజులు మీ అందరినీ ఒక పోలీస్ ఆఫీసర్ గా చూస్తూనే ఉన్నాడు అంటూ ఇప్పుడు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వస్తున్నాడు అని హైపర్ ఆది నాగార్జున స్టేజి మీదికి పిలిచారు. ఇక ఒక్కొక్కరిని ఆటాడుకున్న హైపర్ ఆది అందరికంటే ముందుగా నాగార్జునపై కూడా ఎవరూ ఊహించని విధంగా పంచ్ లు వేయడం మొదలుపెట్టాడు.

    అమ్మాయి మెడలో చేయిన్ లాగారు

    అమ్మాయి మెడలో చేయిన్ లాగారు

    నాగార్జున గారు మీ మీద ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. 1989 అక్టోబర్ 5న మీరు ఒక చేయిన్ లాగారు అనే కంప్లైంట్ చేశారు. అవును లాగాను అంటూ నాగార్జున సమాధానం ఇవ్వడంతో హైపర్ ఆది కూడా నేను కేసు పెడతాను అంటూ మనకు సమాధానం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత శివ సినిమాలో గుర్తుచేస్తూ నేను లాగింది మెడలో చేయిన్ కాదు సైకిల్ చేయిన్ అని నాగార్జున సున్నితంగా స్పందించాడు. ఓకే.. శివ సినిమాలో అలా లాగారా నేను నిజంగా ఆమె మెడలోనిది లాగేసుకున్నారేమో అని అనుకున్నాను అంటూ ఆది నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    తోలు ఊడి వచ్చేస్తుంది..

    తోలు ఊడి వచ్చేస్తుంది..

    ఇక ఆ తర్వాత నేను కూడా ఒకరోజు సైకిల్ చేయిన్ లాగుదామని అనుకున్నాను. కానీ అది రాలేదు చేతిలో ఉన్న తోడు మాత్రం ఊడి వచ్చింది అని హైపర్ ఆది ఆన్సర్ ఇవ్వగా అందుకు నాగార్జున కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంకోసారి అలా లాగితే మాత్రం ఒంటి మీద ఉన్న తోలు కూడా ఊడి వచ్చేస్తుంది అంటూ నవ్వుతూనే నాగార్జున హైపర్ ఆది పై కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి నాగార్జున కూడా హైపర్ ఆది కామెడీ టైమింగ్ నవ్వుకున్నారు. గ్యాప్ లేకుండా ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తాను మొదట ప్రియాగారి తోనే మొదలు పెట్టాడు. మీరు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అని అనుమానం కలగడంతో మీరు క్యాప్టెన్ అయ్యారు కదా నేను పోలీస్ ఆఫీసర్ అవ్వలేనా అని తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ తో నవ్వించారు.

    English summary
    Bigg boss telugu 5 hyper aadi non stop counters and nagarjuna punch,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X