Bigg Boss 5: 25 నిమిషాల కోసం హైపర్ ఆది షాకింగ్ రెమ్యునరేషన్.. మరో ఎంట్రీ కూడా..

బిగ్ బాస్ సీజన్ 5 మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. మొదటి రెండు వారాలు రేటింగ్స్ బాగానే అందుకున్న ఈ రియాలిటీ షో ఆ తరువాత మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. చాలా వరకు బోరింగ్ గానే అనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. గతంలో మాదిరిగా భీకరమైన పోటీలు పెద్దగా కనిపించడం లేదని టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా షోకు సంబంధించిన రేటింగ్ మళ్ళీ ఈ ఆదివారం తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది. గత 5 వారాల కంటే కూడా నాగార్జున ఇటీవల ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక దానికి తోడు హైపర్ ఆది అరగంట పాటు కంటెస్టెంట్స్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ఇక అతని రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో ఒక టాక్ వైరల్ అవుతోంది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఆడియెన్స్ అప్సెట్

ఆడియెన్స్ అప్సెట్

బిగ్ బాస్ సీజన్ 5 ఈసారి అంతకు మించి అనేలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నాగార్జున మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. అయితే మొదటి రెండు మూడు వారాలు కూడా ఆడియన్స్ పెద్దగా సర్ ప్రైజ్ అయ్యింది లేదు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు ఈ సారి పెద్దగా ఆకట్టుకోలేదు అని కామెంట్స్ వచ్చాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రొటీన్ సెలబ్రిటీలను తీసుకురావడం పెద్దగా నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి.

 సరికొత్త టాస్క్ లు..

సరికొత్త టాస్క్ లు..

కంటెస్టెంట్స్ విషయాన్ని పక్కన పెడితే ప్రతి సారి కూడా బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లతో టీవీ ప్రేక్షకులను అంతకంతకూ ఆకర్షిస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం మొదటి రెండు మూడు వారాల్లో పెద్దగా ఎట్రాక్ట్ చేసే విధంగా అయితే టాస్క్ లు సక్సెస్ కాలేకపోయాయి. ఇక మొత్తానికి మళ్లీ ఆదివారం రోజు నాగార్జున ఫెస్టివల్ సందర్భంగా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేశారు. హైపర్ ఆది ఇన్వెస్టిగేషన్ కూడా బాగా క్లిక్ అయింది.

హైపర్ ఆది రావడంతో

హైపర్ ఆది రావడంతో

హైపర్ ఆది రావడంతో ఆదివారం షోకు ఒక్కసారిగా రేటింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. కొంత మంది సెలబ్రెటీలు డ్యాన్స్ లతో పాటలతో ఆకట్టుకున్నప్పటికి కూడా అందులో ఎక్కువగా హైపర్ ఆది స్కిట్ అయితే బాగానే పేలింది. మొత్తానికి కంటెస్టెంట్స్ అందరిని కూడా మొదటి నుంచి కూడా హైపర్ ఆది పరీక్షించి మరీ తన రివ్యూ ఇచ్చినట్లు అర్థం అయింది.

25 నిమిషాల పాటు

25 నిమిషాల పాటు

ఇక అతనికి స్టార్ మా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. హైపర్ ఆది కేవలం 25 నిమిషాల పాటు షో లో తనదైన పంచ్ డైలాగులతో అందరిని ఎంతగానో నవ్వించాడు. అయితే అతనికి రెమ్యూనరేషన్ కూడా బాగానే అందినట్లు తెలుస్తోంది. సాధారణంగా జబర్దస్త్ లో వారానికి 3 ఎపిసోడ్లను పూర్తిచేస్తే అందుకుగాను లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటారట.

రెమ్యునరేషన్ ఎంతంటే

రెమ్యునరేషన్ ఎంతంటే

ఇక బిగ్ బాస్ లో మొదటిసారి ఒక అవకాశం అందుకున్న హైపర్ ఆది ముందు నుంచి ఈ షోను ఫాలో అవుతూ వస్తున్నాడు. స్టార్ మా షో మొదలైనప్పుడే అతనికి అడ్వాన్స్ ఇచ్చి షోను ఫాలో అవ్వమని చెప్పిందట. ఇక మొదట అరగంట పాటు కనిపించాల్సి వస్తుందని కమిట్మెంట్ తీసుకొని 2.50లక్షలకు పైగా పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Recommended Video

Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
భవిష్యత్తులో మరోసారి

భవిష్యత్తులో మరోసారి

అలాగే భవిష్యత్తులో కూడా మరొకసారి బిగ్ బాస్ లో సందడి చేసే అవకాశం కూడా ఉందట. ఆదివారం కంటెస్టెంట్స్ లోపలకి రావాలని పిలువగా దానికి ఇంకా టైమ్ ఉందని హైపర్ ఆది సమాధానం అయితే ఇచ్చాడు. అందరిపై తన కామెడీ పంచ్ బలాన్ని చూపించిన హైపర్ ఆది టాలెంట్ కు నాగార్జున కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X