Bigg Boss Telugu 5: దమ్ముంటే డైరెక్ట్‌గా ఆడాలి, దొంగబుద్ధులు ఏంది..బురదలో పడి కొట్టుకున్న విశ్వ, మానస్
బిగ్బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే ఈ వారం ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా ఇప్పుడు హౌస్ లో ఎవరు కెప్టెన్గా ఎన్ని కాబోతున్నారు అనే విషయం మీద కూడా బిగ్ బాస్ కొత్త కొత్త స్కూలు ప్రవేశపెట్టారు. తాజాగా జరిగిన ఒక టాస్క్ లో భాగంగా విశ్వ అలాగే మానస మధ్య భీకర పోరు చోటుచేసుకుంది ఇది ఒకరి మీద ఒకరు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

మొదటి ప్రోమోలో
బిగ్ బాస్ సీజన్ 5 ఐదో వారానికి ఎంటర్ అయింది, ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన రెండు ప్రోమోలు విడుదల చేశారు. మొదటి ప్రోమోలో కాజల్ పై యాంకర్ రవి ఫైర్ అవుతూ కనిపించాడు. కాజల్ సరదాగా రవి,లోబోలను ఆట పట్టిస్తుంటే.. సీరియస్‌గా తీసుకున్న రవి, లోబో అలా ఎలా అంటావంటూ ఆమెపై మండిపడ్డారు. ఆమె కావాలనే రెచ్చగొడుతుంది అని పేర్కొన్న రవి అలా చేయడం నాకు కూడా వస్తుందంటూ కాజల్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

రాజ్యానికి ఒక్కడే రాజు
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే ఒక కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు ఇద్దరు రాజులూ కాగా వారిని సపోర్ట్ చేస్తున్న వారు రెండు టీమ్ లుగా విడిపోవాల్సి ఉంటుంది. ఇక రవి, సన్నీ ఇద్దరూ రాజు గెటప్స్ లో కనిపించారు. ఆ తర్వాత సన్నీ జట్టులో ఉండిన మానస్.. 'ఈ గట్టు నుంచి ఆ గట్టుకు రావాలంటే ఎంత ఇస్తారు చెప్పండి ? ' అని రవిని అడిగాడు. దానికి ఆయన.. 'మీ బలాన్ని జనాలకు తెలుపుతాను.. అదిస్తాను' అని బదులిచ్చాడు.

మట్టిలో మల్ల యుద్ధానికి
ఇక 'జరగబోయే టాస్క్ లు ఎలా ఉంటాయో రాజావారికి కూడా తెలియదు. ఎందుకంటే యుద్ధం ఏ రూపంలో వస్తుందో నాకు తెలియదు' అంటూ సన్నీ డైలాగ్ అనడంతో అప్పటిదాకా కోపంగా ఉన్న ప్రియా కూడా ఫక్కున నవ్వేసింది. అలా విశ్వ మానస్ తో మట్టిలో మల్ల యుద్ధానికి దిగాడు. ఆ సమయంలో సిరి, షన్ను అండ్ కో వెళ్లి కాయిన్స్ ను దొంగిలించింది.
దమ్ముంటే దొంగ బుద్ధులెందుకు
ఇక ఈ విషయం తెలిసి 'దమ్ముంటే ముంగటకి వచ్చి ఆడుకోవాలే.. ఆ దొంగ బుద్ధులెందుకు' అంటూ విశ్వ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో మానస్ 'పేరు తీసి మాట్లాడకపోయినా అందరినీ ఎందుకు అంటున్నావ్' అని గొడవకు దిగాడు. దీంతో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఫైర్ అవడం కనిపిస్తుంది.
Recommended Video

ఎవరికి ఎవరు సపోర్ట్ అంటే?
ఇక బిగ్‌బాస్ కుర్చీ కోసం యాంకర్ రవి, సన్నీ ఇద్దరూ తెగ కష్టపడుతూ ఉండగా ప్రజలకు హామీలు ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక సిరి, షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక సింగ్, లోబో, ప్రియ సన్నీకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించగా రవికి విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించారు. ఇక హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు కెప్టెన్ అయ్యారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే దాకా ఆగాల్సిందే!


Click it and Unblock the Notifications











