Bigg Boss 5: విన్నర్ కంటే వేగంగా జెస్సి మొదటి మూవీ.. అప్పుడే ఫస్ట్ లుక్ తో షాక్!
బిగ్ బాస్ ఐదో సీజన్ కూడా రేటింగ్స్ అందుకోవడంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసినట్లు అర్థమవుతోంది. అసలైతే ఇలాంటి కాంట్రవర్సీ షో తెలుగులో ఏ మాత్రం సక్సెస్ కాదు అని మొదట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైన షో ఇప్పుడు నాగార్జునతో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకున్న వారు కెరీర్ ను సరైన క్రమంలో సెట్ చేసుకోవడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. ఇక ఐదో సీజన్లో అందరి కంటే వేగంగా జస్వంత్ జెస్సి పడాల ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతను నటించిన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు.

టాలెంట్ ఉన్న వారే..
బిగ్ బాస్ ద్వారా వచ్చే క్రేజ్ తోనే కెరీర్ సరైన క్రమంలో సెట్ చేసుకోవాలని కంటెస్టెంట్స్ ఎంతగానో కష్టపడుతుంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న వారు బిగ్ బాస్ లో అవకాశం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఫైనల్ గా టాలెంట్ ఉన్న వారే ఇప్పుడు కాకపోయినా తర్వాత సీజన్స్ లో అయినా అవకాశం అందుకుంటూ ఉంటారు. అదే తరహాలో జెస్సి కూడా అవకాశం అందుకున్నాడు.

మోడల్ జెస్సి
బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే వరకు కూడా జెస్సి పడాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అతను ఎక్కువగా ఫ్యాషన్ ప్రపంచంలో చాలా క్రేజ్ అందుకున్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో అథానిక్ చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నాయి. జస్వంత్ జెస్సి పడాల మోడల్ గా చాలా మందికి ర్యాంప్ వాక్ కూడా నేర్పిస్తూ ఉంటాడు. అతనికి ఫ్యాషన్ ప్రపంచంలో అయితే మంచి డిమాండ్ ఉంది.

చిన్నపిల్లాడి మనస్తత్వం..
ఇక జెస్సి పడాల హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా చిన్న పిల్లాడి మనస్తత్వం తో కనిపించాడు అని కంటెస్టెంట్స్ అందరూ కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా అనీ మాస్టర్ తో అతను గొడవపడిన విధానంతోనే ఇంట్లో నుంచి వెళ్లి పోతాడు అని కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ అతను మాత్రం సోలోగా ఫైట్ చేస్తూ ఫిజికల్ టాస్క్ లో తన బలం గట్టిగానే చూపించాడు.

కెరీర్ ను సెట్ చేసుకునే ప్రయత్నంలో..
ఇక అతను 10 వ వారం హౌస్ లో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని అనారోగ్య కారణాల వలన హౌస్ లో నుంచి బయటకు రాక తప్పలేదు. అతను ఉండి ఉంటే తప్పకుండా ఫైనల్ రిజల్ట్ లో కూడా ఎన్నో మార్పులు వచ్చేవని చెప్పవచ్చు. ఇక జెస్సి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా వేగంగా తన కెరీర్ ను సెట్ చేసుకునే ప్రయత్నంలో బిజీ అయ్యాడు అని అర్థమయింది.

ఫస్ట్ లుక్ పోస్టర్
ఇటీవల బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో తనకు ఒక సినిమా అవకాశం వచ్చినట్లు జెస్సి అధికారికంగా తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. మొహంపై రక్తపు మరకలతో చేతిలో గన్ పట్టుకొని ఉన్న జెస్సి ఎవరూ ఊహించని విధంగా యాక్షన్ లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాకు ఎర్రర్ 500 అనే టైటిల్ ను సెట్ చేశారు.

అందరి బ్లెస్సింగ్స్ కావాలి..
ఇక జెస్సీ సినిమా గురించి సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చాడు.. ఇది నా ఫస్ట్ మూవీ. పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ఇక మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మీ ప్రేమ సపోర్ట్ తో ఈ సినిమాను స్టార్ట్ చేశాను. తప్పకుండా భవిష్యత్తులో చాలా ఎక్కువ మందిని మెయింటైన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అని జస్వంత్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











