For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: సిరి, షణ్ముఖ్‌పై జెస్సీ సీరియస్.. బాత్రూంలో అలా చేస్తారా.. నేనుంటే చెంప పగిలేదంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై భారీ స్పందనను అందుకుంటూ రియాలిటీ షోలలో రారాజుగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇక్కడ మాత్రమే కాదు.. అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా పేరు సంపాదించుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఐదో సీజన్‌ను కూడా మొదలెట్టారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోన్న ఇది.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇక, ఇందులో అనూహ్యంగా బయటకు వెళ్లిపోయిన జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్‌పై సీరియస్ అయ్యాడు. ఆ వివరాలు మీకోసం!

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

   తాజా సీజన్‌లో జస్వంత్ హైలైట్‌

  తాజా సీజన్‌లో జస్వంత్ హైలైట్‌

  తాజా సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. ఆరంభంలోనే అతడు ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాడు.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  వాళ్లిద్దరితో కలిసి రచ్చ చేశాడుగా

  వాళ్లిద్దరితో కలిసి రచ్చ చేశాడుగా

  షో మొదట్లోనే మంచి గుర్తింపును అందుకున్న జస్వంత్ పడాల.. మొదటి వారంలో ఆనీ మాస్టర్‌తో, ఆ తర్వాత శ్రీరామ్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్లీ ఫైటర్‌గా పేరు తెచ్చుకునేంత ఆడాడు. అయితే, షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది అతడికి బ్యాడ్‌నేమ్ తెచ్చింది.

  అనారోగ్యంతో షో నుంచి అవుట్

  అనారోగ్యంతో షో నుంచి అవుట్

  సీజన్ ఆరంభంలోనే గాయాల పాలవడంతో ఆటలో నెమ్మదించిన జెస్సీ.. ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. వర్టిగో అనే వ్యాధితో బాధ పడుతూనే చాలా రోజుల పాటు హౌస్‌లో కొనసాగాడు. కానీ అది క్రమక్రమంగా ఎక్కువ అవడంతో జెస్సీని కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచి చికిత్సను అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో పదో వారం ఇంటి నుంచి పంపించేశారు.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  సిరి తప్పు చేస్తే సరిచేస్తానంటూ

  సిరి తప్పు చేస్తే సరిచేస్తానంటూ

  బయటకు వచ్చిన తర్వాత జెస్సీ ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో సిరి గురించి మాట్లాడుతూ.. 'సిరి చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ, పరిస్థితుల్ని బట్టి తను అలా చేస్తుంది. బిగ్ బాస్ హౌస్‌లో వైబ్స్ అలా ఉంటాయి. అక్కడ ఏం చేస్తున్నామో మనకే తెలియదు. మనలో కొత్త మనిషి పుట్టుకొస్తాడు' అంటూ చెప్పుకొచ్చాడు.

  సిరి, షన్నూ ఫ్రెండ్‌షిప్‌పై ఇలా

  సిరి, షన్నూ ఫ్రెండ్‌షిప్‌పై ఇలా

  ఇదే ఇంటర్వ్యూలో షణ్ముఖ్, సిరి ఫ్రెండ్‌షిప్ గురించి జస్వంత్ పడాల మాట్లాడాడు. 'షణ్ముఖ్ అనేవాడు పొసెసివ్ ఫ్రెండ్. అదే నిజమైన ఫ్రెండ్‌షిప్. వాళ్లు ఫ్రెండ్‌షిప్‌లో జన్యున్‌గానే ఉంటున్నారని అనిపించింది. నాకోసం వాళ్లు చాలా ఫైట్ చేశారు. తొలి వారం నేను తప్పు చేయలేదని నమ్మి ఆనీ మాస్టర్‌తో ఫైట్ చేశారు. తర్వాత శ్రీరామ్‌తోనూ గొడవ పడ్డారు' అని తెలిపాడు.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

   బయటకు వచ్చాక మారుతారు

  బయటకు వచ్చాక మారుతారు

  సిరి, షన్నూ రిలేషన్‌పై జెస్సీ మాట్లాడుతూ.. 'నాకు వర్టిగో వచ్చినప్పుడు ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపించింది. ఆ టైంలో సిరి నాకు సాయం చేసింది. దీంతో తనతో బాడింగ్ ఏర్పడింది. అందుకే ఆమెను ఎవరైనా ఏమన్నా అంటే కోపం వచ్చేది. ఇప్పుడు షణ్ముఖ్‌తో తన ఎమోషనల్ బాండింగ్‌ను ఇలా ఎక్స్‌ప్రెస్ చేసింది. బయటకు వస్తే మొత్తం మారుతుంది' అని చెప్పాడు.

  Recommended Video

  Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
  అక్కడుంటే చెంప పగిలిపోయేది

  అక్కడుంటే చెంప పగిలిపోయేది

  సిరి తనను తాను కొట్టుకోవడంపై జస్వంత్ మాట్లాడుతూ.. 'చిన్న దానికే ఎమోషనల్ అయి సిరి వాష్ రూంకు వెళ్లి అలా తల కొట్టుకోవడం లాంటివి కరెక్ట్ కాదు. ఆ టైంలో నేను హౌస్‌లో ఉండుంటే ఆమె చెంప పగలగొట్టేవాడిని. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. సిరి అయినా షణ్ముఖ్ అయినా చెంప పగిలిపోయేది. ఏది ఏమైనా ఆమె అలా చేయడం తప్పు. ' అని వివరించాడు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Jaswanth Padala Fire on Siri Hanmanth and Shanmukh Jaswanth In An Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X