For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్‌లోనే ఆ అమ్మాయికి ముద్దు పెట్టిన జెస్సీ: వీడియోతో అడ్డంగా దొరికిపోవడంతో రచ్చ

  |

  తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అయిన ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అలా ఇప్పటికే ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయారు. అలాంటి వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు.

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో సందడి చేసిన అతడు.. బయటకు వచ్చాక మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మాయికి ముద్దు పెట్టి బుక్కైపోయాడు. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  ఫోకస్ అయిన కంటెస్టెంట్లలో జెస్సీ

  ఫోకస్ అయిన కంటెస్టెంట్లలో జెస్సీ

  గత నెలలో ముగిసిన ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. అలాంటి వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు.

  Bangarraju Twitter Review: బంగార్రాజుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  అలా ఫేమస్... వాళ్లతో కలిసి రచ్చ

  అలా ఫేమస్... వాళ్లతో కలిసి రచ్చ

  బిగ్ బాస్ ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకున్న జస్వంత్ పడాల.. మొదటి వారంలో ఆనీ మాస్టర్‌తో, ఆ తర్వాత శ్రీరామ్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్లీ ఫైటర్‌గా పేరు తెచ్చుకునేంత ఆడాడు. అయితే, షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకుని రచ్చ రచ్చ చేసేశాడు.

  ఊహించని విధంగా ఎలిమినేషన్

  ఊహించని విధంగా ఎలిమినేషన్

  జస్వంత్ పడాల వ్యవహార శైలి పరంగా ఎలా ఉన్నా.. ఆరోగ్య సమస్యలు వెంటాడినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేశాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. అయితే, వర్టిగో అనే వ్యాధితో బాధ పడడంతో జెస్సీని కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే ఐదో సీజన్ పదో వారం ఇంటి నుంచి బయటకు పంపేశారు.

  చిన్న క్లాత్‌ చుట్టుకుని ప్రియాంక చోప్రా రచ్చ: బాడీ అంతా కనిపించేలా మరీ ఘోరంగా!

  సినిమాను మొదలెట్టేసిన జస్వంత్

  సినిమాను మొదలెట్టేసిన జస్వంత్

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్వంత్ పడాల యమ పాపులర్ అయిపోయాడు. ఈ క్రమంలోనే అతడు ఏకంగా హీరోగా ఓ సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. 'ఎర్రర్ 500' అనే టైటిల్‌తో వస్తున్న ఇందులో అతడు ఫుల్ యాక్షన్ అండ్ అగ్రెసివ్‌ రోల్ చేస్తున్నాడు. సందీప్ మైత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

  బయట మాత్రం తెగ హల్‌చల్ చేసి

  బయట మాత్రం తెగ హల్‌చల్ చేసి

  బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు పెద్దగా పరిచయం లేని జస్వంత్ పడాల.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం సెలెబ్రిటీగా మారాడు. దీంతో అతడు తీరక లేకుండా తిరుగుతున్నాడు. విజయవాడలో అతడితో ర్యాలీని కూడా చేశారు అక్కడి స్థానికులు. ఇక, తోటి కంటెస్టెంట్లతో కలిసి జెస్సీ తరచూ పార్టీలు చేసుకుంటున్నాడు. ఎక్కువ లేడీ ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ చేస్తున్నాడు.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  అమ్మాయికి ముద్దు పెట్టిన జస్వంత్

  అమ్మాయికి ముద్దు పెట్టిన జస్వంత్

  బిగ్ బాస్ పుణ్యమా అని జస్వంత్ పడాల ఏది చేసినా హైలైట్ అయిపోతుంది. ఇటీవలే శ్వేత వర్మకు ప్రపోజ్ చేసిన వీడియోను వదిలిన అతడు.. వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా జెస్సీ ఓ అమ్మాయితో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశాడు. అందులో ఆమెను హగ్ చేసుకుని కనిపించిన అతడు.. ఆ తర్వాత ముద్దు కూడా పెట్టేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  వీడియో రావడంతో జెస్సీపై ట్రోల్స్

  వీడియో రావడంతో జెస్సీపై ట్రోల్స్

  అమ్మాయికి ముద్దు పెట్టిన వీడియో వైరల్ అవడంతో జస్వంత్ పడాలను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతడిపై మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. 'ఎవరినీ వదలవేంట్రా నువ్వు' అంటూ అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

  English summary
  Bigg Boss 5th Season Contestant Jaswanth Padala Full Busy After Show. Recently He Gave Kiss to a Girl in Live Video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion