For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఆ హీరోయిన్‌కు ప్రపోజ్ చేసిన జెస్సీ.. లైవ్‌లోనే ఏకంగా ముద్దులు.. షోలో అలా బయట ఇలా!

  |

  తెలుగులో భారీ సక్సెస్‌ను అందుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఈ షో వల్ల చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

  అలాంటి వారిలో ఐదో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు.. అనారోగ్యంతో హౌస్‌ను వీడాడు. కానీ, బయటకు వచ్చిన తర్వాత మాత్రం రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లైవ్‌లో ఓ హీరోయిన్‌కు ప్రపోజ్ చేశాడు. అంతేకాదు, ముద్దులు కూడా ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  ఎలా అనుకున్నారో.. అలాగే మొదలు

  ఎలా అనుకున్నారో.. అలాగే మొదలు

  తెలుగులో బిగ్ బాస్‌కు దక్కేంత ఆదరణ మరే భాషలోనూ రావడం లేదు. అందుకే గతంలో వచ్చిన నాలుగు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఐదో సీజన్‌లో మరింత మజాను అందించబోతున్నారు. అంచనాలకు అనుగుణంగానే సరికొత్త టాస్కులు, రొమాన్స్, లవ్, ఎమోషన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.

  Bigg Boss: అర్ధరాత్రి ఒకే బెడ్‌పై సిరి, షణ్ముఖ్.. లెటర్‌పై రాసి మరీ రచ్చ.. ఏకంగా మీదకు ఎక్కేసి అలా!

  ఫోకస్ అయిన కంటెస్టెంట్లలో అతడు

  ఫోకస్ అయిన కంటెస్టెంట్లలో అతడు

  ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. ఆరంభంలోనే అతడు బాగా ఫోకస్ అయిపోయాడు.

  గొడవలతో ఫేమస్.. త్రిమూర్తుల టీమ్

  గొడవలతో ఫేమస్.. త్రిమూర్తుల టీమ్

  ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకున్న జస్వంత్ పడాల.. మొదటి వారంలో ఆనీ మాస్టర్‌తో, ఆ తర్వాత శ్రీరామ్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్లీ ఫైటర్‌గా పేరు తెచ్చుకునేంత ఆడాడు. అయితే, షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది అతడికి మైనస్ అయింది.

  హాట్ ఫొటోలు షేర్ చేసిన సమంత: విడాకుల తర్వాత తొలిసారి ఘాటుగా.. అసలిలా ఎప్పుడూ చూసుండరు

  ఆరోగ్య సమస్యలు... చక్కని ఆటతీరు

  ఆరోగ్య సమస్యలు... చక్కని ఆటతీరు

  తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే సమాధానం చెప్పాడు జెస్సీ. మరీ ముఖ్యంగా ఆరంభంలోనే కెప్టెన్ అయిన అతడు.. ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం ఇస్తూ సత్తా చాటాడు. అప్పట్లో అతడికి ఆరోగ్య సమస్యలు వెంటాడినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేశాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. దీంతో ఎలిమినేషన్స్ తప్పించుకున్నాడు.

  సీక్రెట్ రూంలోకి.. అలా ఎలిమినేషన్

  సీక్రెట్ రూంలోకి.. అలా ఎలిమినేషన్

  సీజన్ ఆరంభంలో గాయాల పాలవడంతో ఆటలో నెమ్మదించిన జెస్సీ.. ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. వర్టిగో అనే వ్యాధితో బాధ పడుతూనే చాలా రోజుల పాటు హౌస్‌లో కొనసాగాడు. కానీ అది క్రమక్రమంగా ఎక్కువ అవడంతో జెస్సీని కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచి చికిత్సను అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో పదో వారం ఇంటి నుంచి బయటకు పంపేశారు.

  హాట్ వీడియోతో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: చాలా రోజుల తర్వాత ఇంత ఘాటుగా కనిపించడంతో!

  బయటకు వచ్చాక వాళ్లతో ఎంజాయ్

  బయటకు వచ్చాక వాళ్లతో ఎంజాయ్

  బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు పెద్దగా పరిచయం లేని జస్వంత్ పడాల.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం సెలెబ్రిటీగా మారాడు. దీంతో అతడు తీరక లేకుండా తిరుగుతున్నాడు. విజయవాడలో అతడితో ర్యాలీని కూడా చేశారు అక్కడి స్థానికులు. ఇక, తోటి కంటెస్టెంట్లతో కలిసి జెస్సీ తరచూ పార్టీలు చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తున్నాడు.

   ఆమెకు లైవ్‌లోనే ప్రపోజ్ చేసిన జెస్సీ

  ఆమెకు లైవ్‌లోనే ప్రపోజ్ చేసిన జెస్సీ

  ఇటీవల జెస్సీ.. శ్వేతా వర్మ, అషు రెడ్డితో ఓ పార్టీ చేసుకున్నాడు. ఆ సమయంలో ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలోనే శ్వేతా ఓ వీడియో రికార్డ్ చేసింది. ఇందులో అతడు.. ఆమెకు ఐలవ్యూ అంటూ పలుమార్లు ప్రపోజ్ చేశాడు. అలాగే, ఫ్లయింగ్ కిస్‌లు కూడా ఇచ్చి షాకిచ్చాడు. హౌస్‌లో కామ్‌గా ఉన్న అతడు.. బయట కొంటెగా కనిపించడంతో అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు.

  English summary
  Telugu Top Rreality TV Series Bigg Boss 5th Season Running Successfully. Recent Season Contestant Jessie Propose to Swetha Varma in Live.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X