twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Bossకి డబ్బులిచ్చి వెళ్లిన జెస్సీ.. ఎట్టకేలకు నోరు విప్పి అసలు నిజం చెప్పేశాడుగా!

    |

    బిగ్‌ బాస్‌ తెలుగు 5వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ రెండు వారాల్లో షో పూర్తి కానుండగా డిసెంబర్ 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది..అయితే ఈ షోలో పాల్గొన్న జస్వంత్ అలియాస్ జెస్సీ డబ్బులు ఇచ్చి షో లో పాల్గొన్నాడు అంటూ ప్రచారం జోరుగా ఎట్టకేలకు ఆ ఆరోపణల మీద నోరు విప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే

     చిన్న పిల్లోడనే ముద్ర

    చిన్న పిల్లోడనే ముద్ర

    మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో దాదాపు చాలా మంది యూట్యూబ్‌ స్టార్స్, సీరియల్, సినీ నటులు పాల్గొన్నారు. అయితే ఈ సారి పెద్దగా గుర్తింపు లేని వాళ్లు కూడా షోలో పాల్గొన్నారనే విమర్శలు మొదటి రోజునే వినిపించాయి. నోటెడ్‌ ఫేసులు తక్కువ అని హమీదా, జెస్సీ లాంటి వాళ్ళు ఎవరికీ తెలియదు అని విమర్శలు వచ్చాయి. జస్వంత్‌ పడాలా అలియాస్ జెస్సీ అయితే హౌస్ లో చిన్న పిల్లోడనే ముద్ర వేసుకున్నాడు.

    అనారోగ్యం కారణంగా

    అనారోగ్యం కారణంగా

    నీకేమీ తెలియదు అంటూ కంటెస్టెంట్ లు జ్ఞాన బోధ చేస్తూ ఉండడంతో ఆ తర్వాత కాస్త గేమ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ బాగానే నెట్టుకొచ్చాడు. కానీ అనారోగ్యం కారణంగా జెస్సీ మధ్యలోనే వెళ్లిపోయాడు. పదో వారంలో జెస్సీ అనారోగ్యం రీత్యా ఆయన నామినేషన్స్ లో లేకపోయినా ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపించారు. అయితే తెలుగు బిగ్‌బాస్‌ షోలో ఎక్కువగా నటీనటులు, కమెడియన్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్‌లు, యూట్యూబర్‌లే కనిపిస్తూ ఉంటారు.

    ఎవరూ లేకపోవడంతో

    ఎవరూ లేకపోవడంతో

    గత సీజన్లో కూడా మోడల్స్‌ ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ సీజన్‌లో ఎవరికీ పెద్దగా పరిచయం లేని మోడల్‌ జెశ్వంత్‌ షోలో ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అతడికి నిజంగానే బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిందా? లేదా అతడే బిగ్‌బాస్‌కు ఎదురు డబ్బులిచ్చి కంటెస్టెంట్‌గా వచ్చాడా? అన్న విమర్శలు మొదటి రోజు నుంచే వినిపించాయి.

    వాళ్ళు కూడా

    వాళ్ళు కూడా

    గతంలో కూడా కొన్ని సీజన్స్ లో పెద్దగా గుర్తింపు లేని వారిని పులికి పంపిన సమయంలో ఇలాంటి రకమైన విమర్శలు వినిపించాయి. కానీ జెస్సీ విషయంలో అవి కాస్త ఘాటుగానే సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. తాజాగా ఈ విషయం మీద జెస్సీ స్పందించారు.

    బయట ఉన్న వాళ్లే కాక పాటు హౌస్‌లో ఉన్నవాళ్లు కూడా నేను బిగ్‌బాస్‌కు డబ్బులిచ్చి వచ్చానని అనుకున్నారు కానీ నేను బిగ్‌బాస్‌ వాళ్లకు డబ్బులివ్వడమేంటి? నా అకౌంట్‌లో రూ.11 వేలు మాత్రమే ఉన్నాయనీ చెబుతూ ఇంటర్వ్యూలో చూపించారు.

    నాకు అంత స్థోమత లేదు

    నాకు అంత స్థోమత లేదు

    అలాగే తాను ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చానని, నాకు తండ్రి లేడు, రాత్రిళ్లు ఉద్యోగం చేసి ఆ డబ్బుతో మోడలింగ్‌ నేర్చుకుంటూ ఎదిగానని జెస్సీ చెప్పుకొచ్చారు. రూపాయి విలువ కూడా నాకు తెలుసన్న ఆయన బిగ్‌ బాస్‌ ఆఫర్‌ ఫ్రీగా వచ్చినా వెళ్దాం అనుకున్నాను కానీ వాళ్లే నాకు డబ్బులిచ్చారనీ చెప్పుకొచ్చారు.

    వారికి ఎదురు డబ్బులిచ్చేంత స్థోమత కానీ బ్యాక్‌గ్రౌండ్‌ కానీ ఆస్తిపాస్తులు కానీ లేవనీ అన్నారు. నేను డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్లాను అనుకునేవాళ్ళు అందరికీ ఒకటే చెబుతున్నాను నేను బిగ్‌బాస్‌కు దొడ్డిదారిన రాలేదు. స్ట్రయిట్‌గా వెళ్లాను, స్ట్రయిట్‌గా ఆడాను అని క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Bigg Boss Telugu 5 ex contestant jaswanth padala responds on money rumours on him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X