For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: వాళ్లు చేసిన తప్పుకు బలైపోయిన జస్వంత్.. కాలికి దెబ్బ ఉన్నా శిక్ష.. షాకైన కంటెస్టెంట్లు

  |

  పేరుకు పాశ్చత్య సంస్కృతికి అద్దం పట్టే షోనే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందుకుని ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్‌ను అందుకుంది బిగ్ బాస్. గతంలో ఇలాంటి షో ఎప్పుడూ రాకపోయినా ఆడియెన్స్ మాత్రం దీన్ని త్వరగానే వంటబట్టించుకున్నారు. ఫలితంగా ఈ రియాలిటీ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదోది కూడా ఇటీవలే ప్రారంభం అయింది. ఆరంభం నుంచే మజాను పంచుతోన్న ఈ సీజన్.. ప్రేక్షకుల అభిమానాని చూరగొంటూ సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో జస్వంత్ పడాల బలైపోయాడు. దీంతో శిక్షను కూడా అనుభవించాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అంచనాలకు అనుగుణంగానే మొదలు

  అంచనాలకు అనుగుణంగానే మొదలు

  తెలుగులో బిగ్ బాస్‌కు దక్కేంత ఆదరణ మరే షోకూ రావడం లేదు. గతంలో వచ్చిన నాలుగు సీజన్లు సూపర్ హిట్ అవడానికి కారణం ఇదే. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఐదో సీజన్‌లో మరింత మజాను అందించబోతున్నారు. అంచనాలకు అనుగుణంగానే సరికొత్త టాస్కులు, రొమాన్స్, లవ్, ఎమోషన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో షోను రంజుగా మార్చేస్తున్నారు.

  Bigg Boss: షొలో అర్ధరాత్రి వాళ్లిద్దరి రొమాన్స్.. పెదాలను తాకుతూ కొంటెగా.. అక్కడ కూడా కిస్ చేయమంటూ!

  అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్

  అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అందులో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు. ఆరంభంలోనే అతడు అందరి దృష్టిని ఆకర్షించాడు.

  ఆమెతో గొడవ... సైలెంట్ అయిపోయాడు

  ఆమెతో గొడవ... సైలెంట్ అయిపోయాడు

  ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకున్న జస్వంత్ పడాల.. మొదటి వారంలో ఆనీ మాస్టర్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో ఆ తర్వాత అతడు చాలా సైలెంట్ అయిపోయింది. టాస్కుల్లో కూడా సరిగా పాల్గొనలేకపోయాడు. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ కారణంతోనే అతడిని వరస్ట్ పెర్ఫార్మర్‌గానూ ఎంచుకున్నారు.

  Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!

   చిన్న పిల్లాడే.. హౌస్‌కు కెప్టెన్ అయ్యాడు

  చిన్న పిల్లాడే.. హౌస్‌కు కెప్టెన్ అయ్యాడు

  ఈ వారం ‘అమెరికా అబ్బాయి.. హైదరాబాద్ అమ్మాయి' టాస్క్ జరిగింది. ఇందులో చక్కగా ఆడిన కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికయ్యారు. అందులో జస్వంత్ పడాల ఒకడు. రవి, శ్వేత వర్మ, శ్రీరామ చంద్రలతో కలిసి కెప్టెన్సీ కోసం పోటీ పడిన అతడు.. ఊహించని విధంగా విజయం సాధించాడు. దీంతో చిన్న పిల్లాడు అన్న వాళ్ల ముందే ఇప్పుడు హౌస్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు.

  జస్వంత్‌ను ఆడుకుంటోన్న కంటెస్టెంట్లు

  జస్వంత్‌ను ఆడుకుంటోన్న కంటెస్టెంట్లు

  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలో జస్వంత్ పడాల చిన్నోడు. ఇప్పుడతను కెప్టెన్ అవడంతో అందరూ లైట్ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా లోబో కెమెరాలకు కనిపించే విధంగా పడుకున్నాడు. దీంతో కుక్కలు మొరిగాయి. అప్పుడు జెస్సీ వచ్చి అడగ్గా పడుకోలేదని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత కూడా పలువురు రూల్స్ బ్రేక్ చేసి ఏడిపించారు.

  హాట్ హాట్ ఫోజులతో కాజల్ అగర్వాల్: పెళ్లైన తర్వాత తొలిసారి ఇంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  వాళ్లంతా చేసిన తప్పుకు బలైన జస్వంత్

  వాళ్లంతా చేసిన తప్పుకు బలైన జస్వంత్

  తరచూ బిగ్ బాస్ నుంచి హెచ్చరికలు వస్తుండడంతో కెప్టెన్ జస్వంత్ పడాల కంటెస్టెంట్లు అందరినీ సోఫా దగ్గర కూర్చోబెట్టాడు. ఆ సమయంలో ‘ఎవరు తప్పులు చేస్తున్నారో తెలియదు కానీ.. బిగ్ బాస్ వార్నింగ్‌లు మాత్రం వస్తున్నాయి. దయచేసి నన్ను క్షమించండి బిగ్ బాస్' అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. ఐదు గుంజీలు కూడా తీస్తూ స్వయంగా శిక్షించుకున్నాడు.

  Mahesh Babu Is The Brand Ambassador For Big C
   కాలికి దెబ్బ ఉన్నా.. అందరూ షాకయ్యారు

  కాలికి దెబ్బ ఉన్నా.. అందరూ షాకయ్యారు

  జస్వంత్‌ కాలికి గాయం ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అతడు కంటెస్టెంట్లు చేసిన తప్పుకు స్వయంగా శిక్షను అనుభవించాడు. ఆ సమయంలో అక్కడున్న వాళ్లందరూ అతడి తీరుకు భయపడిపోయారు. అప్పుడు రవి మాట్లాడుతూ.. ‘నువ్వు ఇంటి కెప్టెన్.. ఇది చేయొద్దు.. అది చేయొద్దు అని ఆర్డర్ ఇవ్వు. ఎవరు చేయకపోతే వాళ్లే బలవుతారు' అని చెప్పాడు.

  English summary
  Telugu Top Rreality TV Series Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. jaswanth Padala Self Punish for Contestants Mistake.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X