For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షోలో రియల్ ఫైటింగ్.. శ్రీరామ్‌ను లేపి విసిరేసిన జస్వంత్.. షణ్ముఖ్ సూపర్ ప్లాన్

  |

  మొట్టమొదటి సారిగా రియాలిటీ కంటెంట్‌తో ప్రసారం అయినా.. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాంటిక్ సీన్స్ చూపించడంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది బిగ్ బాస్ షో. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణు అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇలా ఒకటి కాదు రెండు ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. ఆ వివరాలు మీకోసం!

  చెప్పినట్లుగానే మజాను పంచుతూ

  చెప్పినట్లుగానే మజాను పంచుతూ

  తెలుగులో బిగ్ బాస్‌కు దక్కేంత ఆదరణ మరే భాషలోనూ రావడం లేదు. అందుకే గతంలో వచ్చిన నాలుగు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఐదో సీజన్‌లో మరింత మజాను అందించబోతున్నారు. అంచనాలకు అనుగుణంగానే సరికొత్త టాస్కులు, రొమాన్స్, లవ్, ఎమోషన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో షోను ఆసక్తికరంగా చూపిస్తున్నారు.

  మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్

  షోల ఇద్దరు రాజుల హోరాహోరీ

  షోల ఇద్దరు రాజుల హోరాహోరీ

  ప్రతి వారం బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ఓ టాస్కు జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ వారం ఇద్దరు రాజుల మధ్య హోరాహోరి పోరు జరగబోతుంది. ఇందులో ఒక రాజ్యానికి రవి, మరో రాజ్యానికి సన్నీ యువరాజులుగా ఉంటారు. మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకు నచ్చిన యువరాజుకు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇది పలు రకాల టాస్కులతో జరగబోతుంది.

  సపోర్ట్ ఇచ్చేది ఎవరు? ఉంటారా?

  సపోర్ట్ ఇచ్చేది ఎవరు? ఉంటారా?

  ఏ రాజుకు ఏ కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తారో ముందుగానే వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ఆయా రాజు ఫొటో కింద.. మద్దతు తెలిపే ప్రజల ఫొటోలను ఉంచారు. ఇక, ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్లు తమ మద్దతును ఉపసంహరించుకునేందుకు ప్లాన్లు చేస్తున్నారు. అందులో షణ్ముఖ్ జస్వంత్, కాజల్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపించారు.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  సిరికి సెటైర్ వేసిన యాంకర్ రవి

  ఒక రాజుగా టాస్కులో పాల్గొంటున్న రవి దగ్గరకు సిరి హన్మంత్ డీల్ కుదుర్చుకోడానికి వచ్చినట్లు తాజాగా వదిలిన ప్రోమోలో చూపించారు. ఆమె డిమాండ్ ప్రకారం షణ్ముఖ్ దగ్గరకు వెళ్లనని రవి అంటాడు. ఆ సమయంలో సిరి వెటకారంగా చూస్తుంది. అప్పుడు రవి ‘ఇగో నీ సీరియల్ యాక్టింగులు ఇక్కడ చేయకు' అంటూ పంచ్ వేస్తాడు. దీంతో ఆమె షాకై నోరెళ్లబెట్టేస్తుంది.

  వాళ్లిద్దరూ దొంగతనం.. శ్వేత ఫైర్

  వాళ్లిద్దరూ దొంగతనం.. శ్వేత ఫైర్

  ఈ టాస్కులో భాగంగా రాజుల దగ్గర ఖజానా ఉంటుంది. దాన్ని కంటెస్టెంట్లు టాస్కులు ఆడడం ద్వారా సంపాదించుకోవాల్సి ఉంటుంది. అయితే, అలా కాదని కొందరు దొంగతనం చేస్తున్నారు. ఇక, ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో సైతం మానస్, కాజల్ ఖజానాను కొల్లగొట్టారు. దీన్ని రవి చూస్తాడు. ఆ సమయంలో శ్వేత ‘ఇలాంటి ఆటలు ఆడడం ఎందుకు' అంటూ ఫైర్ అయిపోయింది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
  శ్రీరామ చంద్రను విసిరేసిన జెస్సీ

  శ్రీరామ చంద్రను విసిరేసిన జెస్సీ

  రాజుల టాస్కులో భాగంగా రవి, సన్నీ ఫొటోలతో రెండు బోర్డులు పెట్టగా.. వాటిని మిగిలిన కంటెస్టెంట్లు ధ్వంసం చేస్తూ కనిపించారు. ఇందులో భాగంగా శ్రీరామ చంద్రను జస్వంత్ రగ్బీ గేమ్‌లో మాదిరిగా విసిరి పక్కకు పడేశాడు. అలాగే, విశ్వ.. మానస్ మధ్య కూడా రియల్ ఫైట్ జరిగినట్లు కనిపించింది. దీంతో దెబ్బలు తాకుతాయి అంటూ అరవడం కూడా వినిపించింది.

  English summary
  Telugu Top Rreality TV Series Bigg Boss Recently Started 5th Season. In Upcoming Episode.. Big Fight in Captaincy Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X