Bigg Boss Telugu 5: వెళ్తూ వెళ్తూబాంబులు పేల్చిన జెస్సీ..టాప్ 5 లో వాళ్లే.. వాళ్ళు వాడుకున్నారు అంటూ

బిగ్ బాస్ 5 తెలుగు పదో వారాలు పూర్తి చేసుకుంది. నిన్నటితో పది మంది ఎలిమినేట్ అయ్యారు. 19 మందితో మొదలైన ఈ ఆటలో ఇప్పుడు హౌస్ లో తొమ్మిది మంది హౌస్ సభ్యులు ఉన్నారు. ఇక తాజా ఎలిమినేషన్ ఆసక్తికరంగా సాగింది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Bigg Boss Telugu 5: తగ్గని VJ Sunny క్రేజ్, ఇంతకీ అప్పడం అన్నాడా ? || Filmibeat Telugu
కాజల్ కు ఓట్లు తక్కువ

కాజల్ కు ఓట్లు తక్కువ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అయితే పదో వారం నామినేషన్స్ లో అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ముందు నుంచి ఉత్కంఠ నెలకొంది. అయితే ఎక్కువ మంది కాజల్ ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరిగింది. ఆమెకు చాలా ఓట్లు తక్కువ పడినట్టు తెలియడంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది.

ఐదుగురు సేఫ్

ఐదుగురు సేఫ్

ఎలిమినేషన్స్ లో ఐదుగురు ఉండగా చివరికి మానస్-కాజల్ మాత్రం మిగిలారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని హౌస్ మేట్స్ అందరూ భావించాయి. అయితే నాగార్జున ట్విస్ట్ ఇస్తూ.. ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని చెప్పారు. ఎందుకు అన్నదానిపై వెంటనే క్లారిటీ ఇస్తూ జెస్సీ ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చాడని అన్నారు. అయితే దురదష్టవశాత్తూ నామినేష‌న్‌లో లేక‌పోయినా అనారోగ్యం వెంటాడ‌టంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే త‌న‌ను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోన‌ని జెస్సీ భవించగా అది నిజం కాలేదు.

సలహాలు సూచనలు

సలహాలు సూచనలు

తాజా ఎపిసోడ్ లో బిగ్‌బాస్ హౌస్‌లో నీ జ‌ర్నీ పూర్తైంద‌ని పంపించివేశారు. వెళ్లిపోయే ముందు మాజీ హౌస్ మీట్స్ లానే జెస్సీ కంటెస్టెంట్ల‌కు విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్క‌రితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడే అవ‌కాశం క‌ల్పించదంతో అలాగే మాట్లాడాడు. ముందుగా జెస్సీ.. స‌న్నీతో మాట్లాడుతూ.. 'జాగ్ర‌త్త‌గా ఉండు, టెంప‌ర్ లూజ్ అవ‌కు. సొంతగా గేమ్ ఆడితే హీరో అవుతావు, లేదంటే క‌మెడియ‌న్ అవుతావు' అని పేర్కొన్నారు.

త‌ర్వాత మాన‌స్‌తో మాట్లాడుతూ.. 'నువ్వు సైలెంట్ కిల్ల‌ర్‌. ర‌వి లాంటి వాళ్లకు బాబువి నువ్వు, ఒప్పుకోవు కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అంద‌రినీ నెగెటివ్‌గా చూడ‌కు' అని సూచించాడు.

నీ గేమ్ ఏమైంది?

నీ గేమ్ ఏమైంది?

ఇక కాజ‌ల్‌తో మాట్లాడుతూ 'నీ గేమ్ ఏమైంది? నీ స్ట్రాటజీ ఏది? నువ్వు ప‌క్క‌వాళ్ల‌ను హైలైట్ చేయ‌డానికి షోకి రాలేదు. నీ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇస్తున్నార‌నుకుంటున్నావు, కానీ ఇవ్వ‌ట్లేదు. నిన్ను వాడుకుంటున్నారు అని తెలుసుకో' అని కీలక సూచనలు చేశారు. అనీ మాస్ట‌ర్‌ గేమ్ కు ఎలాంటి వంకలు పెట్టని జెస్సీ ప్రియాంక ను త్యాగాలు ఆపేయ‌మ‌ని అన్నాడు. నీ గేమ్ ఇదేనా? అని ప్రశ్నించి. 'త‌ర్వాత సీజ‌న్‌లో వ‌చ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది? అని చుల‌క‌న‌ చేయొద్దు' అని కూడా చెప్పుకొచ్చారు.

 శ్రీ రామ్ కి

శ్రీ రామ్ కి

ఇక దేనిలో ఇన్వాల్వ్ అవ‌ని శ్రీరామ్ ఖచ్ఛితంగా టాప్ 5లో ఉంటాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ర‌వితో ఫోన్‌లో ముచ్చ‌టిస్తూ.. ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది టాప్ 5 లో ఉంటావు కాబట్టి ఫైన‌ల్‌లో క‌లుస్తాన‌ని చెప్పాడు. ఇక సిరితో మాట్లాడుతూ నీ ఫైటింగ్ బాగుంద‌ని, కానీ నీ గేమ్ నువ్వు ఆడ‌మ‌ని హెచ్చ‌రించాడు. త‌ర్వాత‌ కిస్సులు లేవా? అని అడ‌డ‌గ‌డంతో గాల్లోనే ముద్దులు విసిరింది సిరి. చివ‌ర్లో వ‌చ్చేవారమే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌కు, ఫైన‌ల్‌ దాకా అక్క‌డే ఉండ‌మ‌ని కూడా చెప్పాడు.

 ఎమోషనల్

ఎమోషనల్

చివరిగా ష‌ణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయిపోయాడు 'హౌస్‌లో ఉన్న చివ‌రి రోజుల్లో నీతో ఉండ‌లేక‌పోయాన‌న్న‌దే తన బాధ అన్నాడు జెస్పీ, తాను ఎప్ప‌టికీ సీక్రెట్ ఫ్రెండ్‌నే' అని అంటే. ష‌ణ్ను మాట్లాడుతూ.. 'నువ్వు ఫ‌స్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావ‌నుకున్నారు, కానీ ప‌దో వారంలో ఒక‌రికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్‌.. అదిరా నా జెస్సీ' అని పొగిడాడు. అలా ఫోన్ సంభాష‌ణ‌ల్లో సిరి, ష‌ణ్ను, శ్రీరామ్‌, ర‌వి టాప్ 5లో ఉంటార‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. అయితే మానస్, సన్నీ విషయంలో మాత్రం క్లారిటీ లేదు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X