Bigg Boss Telugu 5: గే లవ్ ట్రాక్ ఎలా ప్లాన్ చేస్తారు.. నా లైఫ్ ఏం కావాలి: రవికి ఊహించని షాక్ ఇచ్చిన జెస్సి

బిగ్ బాస్ సీజన్ 5 వారానికి ఎంటర్ అయింది. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. అయితే ప్రతివారం లాగే ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు ఎవరు ఫైనల్ నామినేషన్స్ లో నిలుస్తారు అనే విషయం మీద ముందు నుంచే ఆసక్తి మొదలైంది.. అయితే ఈ సారి ఎక్కువగా షణ్ముఖ్ టార్గెట్ కావడం మరింత ఆసక్తికరంగా మారింది.. నిన్న హౌస్ లో ఏం జరిగింది ? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? గే లవ్ స్టోరీ అంటూ రవి మీద జెస్సీ ఎందుకు ఫైర్ అయ్యాడు అనే వివరాల్లోకి వెళితే

హమీదా vs ప్రియాంక

హమీదా vs ప్రియాంక

ఎపిసోడ్ మొదట్లోనే హమీద అలాగే ప్రియాంక ఇద్దరూ గొడవ పడడం చూపించారు.. కిచెన్ లో వంట చేస్తున్న ప్రియాంక దగ్గరకు వెళ్ళిన రేషన్ మేనేజర్ హమీద ప్రియాంక మటన్ పీస్ లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి అంటుంది. అలా ఎలా లెక్క పెడతారు? అందరికీ వచ్చేలాగా నేను వడ్డిస్తానులే అని ప్రియాంక సర్ది చెప్పబోతోంది అయినా సరే లెక్క పెట్టాల్సిందే అని హమీద బలవంతం చేస్తుంది. వెంటనే ప్రియాంకకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళి పోతూ మటన్ కొట్టోడు ఏమైనా నా మొగుడా ? నన్ను మటన్ ముక్కలు లెక్క పెట్ట మంటుంది పదేళ్లుగా వంట చేస్తున్న నాకు తెలియదా ? ఏం చేయాలో పక్కనే ఉంటూ టీచ్ చేస్తున్నారు ఇంతకాలం నేను అని పెడితేనే కదా తిన్నది అంటూ కాజల్ కి ఆమె తన బాధ చెప్పుకుని బాధ పడింది.

బిగ్ బాస్ మాత్రం టీవీలో

బిగ్ బాస్ మాత్రం టీవీలో

ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైన తరువాత ఈసారి బహిరంగంగా నామినేషన్ ప్రక్రియ మాత్రం లేదు. ఒక్కొక్కరుగా కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ ఎవరిని నామినేట్ చేయాలని అనుకుంటున్నారో ఆ కారణాలు చెప్పి ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు కూడా చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. అలా ఈ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది.. అయితే లోపలికి పిలిచి అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాలు బయటకు చూపించరు అనుకున్నారో ఏమో తెలియదు కానీ చివరికి బిగ్ బాస్ మాత్రం టీవీలో వేసి చూపించడంతో హౌస్ మేట్స్ అందరూ షాకయ్యారు. మొత్తం మీద ఈ వారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరు అంటే లోబో, జెస్సీ, షణ్ముఖ్, ప్రియ, సన్నీ, రవి, మానస్, విశ్వ, హమీద.

'గే లవ్ స్టోరీ ఎలా ప్లాన్ చేస్తారు'?

'గే లవ్ స్టోరీ ఎలా ప్లాన్ చేస్తారు'?

అయితే రవి జెస్సీ మధ్య డిస్కషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెస్సీని నామినేట్ చేసిన తరువాత అతని దగ్గర రవి డిస్కషన్ పెట్టాడు. 'గే లవ్ స్టోరీ ఎలా ప్లాన్ చేస్తారని..' జెస్సీ ప్రశ్నించగా ముందు రవి కవర్ చేసే ప్రయత్నం చేశాడు ఆ తరువాత కూడా వినకపోవడంతో నిన్ను గ్రాంటెడ్ గా తీసుకొని ఉంటాం మమ్మల్ని క్షమించు అని రవి, లోబోలు ఇద్దరూ చెప్పారు. నిజానికి అంతకు ముందే బిగ్ బాస్ హౌస్‌లో ఒక బ్యాచ్‌ లా మారిన సిరి, షణ్ముఖ్, జెస్సీలు యాంకర్ రవి గురించి ఎక్కువగా చర్చించుకోవడమే కనిపించింది.

రవి వాష్ రూమ్ అంటూ

రవి వాష్ రూమ్ అంటూ

లోబోని ప్రియ మీద అంతలా అరిచేలా చేసింది యాంకర్ రవినే అని, నేను చెప్పినట్టు చేస్తే నువ్ గేమ్‌లో ముందుకు వెళ్తావ్ అని హమీదాతో కూడా రవి అన్నాడట అంటూ ఆసక్తికరంగా కోడ్ లాంగ్వేజ్‌లో సిరి, షణ్ముఖ్‌లకు చెప్పాడు జెస్సీ. ఆ కోడ్ నేమ్ ఏంటంటే వాష్ రూమ్. అంటే యాంకర్ రవిని రవి అని కాకుండా వాష్ రూమ్ అని పేరు పెట్టేశారు ఈ ముగ్గురూ.. లహరిని వాష్‌ రూంలో హగ్ చేసుకోవడం పెద్ద వివాదం కాగా.. ఇప్పుడు ఆ వాష్ రూమ్ పేరునే రవికి పెట్టేసిన ఈ ముగ్గురూ అతనిని టార్గెట్ చేసి మాట్లాడుకోవడం కనిపించింది.

Recommended Video

Sudigali Sudheer,Getup Srinu Hilarious Fun At Most Eligible Bachelor Wrop Up Party | Oneindia Telugu
రవి గురించి దారుణంగా

రవి గురించి దారుణంగా


ఇక ఆ తర్వాత కూడా జెస్సీ.. యాంకర్ రవి గురించి దారుణంగా మాట్లాడాడు.. 'గేమ్ గెలవాలి అనుకోవాలి కానీ ఒకరిని కించపరిచేలా ఉండకూడదు. ఎత్తుకు పై ఎత్తు వేసి గేమ్ గెలవాలనుకోవడంలో తప్పులేదు కానీ.. ఒకరిని తొక్కేద్దాం.. నాశనం చేద్దాం.. కెరీర్ నాశనం చేద్దాం అని అనుకుంటే అంతకంటే లేకి గాళ్లు ఎవరూ ఉండరు. ఇలాంటోడు గేమ్‌ లోనే ఇలా ఆలోచిస్తున్నాడంటే.. రియల్ లైఫ్‌ లో ఇంకా ఎంతలా ఉంటాడో ఆలోచించు.. నాకు స్టార్టింగ్‌లో గేమ్ ఎలా ఆడాలో నేను చెప్తా.. నీకెవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారని అన్నాడు.. దానికి నేను నాకు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు.. నా గేమ్ నాకు తెలుసు.. వేషాలు వేయాల్సిన అవసరం లేదని చెప్పా.. అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు అంటూ జెస్సీ బయట పెట్టడం సంచలనంగా మారింది. ఇక కెప్టెన్ గా ఉన్న శ్రీరామ్‌తో జెస్సీ విషయంలో షణ్ముఖ్ గొడ పడుతూ కనిపించాడు. విషయం తెలియకుండా మధ్యలో దూరిపోయి.. అడ్డంగా వాదిస్తూ.. నా రూల్ బుక్ ప్రకారం ఫ్రెండ్ కోసం గొడవ పడాలంటే విషయం తెలియాల్సిన అవసరం లేదంటూ అడ్డదిడ్డంగా వాదిస్తూ గొడవ పడడం చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X