Bigg Boss: మళ్లీ కలిసి రచ్చ చేసిన సిరి, షణ్ముఖ్.. ఏకంగా లైవ్‌లోనే ఐలవ్యూ అంటూ.. లీక్ చేసిన జెస్సీ

ఎన్నో ఏళ్లుగా ఒకే ధోరణిలో సాగిపోతోన్న తెలుగు బుల్లితెరను ఒక్కసారిగా హైలైట్ చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంచిన ఏకైక షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో దాదాపు పద్నాలుగేళ్ల నుంచి హిందీలో ప్రసారం అవుతోంది. అలాగే, దేశంలోని మిగిలిన భాషల్లోనూ ఇది ప్రారంభం అయింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ షో.. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అతడి ఓటమిని పక్కన పెడితే హౌస్‌లో సిరితో కలిసి చేసిన రచ్చ బాగా హైలైట్ అయింది. వీళ్లపై అంతలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీళ్లిద్దరూ రచ్చ చేశారు. ఆ సంగతులు మీకోసం!

ఫ్రెండ్స్‌లా వచ్చి.. అలా మారారు

ఫ్రెండ్స్‌లా వచ్చి.. అలా మారారు

ఇటీవలే ముగిసిన ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన వీళ్లిద్దరికీ బయట భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. దీంతో ఆడవాళ్ల నుంచి సిరి, మగవాళ్ల నుంచి షణ్ముఖ్ ఎక్కువ ఫోకస్ అయ్యారు.

అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచే మంచి ఆటతీరులో సత్తా చాటారు. అందుకే సిరి మొదటి వారం కెప్టెన్ అవ్వగా.. షణ్ముఖ్ జస్వంత్ ఏకంగా రెండు సార్లు నాయకుడిగా ఎంపికయ్యాడు. ఫ్రెండ్స్‌గా వచ్చిన వీళ్లిద్దరూ క్రమంగా మరింతగా క్లోజ్ అయ్యారు.

ముద్దులు.. హగ్గులతో రచ్చ చేస్తూ

ముద్దులు.. హగ్గులతో రచ్చ చేస్తూ

బిగ్ బాస్‌ ఐదో సీజన్‌లోకి రావడానికి ముందే స్నేహితులు కావడంతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, మొదటి నుంచే ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. దీంతో వీళ్లిద్దరూ కలిసే ఆడుతున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీనికితోడు తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. దీంతో నిత్యం హాట్ టాపిక్ అయ్యారు. ఇక, వీళ్లతో పాటు జస్వంత్ పడాల కూడా జాయిన్ అవడంతో ముగ్గురూ రచ్చ చేశారు.

వాళ్లిద్దరూ ఫినేలేకు... జెస్సీ ఔట్

వాళ్లిద్దరూ ఫినేలేకు... జెస్సీ ఔట్

వ్యవహార శైలి విషయంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ.. షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఇద్దరూ ఆరంభం నుంచీ తమ తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఎవరికి వారే చక్కగా ఆడుకుంటూ ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. దీంతో పలుమార్లు ఉత్తమ ఆటగాళ్లుగా కూడా ఎంపిక అయ్యారు.

అంతేకాదు, అలా ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను సైతం తప్పించుకున్నారు. ఇలా ఆరంభం నుంచీ ఆకట్టుకుంటూ సిరి, షన్నూ ఇద్దరూ టాప్ 5లో నిలిచారు. అయితే, వీళ్ల స్నేహితుడు జస్వంత్ పడాల మాత్రం అనారోగ్య కారణాలతో మధ్యలోనే బయటకు వచ్చేశాడు.

ఫినాలేలో ఓటమి... సిరి కారణం

ఫినాలేలో ఓటమి... సిరి కారణం

గత ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో వీజే సన్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో టాప్ 5లో నిలిచిన ఏకైక లేడీ సిరి హన్మంత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుని ముందుగా ఎలిమినేట్ అయిపోయింది. ఇక, టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి టాప్ 2 వరకూ వెళ్లిన షణ్ముఖ్ జస్వంత్ మాత్రం రన్నరప్‌గానే మిగిలిపోయాడు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఫినాలే తర్వాత జరిగిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తన ఓటమికి సిరితో క్లోజ్‌గా ఉండడం కూడా ఒక కారణం అని షన్నూ చెప్పాడు.

బిగ్ బాస్ తర్వాత వీళ్లిద్దరి చర్చ

బిగ్ బాస్ తర్వాత వీళ్లిద్దరి చర్చ

బిగ్ బాస్ ఐదో సీజన్‌ గత ఆదివారంతోనే ముగిసింది. అయినప్పటికీ దాని తాలూకు విషయాలు, విశేషాలు మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. అలా అప్పటి నుంచి హైలైట్ అవుతోన్న విషయాల్లో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ ట్రాక్ ఒకటి. హౌస్‌లో వీళ్లిద్దరూ కలిసి చేసిన రొమాన్స్ వల్ల ఎన్నో అనర్థాలు జరిగాయంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో హౌస్‌ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు కూడా వీళ్లిద్దరి గురించి చాలా విషయాలు లీక్ చేస్తున్నారు. దీంతో సిరి, షణ్ముఖ్ గురించే ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.

మళ్లీ కలిసి సిరి, షణ్ముఖ్ రచ్చ

మళ్లీ కలిసి సిరి, షణ్ముఖ్ రచ్చ

బిగ్ బాస్‌ షోలో వ్యవహరించిన తీరుతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ మరో ఇద్దరితో ప్రేమలో ఉండడమే. ఈ ట్రోల్స్ వల్ల వాళ్ల బంధం బిగ్ బాస్ వరకూ ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సిరి, షన్నూ ఇద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్లి రచ్చ చేశారు. ఈ విషయాన్ని జెస్సీ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. 'అరే నన్ను చాలా మంది దొబ్బుతున్నారురా. దగ్గరకు రండి. వచ్చేశామ్ వచ్చేశామ్ త్రిమూర్తులం వచ్చేశాం' అని జెస్సీ మాట్లాడుతున్న ఓ వీడియోను వదిలాడు.

లైవ్‌లోనే ప్రపోజ్ చేసిన జెస్సీ

లైవ్‌లోనే ప్రపోజ్ చేసిన జెస్సీ

వీళ్లు ముగ్గురు కారులో కలిసి వెళ్తుండగా జెస్సీ వీడియో తీశాడు. అందులో షణ్ముఖ్ 'అరేయ్ నిన్ను ఎవరు అడిగారురా' అంటూ అసహనంగా కనిపించాడు. అనంతరం ఈ త్రిమూర్తులు ఓ రెస్టారెంట్‌లో ప్రత్యక్షం అయ్యారు. అక్కడు సిరి ఫుల్లుగా తింటున్న వీడియోను కూడా జెస్సీ షేర్ చేశాడు. 'చూడండి.. ఇది ఎలా తింటుందో.. పక్కనే వాడు కూడా ఉన్నాడు' అని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో సిరిని చూపిస్తూ ఆమెకు జెస్సీ ఐలవ్యూ అని చెప్పేశాడు. అంతలోనే ఈ వీడియో కట్ అయింది. మొత్తానికి అన్ని విమర్శలు వచ్చినా వీళ్లు తగ్గడమే లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X