Bigg boss 5: జెస్సితో మల్ల యుద్ధానికి సిద్దమైన ఆనీ మాస్టర్.. అబ్బాయితో ఒకే నా అంటూ శ్రీరామచంద్ర సలహా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. గత రెండు వారాలుగా ఈ రియాలిటీ షో చాలా నీరసంగా కొనసాగుతోంది అని నెగటివ్ కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. బిగ్ బాస్ రెగ్యులర్ టాస్క్ లలో అంత కొత్తగా ఏమి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదనీ కూడా అంటున్నారు. గత నాలుగు వారాలు ఒకే తరహాలో నామినేషన్ ప్రక్రియను కొనసాగించిన బిగ్ బాస్ ఐదవ వారంలో మాత్రం ప్రత్యేకంగా రూమ్ కి పిలుచుకొని మరి నామినేట్ చేయమని చెప్పారు. ఆ దెబ్బతో ఒకేసారి తొమ్మిది మంది నామినేషన్ లోకి వచ్చేశారు. ఇక కెప్టెన్సీ టాస్క్ ఈ వారం చాలా కీలకం కానుందని తెలుస్తోంది. ముందుగా సన్నీ రవి ఇద్దరు టాస్క్ లో రాజులుగా పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఈ సారి బిగ్ బాస్ బురదలో ఒక మల్ల యుద్ధం స్టైల్ లో పోటీ కూడా పెట్టాడు. ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమోని కూడా విడుదల చేశారు.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

సరికొత్త కెప్టెన్సీ టాస్క్

సరికొత్త కెప్టెన్సీ టాస్క్

బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది స్నేహితులుగా ఉన్నప్పటికీ కూడా టాస్కుల్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ శత్రువులుగా మారిపోతుంటారు. అక్కడ ఎవరి మనోభావాలను కూడా లెక్కచేయరు. ఫైనల్ గా ఆటలో ఎంత బలంగా కొనసాగారు ఆన్స్ విషయాన్ని మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సన్నీ, రవి ఇద్దరు కూడా రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో భాగంగా చాలా గంభీరంగా పోటీకి దిగాల్సి వచ్చింది. అతనికి మద్దతు ఇచ్చిన వాళ్లు కూడా టాస్క్ లో భాగంగా పోటీలో కి ధైర్యం చేసి దూకుతున్నారు.

ఆనీ మాస్టర్ vs జెస్సి

ఆనీ మాస్టర్ vs జెస్సి

అయితే బిగ్ బాస్ టాస్క్ లో మల్లయుద్ధంను కూడా జోడించడం విశేషం. ఇప్పటికే విశ్వ మానస్ హోరాహోరీగా పోటీపడ్డారు. అయితే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో మల్ల యుద్ధం లో పోటీ పడితే ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. హౌస్ లో మొట్టమొదట గొడవ పెట్టుకున్నటువంటి జెస్సి, అనీ మాస్టర్ ఇద్దరు కూడా బురదలోకి దిగి మల్ల యుద్ధానికి కాలు దువ్వడం విశేషం.

 అబ్బాయితో పోటీకి సిద్ధమేనా?

అబ్బాయితో పోటీకి సిద్ధమేనా?

మల్ల యుద్ధం లో మొదటిసారి ఆనీ మాస్టర్ తలపడాల్సి వస్తోంది. ఇక ఆమెకు ఆపోజిట్ గా యువకుడు జెస్సి పోటీ పడుతుండటం విశేషం. అయితే పోటీలోకి వెళ్ళే ముందే సింగర్ శ్రీరామచంద్ర ఆనీ మాస్టర్ ను ఒకసారి హెచ్చరిస్తాడు. అబ్బాయితో నువ్వు కంఫర్టబులా అని పదేపదే అడిగాడు. అందుకుగాను ఆనీ కొంత ఆలోచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంఫర్టబుల్ గా లేకపోతే నేను నిన్ను ఆడనివ్వననీ కూడా సమాధానం చెబుతాడు. కానీ అందుకు అనీ మాస్టర్ వెనుకడుగు వేయలేదు.

 ప్రతిసారి మేమే కాంప్రమైజ్ అవుతున్నాము

ప్రతిసారి మేమే కాంప్రమైజ్ అవుతున్నాము

ఇక మరో రాజు గా ఉన్నటువంటి సన్నీ ఇక్కడ ఏం స్ట్రాటజీ అయింది అని రవి రాజ్యానికి వచ్చి అడిగే ప్రయత్నం చేస్తాడు. అది నేను ఏమాత్రం ఒప్పుకోను. కావాలంటే నేను పోటీపడి ఫైట్ చేస్తాను అని సమాధానం ఇస్తాడు. వీలైనంత వరకు ఆనీ మాస్టర్ తో పోటీ పడాలని అనుకుంటున్న సమయంలో మనస్ వచ్చి ప్రతిసారి మాకు ఇదే కారణాలు చెబుతున్నారు అని ఆవేదన చెందుతాడు. ప్రతిసారి మేమే కాంప్రమైజ్ అవుతున్నాము అంటూ గట్టిగా అరుస్తూ చెబుతాడు.

Recommended Video

Raviteja Released Venuvu lo Song From Natyam Movie
మొదలైన మల్ల యుద్ధం

మొదలైన మల్ల యుద్ధం

ఇక మానస్ అలా చెబుతున్న సమయంలో ఆనీ మాస్టార్ మల్ల యుద్ధానికి సిద్ధం అవుతోంది. గాయ్స్ నో కాంప్రమైజ్.. రండి అంటూ పోటీకి సిద్ధం అవుతుంది. ఇక ఆనీ మాస్టర్ జెస్సి ఇద్దరు కూడా బురదలో తిరిగి మల్లయుద్ధాలు చేయడానికి సిద్ధమవుతారు. ఒకవైపు మానస్ జేస్సిని సపోర్ట్ చేస్తూ ఉండగా యాంకర్ రవి ఆనీ మాస్టర్ కు మద్దతు ఇస్తాడు. ఈ సెన్సిటివ్ ఫైట్ ఎలా జరుగుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఈ రోజుటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X