Bigg Boss 5 Telugu: 10 వారాలకు జెస్సి పారితోషికం ఎంతో తెలుసా?
బిగ్ బాస్ హౌస్ లో జస్వంత్ పడల జెస్సి మొదటి నుంచి కూడా ఒక చిన్న పిల్లాడి తరహాలో కొనసాగుతూ వచ్చాడు. అతను ఎంట్రీ ఇచ్చినప్పుడు జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే జెస్సీ ఫ్యాషన్ వరల్డ్ లో తప్పితే బయట జనాలకు పెద్దగా తెలియదు. అయితే అతను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం కొన్ని రోజులకే ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో కనిపించాడు అని కంటెస్టెంట్స్ అందరూ కూడా కామెంట్ చేశారు. నెటిజన్లు కూడా అదే తరహాలో స్పందించారు. మొత్తానికి పది వారాల పాటు కొనసాగిన జెస్సి ఎవరు ఊహించని విధంగా అనారోగ్య కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక అతను 10 వారాలకు గానీ బిగ్ బాస్ ద్వారా సంపాదించినది ఎంత అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

పారితోషికంతో సంతోషంగానే..
బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా లాభాన్ని అనుకుంటూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు ఎంతవరకు వస్తాయో తెలియదు గానీ ఒక విధంగా రెమ్యునరేషన్ అయితే గట్టిగానే ఇస్తారని ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ ఉంది. ఇంతవరకు ఎవరు కూడా వారికి దక్కిన ఆదాయం గురించి బయటకు చెప్పలేదు. కానీ అందరూ కూడా ఆ పారితోషికంతో సంతోషంగానే ఉన్నట్లు బయటకు ఓపెన్ గానే చెప్పారు.

జెస్సి.. రొమాన్స్
బిగ్ బాస్ 10 వారాల పాటు ఓ వర్గం జనాలను బాగానే ఆకట్టుకుంది. మధ్యమధ్యలో రేటింగ్ కాస్త తగ్గుతూ వచ్చినప్పటికీ కూడా టాస్క్ లతో బిగ్బాస్ డోస్ పెంచాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రొమాంటిక్ ట్రాక్స్ కూడా బాగానే కొనసాగాయి. అయితే చిన్న పిల్లాడి మనస్తత్వం తో కనిపించిన జెస్సీ కూడా అప్పుడప్పుడు తనలోనే రొమాంటిక్ ఆవేశాన్ని బయటపెట్టాడు. మొదట శ్వేత తో ప్రయాణం చేసిన చేసి ఆ తర్వాత సిరి, ప్రియాంకను కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశాడు.

ఒంటరి ఫైట్
షణ్ముఖ్ జస్వంత్ సిరి జెస్సీ ముగ్గురు కూడా హౌస్ లో త్రిమూర్తులుగా కనిపించేవారు. ఎన్ని గొడవలు జరిగినా కూడా ముగ్గురు కూడా కలిసి కట్టుగా ఉండేవారు. అయితే జెస్సి వెళ్ళి పోతాడు అని ఎవరూ ఊహించలేదు. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అయినప్పటికీ కూడా ఫిజికల్ టాస్క్ లలో అయితే చాలా బలంగా పోరాడేవాడు. ఎంతమంది పోటీకి వచ్చిన కూడా ఒంటరిగా ఫైట్ చేసేవాడు.

బిగ్ బాస్ నుంచి మంచి అమౌంట్
అయితే జెస్సి కొన్నిసార్లు మాట్లాడే విధానంలో పొరపాట్లు చేసేవాడని కూడా ఇతర కంటెస్టెంట్స్ ఆరోపణలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని తిట్టినా కూడా మాత్రం తనదైన శైలిలో ముందుకు సాగుతూ వచ్చాడు. ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో ఎంత పారితోషికం తీసికున్నాడు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జెస్సి భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి కూడా అతనికి సంతృప్తి కలిగించే అమౌంట్ దక్కినట్లు తెలుస్తోంది.
Recommended Video

మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాడట. ఒప్పందం ప్రకారం వారానికి 1.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న అతను మొత్తంగా 10 వారాలకు గాను 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలైతే మొదటి రెండు మూడు వారాల్లోనే బయటకు వెళ్ళిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఫిజికల్ టాస్క్ లో తన బలాన్ని చూపిస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. మరి కొన్ని రోజుల పాటు జెస్సి ఉంటాడు అని అందరు అనుకున్నారు కానీ అనారోగ్య కారణాల వలన బయటకు వెళ్లిపోక తప్పలేదు.


Click it and Unblock the Notifications











