Bigg Boss 5: ముద్దుల వర్షం కురిపించిన కాజల్.. హౌస్ లో అతనే ఆఖరి కెప్టెన్
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఈసారి షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో అయితే ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు అని చెప్పాలి. కాస్త గుర్తింపు ఉన్న సెలబ్రిటీలకు తెస్తారు అని అనుకుంటే నిర్వాహకులు ఈ సారి కూడా కాస్త నిరాశ పరచని అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి బిగ్ బాస్ నిర్వాహకులు మంచి టాస్క్ లతో అయితే షోను విజయవంతంగా ముందుకు కొనసాగించారు. ఇక 12వ వారానికి చేరుకున్న బిగ్ బాస్ తుది దశలో ఇంకా ఏ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎమోషనల్ కంటెంట్ తో కూడా ఎక్కువగా ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఎమోషన్స్
బుధవారం రోజు ప్రసారమైన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా కెప్టెన్ గా నిలవడం కోసం తీవ్ర స్థాయిలో శ్రమించారు. ఇక ప్రతిసారి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులను పిలిపించి మంచి ఆనందాన్ని అందిస్తూ ఉంటారు. ఇక ఈ సారి కూడా పలువురు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ లోకి రాబోతున్నారు. అందరికంటే ముందుగా కాజల్ భర్తతో పాటు కూతురు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కాజల్ కూతురు ఎమోషనల్ ఎంట్రీ
కుటుంబ సభ్యులను కలిసే ముందే బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ తో పరీక్ష పెడుతూ ఉంటాడు. రైలుబండి తరహాలో అందరూ ముందుకు సాగుతూ ఉండగా సడన్ గా ఆగిపోవాలి అని చెప్పడంతో.. అప్పుడే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇక కాజల్ భర్త తో పాటు తన కూతురు కూడా హౌస్ లోకి సంతోషంగా ఎంట్రీ ఇచ్చారు. కాజల్ ని చూడగానే కూతురు ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యింది.

భర్తపై ముద్దుల వర్షం
ఇక కాజల్ అయితే తన భర్త పై ముద్దుల వర్షాన్ని కురిపించింది. కూతురు కూడా తన తల్లి ని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది. అయితే కాజల్ కూతురితో మిగతా కంటెస్టెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీ గా మాట్లాడారు. ఇటీవల శ్రీరామ్ కాజల్ తో ఎక్కువ గొడవలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మీ మమ్మీ ని నామినేట్ చేస్తున్నప్పుడు నీకు ఏమైనా కోపం వస్తుంది అని కాజల్ కూతుర్ని అడిగినప్పుడు తను ఎందుకు రాదు అనే విధంగా వివరణ ఇచ్చింది.
Recommended Video

ఆఖరి కెప్టెన్
ఇక ఈసారి బిగ్బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకున్న సమయంలో ఆఖరి కెప్టెన్ గా షణ్ముఖ్ జస్వంత్ ఎన్నిక కావడం విశేషం. చివరగా షణ్ముఖ్ జస్వంత్ రవి పోటీగా ఉన్న తరుణంలో ఎక్కువమంది షన్నుకు మద్దతు ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి క్యాప్టెన్ గా షన్ను నిలిచాడు. అయితే చివరి క్షణం వరకు కూడా ప్రియాంక కెప్టెన్ గా నిలవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ షన్ను కూడా ఆమెకు మద్దతు ఇవ్వలేకపోయాడు. దీంతో ప్రియాంక ఎమోషనల్ అవుతూ బాత్రూం లోకి వెళ్లి కంటతడి పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











