Bigg Boss: హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీలు.. షణ్ముఖ్‌లో టెన్షన్ మొదలు.. ఎవరి కోసం ఎవరు వచ్చారంటే!

తెలుగులోకి ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలు వచ్చాయి. అయితే, వాటిలో అన్నింటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కడం లేదు. కేవలం కొన్ని షోలు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అందులో భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది మాత్రం బిగ్ బాసే. రియాలిటీ అధారంగా నడిచే ఈ షో ప్రస్తుతం ఐదో సీజన్‌ను ప్రసారం చేస్తోంది. ఇందులో ఎన్నో చిత్ర విచిత్రమైన టాస్కులతో పాటు జనాలు మెచ్చే కంటెంట్‌ను చూపిస్తున్నారు. దీంతో ఇది కూడా సూపర్ హిట్ దిశగా సాగుతోంది. ఇక, ఇప్పుడు హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఎవరి కోసం ఎవరు వస్తున్నారో చూద్దాం పదండి!

ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం తగ్గకుండా

ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం తగ్గకుండా

తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమ కహానీలు, రొమాంటిక్ సన్నివేశాలను నిర్వహకులు హైలైట్ చేసి చూపిస్తున్నారు. తద్వారా రేటింగ్‌ను సైతం అందుకుంటున్నారు.

బీబీ ఎక్స్‌ప్రెస్ అంటూ సరికొత్త టాస్కుతో

బీబీ ఎక్స్‌ప్రెస్ అంటూ సరికొత్త టాస్కుతో

ప్రతి వారం లగ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్కులు ఇస్తుంటాడు. ఇందులో భాగంగానే ఈ వారానికి సంబంధించి ఇంటి సభ్యులకు 'బీబీ ఎక్స్‌ప్రెస్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాల్సి ఉంటుంది.

ఆడుకున్న బిగ్ బాస్.. అదిరిపోయే టాస్క్

ఆడుకున్న బిగ్ బాస్.. అదిరిపోయే టాస్క్

'బీబీ ఎక్స్‌ప్రెస్'లో భాగంగా కంటెస్టెంట్లు అందరూ బిగ్ బాస్ ఏం చెబితే అది చేయాల్సి ఉంటుంది. గతంలో ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్ వంటి టాస్కుల మాదిరిగానే ఇది కూడా సాగబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఓ ఆట ఆడుకున్నట్లు చూపించారు. అన్ని టాస్కుల్లా ఇది ఇంటి సభ్యుల మధ్య గొడవలతో సాగకుండా.. ఎంతో సరదాగా కనిపించింది.

బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీలు

బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీలు

ప్రతి సీజన్‌లోనూ చివర్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరగబోతుందని తెలుస్తోంది. తాజాగా వచ్చిన మరో ప్రోమోలో కంటెస్టెంట్ల ఫ్యామిలీలు హౌస్‌లోకి వచ్చినట్లు చూపించారు.

 కాజల్ కోసం వాళ్లిద్దరూ... కోపం వచ్చింది

కాజల్ కోసం వాళ్లిద్దరూ... కోపం వచ్చింది

'బీబీ ఎక్స్‌ప్రెస్' టాస్క్ జరుగుతోన్న సమయంలో ఆర్జే కాజల్ కోసం ఆమె భర్త, కూతురు ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె ఫ్రీజ్ అయి ఉంది. దీంతో ఆమె కూతురు ఏడుస్తూ దగ్గరకు వచ్చింది. ఇది ఎంతో ఎమోషనల్‌గా సాగింది. ఇక, ఆ తర్వాత 'మీ అమ్మను నామినేట్ చేస్తే కోపం వస్తుందా' అంటూ శ్రీరామ్ ఆ చిన్నారిని అడగ్గా.. వెంటనే అవును అంటూ తలూపేసింది.

శ్రీరామ్ కోసం వచ్చింది ఎవరో తెలుసా?

శ్రీరామ్ కోసం వచ్చింది ఎవరో తెలుసా?

తాజాగా వచ్చిన ప్రోమోలో సింగర్ శ్రీరామ చంద్ర కోసం కూడా ఒకరు వచ్చినట్లు చూపించారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. అతడి కోసం వచ్చింది సోదరి అట. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో గేట్ దగ్గరే ఆమెను హత్తుకున్న అతడు.. ముద్దులు పెట్టేశాడు. తద్వారా ఎన్నో రోజులుగా దాచుకున్న ప్రేమను చూపించాడు. దీంతో వాళ్ల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

Recommended Video

#Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Filmibeat Telugu
షణ్ముఖ్‌లో టెన్షన్.. అతడి కోసం ఎవరు?

షణ్ముఖ్‌లో టెన్షన్.. అతడి కోసం ఎవరు?

బిగ్ బాస్ హౌస్‌లోకి కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుండడంతో కెమెరా ముందుకు వచ్చిన షణ్ముఖ్ 'బిగ్ బాస్ సార్.. ఎవరిని పంపిస్తున్నారో చెబితే బాగుంటుంది. నా బుర్ర హీటెక్కిపోతుంది' అని టెన్షన్ పడిపోయాడు. ఆ వెంటనే అతడి కోసం ఎవరో గేట్ దగ్గర కనిపించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. షణ్ముఖ్ జస్వంత్ కోసం హౌస్‌లోకి వచ్చింది అతడి తల్లేనట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X