Bigg Boss: ఆ కంటెస్టెంట్‌కు ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్.. స్పెషల్ వీడియోతో కృష్ణంరాజు భార్య సర్‌ప్రైజ్
ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. అయితే, అందులో కొన్నింటిని మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో ఒకటి. కొత్త కాన్సెప్టుతో నడిచేదే అయినా తెలుగు ప్రేక్షకులు దీనికి భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఐదోది కూడా ముగించేందుకు రెడీగా ఉంది. తాజా సీజన్ ఫినాలే వీక్ నడుస్తోంది.
Recommended Video
దీంతో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల కోసం అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా కదిలి వస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్‌లో ఉన్న ఓ కంటెస్టెంట్‌కు ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంగతులు మీకోసం!

టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య టైటిల్ ఫైట్
ఎన్నో అంచనాల నడుమ మొదలైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు టైటిల్ కోసం శ్రమిస్తున్నారు.

బయట మరింత శ్రమిస్తున్న ఫ్రెండ్స్
బిగ్ బాస్ షో తెలుగులో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రియాలిటీ షో ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఐదోది కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో తమకు నచ్చిన వాళ్లను విజేతను చేయాలని టాప్ 5 కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసి మరీ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు.

సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు కూడా
బిగ్ బాస్ షోకు సామాన్యులు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఇప్పటికే ఎంతో మంది ఈ షోపై ఉన్న ఇష్టాన్ని స్వయంగా ప్రకటించుకున్నారు. అదే సమయంలో తమకు నచ్చిన కంటెస్టెంట్లను కూడా సపోర్ట్ చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో బిగ్ బాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీనికి ఇంకా అభిమానులు పెరుగుతున్నారు.

ఐదో సీజన్ విన్నర్‌ను చేయాలని రెడీ
ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌కు సంబంధించి కూడా చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారానో.. డైరెక్టుగానో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది బుల్లితెర, వెండితెరకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరిలలో తమకు నచ్చిన వాళ్లకు ఓట్లు అడుగుతున్నారు.

ఆ కంటెస్టెంట్ కోసం ప్రభాస్ ఫ్యామిలీ
ప్రస్తుతం జరుగుతోన్న బిగ్ బాస్ ఐదో సీజన్‌లో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు సపోర్టు చేస్తున్న సెలెబ్రిటీల జాబితా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటుడు కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి ఓ కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించారు. అది ఎవరో కాదు.. ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర. అవును.. ఈ మేరకు ఆమె ఓ వీడియోను షేర్ చేశారు.

తెలుగు వాళ్లకు గర్వకారణం అయ్యావు
తాజాగా శ్యామలా దేవి.. శ్రీరామ చంద్ర కోసం ఓ వీడియోను షేర్ చేశారు. అందులో 'హాయ్ శ్రీరామ్.. నీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. నీ సింగింగ్ అంటే నాకు, కృష్ణం రాజు గారికి చాలా ఇష్టం. ముఖ్యంగా నీ భక్తి పాటలంటే ఇంకా ఇష్టం. నిన్ను చాలా లైక్ చేస్తాం. అప్పుడు నువ్వు ఇండియన్ ఐడల్‌కు వెళ్లి గెలిచి వచ్చి తెలుగు వాళ్లందరికీ ఎంతో గర్వకారణం అయ్యావు' అని చెప్పారు.

మా కుటుంబం తరపున కోరుతున్నా
ఇక, ఈ వీడియోలో శ్యామలా దేవి బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. 'ఇండియన్ ఐడిల్ మాదిరిగానే ఇప్పుడు కూడా నువ్వు బిగ్ బాస్ షోలో విజయం సాధించాలని.. అందరూ నిన్ను ఓట్లు వేసి గెలిపించాలని మా ఫ్యామిలీ తరపున కోరుకుంటున్నాను. నువ్వు కచ్చితంగా విన్ అవుతామని ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.. ఆల్ ది బెస్ట్ శ్రీరామ్' అంటూ శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











