Bigg Boss: షోలో సరైన మగాడే లేడన్న బ్యూటీ.. ఇప్పుడేమో అతడితో రొమాన్స్.. భర్త అంటూ షాకింగ్‌గా!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా మొదలై.. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం తెలుగులోకి కూడా ఈ షో పరిచయం అయింది. ఆరంభంలోనే ఎన్నో అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇది సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఏకంగా నాలుగు సీజన్లు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ లేడీ కంటెస్టెంట్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా ఒకరిని భర్త అంటూ చెప్పి అందిరికీ షాకిచ్చింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 19 మందితో మొదలైన ఐదో సీజన్

19 మందితో మొదలైన ఐదో సీజన్

తెలుగులో బిగ్ బాస్‌ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వీటిలో మహా అంటే పదహారు మంది కంటెస్టెంట్లు మాత్రమే మొదటిరోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఐదో సీజన్‌లో మాత్రం రికార్డు స్థాయిలో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ప్రవేశించారు. దీంతో హౌస్‌లో సందడి వాతావరణం కనిపించింది. ఇక, గత వారం సరయు ఎలిమినేట్ అయిపోయింది.

 స్పెషల్ అట్రాక్షన్ అయిన లహరి

స్పెషల్ అట్రాక్షన్ అయిన లహరి

ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో చాలా మంది సుపరిచితులైన వాళ్లే ఉన్నారు. అయితే, కొందరు మాత్రం పెద్దగా గుర్తింపు దక్కని వాళ్లు కూడా ఉన్నారు. అందులో లహరి షారి ఒకరు. చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె.. పెద్దగా పాపులర్ అవలేదు. కానీ, షోలోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తోంది.

లవ్ గురించి ప్రశ్న.. ఎవరూ లేరని

లవ్ గురించి ప్రశ్న.. ఎవరూ లేరని

బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆర్జే కాజల్.. ప్రతి ఒక్కరి మనసులోని పర్సనల్ విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఆమె లహరితో సమావేశం అయింది. ఆ సమయంలో కంటెస్టెంట్లుగా వచ్చిన బ్యాచ్‌లర్స్‌లో ఎవరు నచ్చారు అని ప్రశ్నించింది. దీనికి లహరి ఎవరూ నచ్చలేదని చెప్పేసింది.

షోలో మగాడే లేడని నాగ్‌కు ఆన్సర్

షోలో మగాడే లేడని నాగ్‌కు ఆన్సర్

గత వారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున.. లహరి షారిని ఉద్దేశించి 'నువ్వు వచ్చే వారమైన రోజ్ ఎవరికైనా ఇస్తావని అనుకుంటున్నా' అన్నాడు. దీనికామె 'ఎవరికీ ఇవ్వాలని అనిపించట్లేదు సార్. ఇంకెవరినైనా పంపండి' అంటూ బదులిచ్చింది. దీంతో నాగ్ 'అంటే ఇంట్లో మగాళ్లే లేరా? బాయ్స్ మీరంతా వేస్ట్ అంటుంది' అని ఫన్నీ కామెంట్స్ చేశాడు.

ఇప్పుడేమో అతడితో రొమాన్స్ చేసి

ఇప్పుడేమో అతడితో రొమాన్స్ చేసి

బిగ్ బాస్ హౌస్‌లో అసలు సరైన మగాళ్లే లేరని చెప్పిన లహరి షారి.. రెండు రోజులుగా మానస్‌తో ఎంతో చనువుగా ఉంటోంది. ఓ రోజైతే ఏకంగా అతడిని తన బెడ్ దగ్గరకు పిలిచి మరీ హగ్గుల మీద హగ్గులు ఇచ్చేసింది. ఆ తర్వాత అతడు కూడా ఆమెతో అంతే క్లోజ్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే లహరికి మసాజ్ కూడా చేశాడు. దీంతో వీళ్ల మధ్య ట్రాక్ నడుస్తుందని అంటున్నారు.

ఏకంగా భర్త అంటూ షాకింగ్ రిప్లైతో

ఏకంగా భర్త అంటూ షాకింగ్ రిప్లైతో

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రవి, కాజల్‌తో బీబీ న్యూస్ అనే టాస్క్ చేయించారు. ఆ సమయంలో లహరితో వాళ్లు ర్యాపిడ్ ఫైర్ నిర్వహించారు. అప్పుడామెకు ఇంట్లో సింగిల్స్‌ అయిన కంటెస్టెంట్ల పేర్లు చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగారు. దీంతో వెంటనే ఆమె మానస్ పేరు చెప్పేసింది. ఆ తర్వాత మానస్ కూడా తన భార్యగా లహరి పేరు చెప్పడంతో డౌట్లు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X