For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg boss telugu 5: నా కొడుకు షణ్ముఖ్ గాడు అంటూ షాక్ ఇచ్చిన ఉమ.. లోబో, ప్రియాంక రొమాంటిక్ ట్రాక్

  |

  బిగ్ బాస్ మొదటి వారం కంటెస్టెంట్స్ పరిచయాలతో అలాగే ఇంటిలోని బాధ్యతలతో సాధారణంగానే కొనసాగింది. అప్పుడప్పుడు కొంతమంది వారి వాయిస్ ను ఎక్కువ చేసి హైలెట్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి.. ఇక రెండవ వారం అయితే కంటెస్టెంట్స్ మధ్యలో కొట్లాటలు మరొక రేంజ్ లోకి వెళ్ళాయి. కెప్టెన్సీ టాస్క్ కోసం రెండు విడిపోయినవారు ఫిజికల్ టాస్క్ లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే గొడవల డోస్ మరింత ఎక్కువ అయ్యిందని బిగ్ బాస్ చిన్న రిలీఫ్ కోసం ఒక ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు కంటెస్టెంట్స్ మధ్యలో 5 మచ్ ఫన్ అంటూ సరికొత్త ట్రాక్ ను క్రియేట్ చేశారు.

  ఫిజికల్ టాస్క్ లలు పెట్టిన తర్వాత

  ఫిజికల్ టాస్క్ లలు పెట్టిన తర్వాత

  మొదటి వారం కెప్టెన్సీ కోసం పెద్దగా ఫిజికల్ టాస్క్ లు అయితే పెట్టలేదు. కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణం లోనే ఎక్కువగా కొనసాగారు. గొడవ పడినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే కలిసిపోతూ కొనసాగారు. మొదటివారం ఎవరు నామినేట్ చేయాలో కూడా ఎవరికీ అర్థం కాలేదు. నామినేట్ చేసినప్పుడు కూడా సరైన కారణాలను కూడా ఎవరూ చెప్పలేకపోయారు. అందుకే మాత్రం బిగ్ బాస్ ఒక్కసారిగా ప్లాన్ మార్చేశాడు. రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఎక్కువగా ఫిజికల్ టాస్క్ లలు పెట్టిన తర్వాత కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఏ మాత్రం తగ్గకుండా పోరాడారు.

  హింస లాంటి టాస్క్ ఇచ్చి

  హింస లాంటి టాస్క్ ఇచ్చి

  WWE తరహాలో కొందరైతే ఎగబడి మీద కూడా పడ్డారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని కొంతమంది అమ్మాయిలు అనేక రకాల కారణాలతో కొంతమంది అబ్బాయిలపై కంప్లైట్ చేశారు. బిగ్బాస్ ఒకవైపు హింస లాంటి టాస్క్ ఇచ్చి మళ్లీ ఎవరు హింసకు పాల్పడే కూడదు అంటే వివరణ ఇవ్వడం మరొక విశేషం. ఇక బిగ్బాస్ సీజన్ 5లో 5 మచ్ ఫన్ అని మొదలు పెట్టిన నాగార్జున తప్పకుండా ఈసారి అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పారు.

  ఏ గల్లీ అయినా కూడా నాకు పర్వాలేదు

  ఏ గల్లీ అయినా కూడా నాకు పర్వాలేదు

  ఇక ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో 5 మచ్ ఫన్ కోసం చిన్న రిలీఫ్ ప్లాన్ చేసాను అంటూ మరొక ప్రోమో విడుదల చేశారు. ఇక ప్రోమోలో లోబో ప్రియాంక మధ్యలో ఒక సరికొత్త లవ్ ట్రాక్ మొదలైనట్లు అర్థమైంది. లోబో ప్రియాంకను చూసి కొంటెగా పాటలు పాడుతూ ఉన్నాడు. ఇక వారు ఇద్దరు ఆటో డ్రైవర్, ప్యాసింజర్ తరహాలో మంచి కామెడీ అయితే పండించారు. సికింద్రాబాద్ వస్తావా అంటూ ప్రియాంక లోబో ఆటో ఎక్కుతుంది. అయితే సికింద్రాబాద్ గల్లీలో ఎక్కడికి వెళ్లాలి అని అడగడంతో.. ఏ గల్లీ అయినా కూడా నాకు పర్వాలేదు అని ప్రియాంక కౌంటర్ ఇస్తుంది. ఇక ఆ తరువాత ఎక్కడి నుంచి వచ్చారు అని అడగ్గానే నేను లండన్ నుంచి వచ్చాను అని ప్రియాంక స్టైలిష్ గా చెబుతుంది.

  Nee Jathaga Movie Official Teaser

  సిరి కాళ్లపై పడిన ఉమ

  ఇక నిన్నమొన్నటి వరకు గోడవలతో హడావిడిగా కనిపించిన సిరి, ఉమా మొదటిసారి ఒక స్కిట్ చేశారు. నా బంగారు తల్లి అంటే ఉమా చాలా నాటుగా కామెంట్ చేసింది. ఇక నా కొడుకు ఉన్నాడు షణ్ముక్ అంటూ నువ్వు వాడు కలొస్తే.. అంటూ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో షాకిచ్చింది. ఇక నన్ను నన్ను క్షమించు అంటూ ఉమా, సిరి వెంటపడితుంది. ఉమాదేవిని పదే పదే కాళ్లపై పడమని చెనుతుంది. అనంతరం ఉమాదేవి ఇది ఎక్స్పెక్టేషన్స్ అంటూ రియాలిటీ చూడండి. పగిలిపోద్ది అని మరొక కౌంటర్ ఇస్తుంది. అనంతరం సిటీ మార్ పాటకు అందరు కూడా కలిసి డాన్స్ చేశారు. చూస్తుంటే ఈ రోజు ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Bigg boss telugu 5 latest promo 5 much fun
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X