Bigg boss 5 Today episode: గుంటనక్క, ఊసరవెల్లి మధ్యలో చిచ్చు.. సిగ్గేస్తోంది అంటూ రవి.. షాక్ ఇచ్చిన కాజల్!

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత వారి వ్యక్తిగత విషయాల గురించి సెలబ్రిటీలు ఏ మాత్రం లెక్క చేయకుండా ఉండాల్సి వస్తుంది. పరిస్థితులు కొన్నిసార్లు పాజిటివ్ గా అనిపించవచ్చు మరికొన్నిసార్లు నెగిటివ్ అని కూడా అనిపించవచ్చు. అయితే హీరో లేదంటే విలన్ అయినా అవ్వాలి. ఎంత ప్రయత్నం చేసినా కూడా బిగ్ బాస్ హౌస్ లో మంచి వాడిగా కొనసాగడం సాధారణమైన విషయం కాదు. బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగుపెట్టిన కొంతమంది మొదట్లో పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత మెల్లగా నెగిటివ్ షేడ్స్ తో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం యాంకర్ రవి హౌస్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. అతను వేసిన ప్రణాళికలు కూడా బెడిసి కొడుతున్నాయి. అతని దగ్గరగా ఉండే స్నేహితులు కూడా దూరమవుతున్నారు. నటరాజ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి గుంటనక్క ఊసరవెల్లి పేర్లకు అసలు రూపాల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

యాంకర్ రవి.. నెగిటివ్ గా..

యాంకర్ రవి.. నెగిటివ్ గా..

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితిలు ఎప్పటికప్పుడు మారి పోతూ ఉండడంతో నిత్యం మంచి వాడిలాగా కొనసాగాలి అంటే చాలా కష్టంగానే ఉంటుంది. గొడవలు జరిగినప్పుడు టాస్క్ లో భాగంగా ఒకరికొకరు తెలియకుండానే శత్రువులకు మారిపోతుంటారు. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో తప్పనిసరిగా స్నేహితులకు కూడా గొడవలు అవుతూనే ఉంటాయి. అయితే గత రెండు వారాల్లో కూడా యాంకర్ రవి ఒక్కసారిగా నెగిటివ్ అవుతున్నాడు.

గుంటనక్క అతనే..

గుంటనక్క అతనే..

ప్రియ, లహరి విషయంలో యాంకర్ రవి మాట్లాడిన విధానం అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. యాంకర్ రవి మాటలకు ఎవరైనా తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అని షణ్ముఖ్ ఇప్పటికే ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఈ వారం ఎలిమినేట్ లో కూడా అదే విషయాన్ని చెబుతూ నామినేట్ చేయడం హౌస్ లో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదివరకే నటరాజ్ మాస్టర్ కూడా ఒక గుంట నక్క అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందని బలమైన బాణం వేసిన విషయం తెలిసిందే.

నటరాజ్ మాస్టర్ vs రవి

నటరాజ్ మాస్టర్ vs రవి

నాగార్జున వచ్చిన సమయంలో కూడా ఎక్కువగా గుంటనక్క అనే పదాన్ని వాడడం ఉండడంతో అందరూ కూడా రవిని తదేకంగా చూడటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై యాంకర్ రవి నట్రాజ్ మాస్టర్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. ఇప్పటికే రెండు మూడు సార్లు అడిగినప్పటికీ నటరాజ్ మాస్టర్ అలా ఎందుకు అనుకుంటున్నావు అంటూ ఆ ఆలోచన వస్తే నీ ఇష్టం అని.. తెలివిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

నెమలి ఎగిరిపోయింది..

నెమలి ఎగిరిపోయింది..

నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా ఇదే విషయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా మళ్లీ రవి నెగిటివ్ గా మారుతున్నట్లు కూడా అర్థమవుతుంది. యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ తో గుంటనక్క విషయంపై ఏదో ఒకటి తెలుసుకోవాలి అని డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది. ఇక లోబో నటరాజ్ మాస్టర్ రవి ముగ్గురు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా అందులో లహరి మ్యాటర్ కూడా వచ్చింది. మొన్ననే నెమలి ఎగిరిపోయింది అని నటరాజ్ మాస్టారు అనడంతో లోబో లహరి లఅని సమాధానం ఇచ్చాడు. ఈ కౌంటర్ రవికి పడినట్లుగా తెలుస్తోంది.

నాకే సిగ్గేస్తోంది..

ఒక గుంట నక్క నేనే కదా అంటూ నట్రాజ్ మాస్టర్ తో రవి డైరెక్ట్ గా అడిగేసాడు. వీరి సంభాషణ మొదట కామెడీగానే మొదలైనప్పటికీ ఆ తర్వాత రవి సిగ్గేస్తోంది అని చెప్పేశాడు. ప్రతివారం నాగార్జునగారు గుంటనక్క అని అనగానే ప్రతి ఒక్కరు కూడా నా వైపు తిరిగి చూస్తున్నారు. అది నాకు ఎలా ఉంటుంది అని రవి నటరాజ్ మాస్టర్ ను అడగడంతో ఊసరవెల్లి మ్యటర్ కూడా కూడా వచ్చేసింది.

విశ్వ రవి మధ్యలో చిచ్చు

విశ్వ రవి మధ్యలో చిచ్చు

ఒక ఊసరవెల్లి నాతో వచ్చి మాట్లాడాడు. మీరు కరెక్ట్ గా పేరు పెట్టారు అని నాతో చెప్పాడు అనగానే అందుకు రవి.. విశ్వ అన్న కదా అంటూ సందేహం వ్యక్తం చేశాడు. దీంతో నటరాజ్ మాస్టర్ కూడా అదే పర్ఫెక్ట్ అంటూ తల ఊపడంతో వారిద్దరి మధ్య చిచ్చు మొదలైంది. గుంట నక్క అని నువ్వు కరెక్ట్ గా పేరు పెట్టావు అని నాతో అన్నట్లు నటరాజ్ మాస్టర్ చెప్పినట్లు రవి విశ్వ కు తెలియజేశాడు. అందుకు విశ్వ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Recommended Video

#BiggBossTelugu5 : Lobo, Nataraj Master Lost It Completely || Filmibeat Telugu
దూరమైన కాజల్

దూరమైన కాజల్

ఇక మరో వైపు కాజల్ రవి మధ్యలో కూడా దూరం పెరిగినట్లు తెలుస్తోంది. కాజల్ మానస్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రవి కాజల్ తో మాట్లాడడానికి వచ్చాడు. కానీ రవి పక్కన కూర్చోవడానికి కాజల్ ఏ మాత్రం ఒప్పుకోలేదు. నామినేషన్ న్ అసలు కాజల్ ఫిజికల్ గా టచ్ చేయడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని అనడం తో కాజల్ అది మనసులో పెట్టుకుని ప్రశ్నించింది.

తనకు ఏమాత్రం మాట్లాడాలని లేదు అంటూ.. అలాంటి పదం ఎలా వాడావు అని ప్రశ్నించింది. ఇక తనకు నచ్చలేదని, మాట్లాడవద్దని చెప్పిన కాజల్ శ్వేత ని పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. మరి ఈ పరిణామాలు యాంకర్ రవికి ఎలాంటి ఇబ్బందులను తెస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X